Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రేమ పేరుతో పిల్లలకు నష్టం కలిగించే సంభాషణలు..తల్లిదండ్రులు ఎప్పటికీ చెప్పకూడని మాటలు!
కాకి పిల్ల కాకికి ముద్దు అని ఏ పేరెంట్స్ కి అయినా వారి పిల్లలంటే ముద్దుగానే ఉంటుంది. వారు ఎలా ఉన్నా సరే ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమిస్తారు. వారి భవిస్యత్తు బంగారుెమయంగా ఉండాలని,త మ బిడ్డ ఎలాంటి కష్టాలు పడకూడదని కోరుకుంటారు. అయితే ఈ ప్రేమ, ఆరాటంలోనే కొన్నిసమయాల్లో మనకు తెలియకుండానే మన నోటి వెంట కొన్ని మాటల తూటాలు పేలుతుంటాయి. అవి వారి లేత హృదయాల్లో ఎంత లోతైన గాయాలు చేస్తాయో మనం ఊహించలేం. పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, వారిని మానసికంగా కుంగదీసే ఐదు ప్రమాదకరమైన మాటల గురించి ఇక్కడ చూడండి.
పోలిక అనే పదునైన కత్తి
పక్కింటి బాబు చూడు నువ్వు ఎలా ఉన్నావ్ చూడు అనే మాట మీ బిడ్డ ఆత్మవిశ్వాసం అనే లేతమొక్కను మొదట్లోనే చిదిమేస్తుంది. ప్రతి బిడ్డ ఒక అద్భుతమైన, ప్రత్యేకమైన సృష్టి. ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది. ఇతరులతో పోల్చినప్పుడు, తాము ఎప్పటికీ సరిపోమనే నిరంతర అభద్రతాభావంలోకి జారిపోతారు. తమను తాము ప్రేమించుకోవడం మానేసి వేరొకరిలా మారడానికి విఫలయత్నం చేస్తారు. వారిలోని ప్రత్యేకతను గుర్తించి ప్రశంసించండి..అప్పుడే వారు ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు.

నీకు మాట్లాడే పద్ధతే తెలీదు
పిల్లలు తమ భావాలను, అభిప్రాయాలను ఎలా వ్యక్తపరచాలో నేర్చుకునే దశలో ఉంటారు. ఆ సమయంలో ఇలాంటి మాట వారి గొంతులో ఓ తెలియని ముల్లులా గుచ్చుకుంటుంది. మాట్లాడితే అమ్మానాన్న తిడతారనే భయంతో వారు తమ భావాలను బయటకు చెప్పడానికి వెనకడతారు. క్రమంగా మౌనానికి పరిమితమైపోతారు. వారికి ఎలా మాట్లాడాలో ప్రేమగా నేర్పించండి, అంతేగానీ వారి గొంతు నొక్కేయకండి.
చిన్నదానికే ఈ ఏడుపా?
పిల్లల ప్రపంచం చాలా చిన్నది, వారి భావోద్వేగాలు కొండంతలు. వారికి చిన్నదిగా అనిపించే విషయం, వారి దృష్టిలో చాలా పెద్దది కావచ్చు. వారి ఏడుపును, బాధను మీరు తేలికగా తీసిపారేసినప్పుడు నా బాధ ఎవరికీ అర్థం కాదు అనే నిర్ణయానికి వస్తారు. ఇది వారి భావాలను లోపలే అణచివేసుకునేలా చేస్తుంది. భవిష్యత్తులో ఇది తీవ్రమైన మానసిక సమస్యలకు దారితీయవచ్చు. వారి భావోద్వేగాలను గౌరవించండి.
నీ వల్లే మా కలలు నెరవేరాలి
తల్లిదండ్రులుగా మనం సాధించలేనివి మన పిల్లలు సాధించాలని కోరుకుంటాం. కానీ మన కలల భారాన్ని వారి భుజాలపై మోపినప్పుడు, వారు తమ ఇష్టాలను చంపుకొని, మీ ఆశలను నెరవేర్చే యంత్రాలుగా మారిపోతారు. ఒకవేళ విఫలమైతే, మీ ప్రేమను కోల్పోతామనే తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. వారి కలలను కననివ్వండి, వాటిని చేరుకోవడానికి మీరు తోడుగా నిలవండి.
నీకోసం మేం ఎంత చేస్తున్నామో తెలుసా?
ఈ మాట పిల్లల మనసులో తీర్చలేని అపరాధ భావనను నింపుతుంది. తల్లిదండ్రుల ప్రేమ, త్యాగం వెలకట్టలేనివి. కానీ దాన్ని పదేపదే చెప్పడం ద్వారా వారి ప్రేమను ఒక రుణంలా భావించేలా చేస్తారు. ఇది వారిని నిరంతరం మిమ్మల్ని సంతోషపెట్టాలనే ఆందోళనలో ఉంచుతుంది. మీ ప్రేమ షరతులు లేనిదని వారికి తెలియజేయండి.



Click it and Unblock the Notifications