Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇలా బాయ్‌ఫ్రెండ్‌ను మీ ప్రేమకు బానిసను చేసుకోండి
ప్రేమికులకు ఒకరంటే ఒకరికి సర్వస్వం. ఒకరి ప్రేమ కోసం ఒకరు పరితపిస్తారు. ప్రియుడు లేదా ప్రియురాలు తమకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. అలాగే వారి వెంట తిరగాలని, వారంటే పడి చావాలని కోరుకుంటారు.

అబ్బాయిల విషయం పక్కన పెడితే అమ్మాయిలు మాట్లాడే చిన్న చిన్న మాటలు కొన్ని చేతలు చాలు అబ్బాయిలు అమ్మాయిల కొంగు పట్టుకుని తిరగడానికి. మనసుకు హత్తుకునే ఒక్క మాట చాలు ప్రతి మగాడు చంటి పిల్లాడుగా మారిపోతాడు. ప్రియురాలికి దాసోహం అనేస్తారు.
మగాళ్లను కొంగుకు కట్టుకోవాలంటే ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు చూద్దాం.

1. మీరు మీ బాయ్‌ఫ్రెండ్‌ను ప్రేమిస్తున్నట్లు చెప్పండి
మీ బాయ్‌ఫ్రెండ్‌ను మీరు గాఢంగా ప్రేమిస్తున్నారని తెలిసేలా చేయాలి. అందరూ ప్రేమను కోరుకుంటారు. మీరు చేసే ప్రతి పని మీరు మీ ప్రియుడిని ప్రేమిస్తున్నట్లు తెలుసుకునేలా చేయాలి. అలాంటి మాటలు మాట్లాడాలి. అప్పుడప్పుడు చేతలతోనూ మీ ప్రేమను వ్యక్తీకరించాలి.

2. అతనే అత్యంత ముఖ్యమని అనిపించాలి
బాయ్‌ఫ్రెండ్‌ను మీ కొంగుకు కట్టుకోవాలని అనుకుంటే వారికి ముందు ప్రేమను తెలియజేయాలి. అదే సమయంలో వారకి గౌరవం, విలువ ఇవ్వాలి. మీరు విలువ ఇచ్చినప్పుడే మీకు విలువ అందుతుంది.
వారికి ఎప్పుడూ మద్దతు ఇవ్వాలి. ఇతరుల ముందు వారి గౌరవం పెరిగేలా ప్రవర్తించాలి. ఎట్టిపరిస్థితుల్లో ఎగతాళి చేయవద్దు.

3. ఇద్దరూ సమానమని గుర్తుంచుకోవాలి
మీ బాయ్‌ఫ్రెండ్‌ను మీ కొంగుకు కట్టుకోవాలనుకోవడం ఓకే. కానీ మీరిద్దరూ సమానం అని గుర్తుంచుకోవాలి. భావాలను వ్యక్తం చేయడానికి, ఆలోచనలు పంచుకోవడానికి సమప్రాధాన్యం ఇవ్వాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎదుటి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి.

4. తెలివిగా వ్యవహరించాలి
తెలివిలేని వ్యక్తిలా కనిపించకూడదు. అది మీ బాయ్‌ఫ్రెండ్ అయినా ఇంకెవరైనా వారు మీకు గౌరవం ఇవ్వాలంటే తెలివిగా వ్యవహరించాలని గుర్తుంచుకోండి. ఏదైనా చర్చ చేస్తున్నప్పుడు అర్థవంతంగా మాట్లాడాలి. తెలియని విషయంలో జోక్యం చేసుకోవడం, తెలియని విషయాల గురించి ఎక్కువ మాట్లాడటం వల్ల చులక అయిపోతారు.

5. ఆనందించడానికి భయపడొద్దు
ఎలా ఆనందించాలో తెలిసిన అమ్మాయిలంటే అబ్బాయిలకు ఇష్టం. సమయానుకూల జోకులు, సరదా కార్యకలాపాలను ఆస్వాదించడానికి, నవ్వడానికి, ఆడుకోవడానికి ముందు ఉండండి. భయపడి వెనకే ఉండొద్దు. మీ బాయ్‌ఫ్రెండ్‌తో మంచి సమయాన్ని గడపండి.



Click it and Unblock the Notifications