Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
పెళ్ళయ్యాక ప్రేమను కాపాడుకోవడం ఎలా ?
పెళ్ళవడం తేలికే. కానీ పెళ్లి చేసుకుని హాయిగా వుండడం పూర్తిగా వేరే విషయం. అదీ కొంత ప్రయత్నం అవసరమయ్యే విషయం. కొత్తగా పెళ్లి అయినప్పుడు, మీ భాగస్వామిని రోజూ అర్ధం చేసుకుంటూ పోవడం ఒక సాహసంలా వుంటుంది. కానీ సమయం గడిచే కొద్దీ, పిల్లలు, ఇతర బాధ్యతలు వచ్చే సరికి, ఆ మెరుపు తగ్గి, మీ జీవిత భాగస్వామితో రొటీన్ గా ప్రవర్తించడం మొదలౌతుంది – ఇక మీరు పదే పదే అదే పాట పాడినట్లు వుంటుంది.
ఈ చర్విత చర్వణం మీకు విసుగేత్తిస్తే మీ బంధం లోకి కొంత తాజాదనం తీసుకు రావలసిన సమయం వచ్చిందన్నమాట.

1, ఓ డేట్ కి వెళ్ళండి : పరస్పరం పునరావిష్కరించుకోండి. ఒక బార్ లో ఒక డ్రింక్ కోసం కలవండి, లేదా సరదాగా ఒకరినొకరు ఆట పట్టించుకోండి. మీరు ఇంటి దగ్గరైనా చేయగల మీ కుటుంబం, పిల్లలు, బిల్లూ కాకుండా ఇంకేవైనా వాటి గురించి మాట్లాడుకోండి. మీ ప్రణయ బంధం తొలినాళ్ళలోని మధుర క్షణాలను గుర్తు చేసుకుని వాటిని మళ్ళీ సృష్టించుకోవడానికి ప్రయత్నించండి.
మీ ప్రేమను తరచుగా సైగలు, ముద్దులు, ముఖ్యంగా మాటల ద్వారా వ్యక్త పరచండి. “ఐ లవ్ యూ” చెప్పండి – చెప్పేటప్పుడు పరస్పరం కళ్ళలోకి చూసుకోండి.

2. టచ్ లో ఉండండి – అక్షరాలా : మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా తరచుగా మీ భాగస్వామిని తాకుతూ ఉండండి. చేతులు పట్టుకోవడం, అప్పటికప్పుడు కౌగలించుకోవడం, మొహం, జుట్టు, భుజం ఏదో ఒకటి తాకడం లాంటివి చేయండి. శృంగారం లేని ఇటువంటి పనులు మీరు మీ భాగస్వామితో ఎంత దగ్గరగా ఉండాలనుకుంటున్నారో వారికి తెలియచేస్తాయి. సిగ్గు పడకండి – మీరు పరస్పరం ఎంత ప్రేమించుకుంటారో, ఎంత గౌరవి౦చుకుంటారో మీ పిల్లలను చూసిన తెలుసుకోనివ్వండి.

3. మీ భాగస్వామిని ఆశ్చర్య పరచండి : మీ భాగస్వామిని తేలిగ్గా తీసుకోవద్దు. వారానికోసారైనా ఒక సర్ప్రైస్ ఇవ్వండి. అది ఏమైనా కావచ్చు – ఒక చిన్న లవ్ నోట్ లేదా ఒక పువ్వు లేదా ఒక మంచి ప్రదేశానికి వారాంతపు విహారం గానీ.

4. సరదాగా కొన్ని పనులు చేయండి. వానలో నడవడం, పని ఎగ్గొట్టి సినిమా కు వెళ్ళడం లాంటివి. మీ బంధంలోకి అప్పటి సరదాను తీసుకురండి.

5. డాన్స్ చేయండి : మీరు డాన్స్ నేర్చుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. దంపతులు ఇద్దరూ చేసే లాంటి సాల్సా, బాల్ రూమ్ డాన్స్, టాంగో లాంటివి నేర్చుకోండి. దీంతో మీ బిడియం తొలగడమే కాక మీరిద్దరూ శారీరికంగా, మానసికంగా కూడా ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతారు.

6. మీ మీద మీరు శ్రద్ధ వుంచండి : మీ రూపం పై బద్ధకం చూపొద్దు. మీ భాగస్వామి కోసం మీరు షేవ్ చేసుకోవడం, మీ అత్యుత్తమ డ్రెస్ వేసుకోవడం చాలా తప్పనిసరి.
ఆ మెరుపును సజీవంగా ఉంచడానికి చాలా చిన్న పనులు చాలు. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. ఓపికా, తీరికా లేదని వంకలు చెప్పకండి. ఆ వంకలకు పరిష్కారం వెతకండి. మీ వివాహ బంధం, మీ భాగస్వామి ఆ ప్రయత్నానికి తగినవే.



Click it and Unblock the Notifications
