Latest Updates
-
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.!
పెళ్లాంతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని గొంతు కోసి రక్తం తాగిన భర్త!
రోజురోజుకూ మానవ సంబంధాల విలువలు తగ్గిపోతున్నాయి. కట్టుకున్న వాళ్లపై, కుటుంబ సభ్యులపై వచ్చే చిన్న చిన్న అనుమానాలే మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంటున్నాయి. ఓ ప్రాణాన్ని తీయడమే ఘోరం అంటే.. ఆ మనిషి గొంతు కోసి అతడి రక్తాన్ని తాగి వీడియో తీయించుకున్నాడో వ్యక్తి. ఇది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.
కర్ణాటక జిల్లా చిక్కబళ్లాపూర్ లో చింతామమికి చెందిన విజయ్ కూరగాయలు, బట్టల వ్యాపారం చేసేవాడు. ఇందుకోసం మారేష్ అనే వ్యక్తి వాహనాన్ని అద్దెకు తీసుకొని సరుకులు రవాణా చేసేవాడు. ఈక్రమంలోనే మారేష్ విజయ్ ఇంటికి వచ్చేవాడు. అలా విజయ్ భార్యతో మారేష్ కు ఏర్పడిన పరిచయం వివాహేతర బంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న విజయ్..

భార్యను, మారేష్ ను మందలించాడు. అయినప్పటికీ వారు మారకపోవడంతో జూన్ 19వ తేదీన సరుకులు రవాణా చేయాలంటూ మారేష్ ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. కత్తితో మారేష్ గొంతు కోశాడు. ఆపై అతడి రక్తం తాగాడు. అయితే విజయ్.. జాన్ అనే బంధువును కూడా వెంట తీసుకెళ్లగా.. అతడే ఈ తతంగాన్ని అంతా వీడియో తీశాడు.
ఆ తర్వాత తీవ్రంగా భయపడిపోయిన జాన్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత విజయ్ యే ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టించగా వీడియో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు విజయ్ ను అరెస్ట్ చేశారు.
భార్యలు వేరొకరితో అఫైర్ నడిపించడానికి కారణాలు:
స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా మోసం చేస్తారని ఒకప్పుడు అనుకునే వారు. భార్యభర్తల్లో భర్తలే ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారని చెప్పుకునే వారు. కానీ ఈకాలంలో వివాహేతర సంబంధాల్లో స్త్రీ, పురుషులు ఇద్దరిదీ సమాన స్థాయి. భర్త భార్యను మోసం చేయడానికి, భార్య భర్తను మోసం చేయడానికి కారణాలు భిన్నంగా ఉంటాయి. కారణాలు ఏవైనా జీవిత భాగస్వామితో కాకుండా వేరొక వ్యక్తితో సంబంధాలు పెట్టుకోవడం మాత్రం ఈమధ్యకాలంలో పెరిగిపోయింది.
సాన్నిహిత్యం లేకపోవడం:
ఒక స్త్రీ తనను మానసికంగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు భావించినా, భాగస్వామి తనకు మద్దతు ఇవ్వడం లేదని అనుకున్నా వేరొక వ్యక్తి దగ్గర అలాంటి మానసిక మద్దతును వెతుక్కుంటుంది. అలా మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుంది.
బోరింగ్, రొటీన్:
ప్రతి సంబంధంలో ఒక దశ ఉంటుంది. ఆ దశలో చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. రొటీన్ లైఫ్ ఏమాత్రం నచ్చదు. సంబంధంలో ఉత్సాహం లేదని భావిస్తే స్త్రీలు కొత్త అనుభవాలను, కొత్త భాగస్వాములను వెతుక్కోవచ్చు. తను ఉన్న సంబంధంలో లేని ఉత్సాహాన్ని తిరిగి పొందడం కోసం మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవచ్చు. అలా తను కొత్త స్పార్క్ ను వెతుక్కోవచ్చు.
శారీరక అవసరాలు తీరకపోతే:
దాంపత్య సంబంధంలో శృంగారం అత్యంత కీలకం. శృంగారం గురించి ఆడవారికి, మగవారికి అనేక కోరికలు ఉంటాయి. అయితే దాంపత్య బంధంలో అవి నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. కొందరు తమ కోరికలు తీర్చుకోవడం కోసం ఓపికగా ఎదురుచూస్తారు. మరికొందరు శారీరక అవసరాల కోసం మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటారు.
శ్రద్ధ లేకపోవడం:
ఒక స్త్రీ తన భాగస్వామి తనకు అవసరమైన శ్రద్ధ మరియు ఆప్యాయత ఇవ్వడం లేదని భావిస్తే ఆమె మరింత శ్రద్ధ గల మరియు ప్రతిస్పందించే వ్యక్తితో సంబంధం పెట్టుకోవచ్చు. తన భాగస్వామి ఇతర విషయాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాడని లేదా అతను తన పట్ల ఆసక్తి చూపడం లేదని ఆమె భావించినప్పుడు ఇలా చేయవచ్చు.
ఆత్మగౌరవం లేకపోతే:
సంబంధంలో ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని సందర్భాల్లో కొందరు పురుషులు తమ భార్యలను చులకన చేస్తుంటారు. ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ప్రవర్తిస్తుంటారు. దీని వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బ తింటుంది. ఇలాంటి సందర్భాల్లో వారు వేరొక వ్యక్తితో తనకు గౌరవం ఇచ్చే వ్యక్తితో సంబంధం పెట్టుకోవచ్చు.
టెంప్టేషన్:
కొందరు స్త్రీలు తమకు సంబంధంలో అన్ని ఉన్నప్పటికీ మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంటారు. దీనికి టెంప్టేషనే కారణం. అంటే తప్పు చేయడానికి, మోసం చేయడానికి అవకాశం ఉంటే వేరొక వ్యక్తితో అఫైర్ పెట్టుకుంటారు. వారికి ఆకర్షణీయంగా కనిపించినా, లేదా కొత్తగా ట్రై చేయాలని అనిపించినా, కొత్త అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉన్నా వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంటారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications