Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఉమ్మడి కుటుంబంలో నివసించడంలో ఏర్పడే సమస్యలు
ప్రతీ మనిషి జీవితంలో కుటుంబం చాలా ముఖ్యం.తల్లి కడుపులో నుండి బయటకి వచ్చిన దగ్గరనుండీ, అక్క చెళ్ళెళ్ళు, అన్న దమ్ములు, భార్య ఇలా పలు రూపాలలో మనిషి జీవితం లో కుటుంబం ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది.మనిషి కష్ట సుఖాలలో తోడుండేది కుటుంబమే, ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబ సభ్యులే ప్రతీ మనిషికీ మొట్టమొదట పరిచయమయ్యే వ్యక్తులు.ఒకే ఇంట్లో కలిసి ఉండే ఉమ్మడి కుటుంబాలనుండి న్యూక్లియర్ కుటుంబాలుగా రూపాంతరం చెందుతున్నాయి కుటుంబాలు.ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రధానంగా న్యూక్లియర్ కుటుంబాలే కనిపిస్తున్నాయి.
అసలు కుటుంబాలలో ఈ మార్పు ఎలా వచ్చింది అని విశ్లేషించాల్సిన సమయం ఇది.ఉమ్మడి కుటుంబాలు చాలా మందికి ఒక సమస్య గా లేదా భారంగా పరిణమించాయి.ఒక్కసారిగా ఏదైనా మార్పు వస్తోంటే ఇలా ఎందుకు జరుగుతోంది అని మనం పరిశీలించాలి.ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి.మీరే కనుక ఉమ్మడి కుటుంబాలలోని ప్రతికూలతలని ఎదుర్కొంటున్నట్లయితే ఈ విషయం మీకు బాగా తెలుస్తుంది.అసలు ఉమ్మడి కుటుంబాలలో ఉండే ప్రతికూలతలు ఏమిటో, న్యూక్లియర్ ఫ్యామిలీలే ఎందుకు మంచివో చూద్దాము.

1.సంప్రదాయ భావాలున్న కుటుంబ పెద్ద
ఉమ్మడి కుటుంబాలలో సాధారణంగా కుటుంబ పెద్ద అంటే వయసులో బాగా పెద్దవారయి ఉంటారు. కుటుంబమంతా వారి ఆధ్వర్యంలోనే నడుస్తుంది.ఇక్కడే వారిలోని సంప్రదాయ వైఖరి బయటపడుతుంటుంది.ఒక్కోసారి ఇది అందరికీ ప్రతికూలత గా మారవచ్చు.ఉమ్మడి కుటుంబాల వల్ల ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలలో ఇది ఒకటి.కుటుంబ సభ్యులందరూ సర్దుకుని కుటుంబ పెద్ద మాట వినవలసి వస్తుంది. ఇలా సర్దుకుపోవడానికి కావాల్సిన రిలేషన్ షిప్ టిప్స్ ఉమ్మడి కుటుంబాలలోనివారు బాగా చెప్తారు.
2.చొరవ తీసుకోకపోవడం
ఉమ్మడి కుటుంబాలలో ఇంకొక ప్రతికూలత ఎవ్వరూ చొరవ తీసుకోకపోవడం.ఉమ్మడి కుటుంబాలలోని సభ్యులెవ్వరూ చొరవ తీసుకుని దేనికోసమైనా సరే ముందుకు రారు. ఎందుకంటే అందిన ప్రతిఫలాన్ని మిగతా సభ్యులతో పంచుకొనవలసివస్తుందన్న భయంతో.అందువల్లే చాలా మంది ఉమ్మడి కుటుంబాలలో ఉండటానికి ఇష్టపడరు.
3.స్త్రీల ప్రతిభ వ్యర్ధం
సాధారణంగా ఉమ్మడి కుటుంబాలలో స్త్రీలు వంటింటికే పరిమితమయిపోవడం వల్ల వారి ప్రతిభ సమూలంగా బయటకి రాకుండా వ్యర్ధమయిపోతుంది.అందువల్లే స్త్రీలు ఉమ్మడి కుటుంబాలకంటే విడిగా ఉండటానికే ప్రాముఖ్యతనిస్తారు.పైగా ఉమ్మడి కుటుంబ పరిస్థితులకి సర్దుకుపోవడం కూల స్త్రీలకి అంత సులువు కాదు.ఉమ్మడి కుటుంబం లో ఉండాలంటే ఒక్కోసారి రిలేషన్ టిప్స్ తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు సుమా. తస్మాత్ జాగ్రత్త.
4.కొరవడే ఏకాంతం
ఉమ్మడి కుటుంబం లో ఉండే మొట్టమొదటి ప్రతికూలత ఏకాంతం కొరవడటం.మీ పిల్లలతో లేదా భాగస్వామితో తగినంత సమయం గడపడానికి మీకు వీలు దొరక్కపోవచ్చు.ఉమ్మడి కుటుంబం లోని మిగతా సభ్యులతో కూడా సమయం వెచ్చించాల్సిరావడం వల్ల ముద్దు మురిపాలు ఎల్లప్పుడూ సాధ్యం కాదు.ఒకవేళ మీరు కనుక ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్లయితే మీ భార్యా పిల్లలకోసం తగినంత సమయం వెచ్చించడం మాత్రం మర్చిపోవద్దు. ఉమ్మడి కుటుంబాలలో నివసించేవారు తప్పక ఆచరించాల్సిన రిలేషన్ షిప్ టిప్ ఇది.
5.ఆర్ధిక పరిస్థితులు
ఉమ్మడి కుటుంబంలో నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలని పంచుకోవాల్సిరావడం వల్ల సర్దుకుని జీవించడం అలవాటయిపోతుంది. ఇది కుటుంబం యొక్క ఆర్ధిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది.ప్రతీవారు తమ బాధ్యతలని సక్రమంగా నెరవేర్చకపోవడానికి కారణం ఇతరులే అని నిందించే అవకాశం ఉంది.
ఇవండీ ఉమ్మడి కుటుంబం లో ఉండే ప్రతికూలతలు, జాగ్రత్త మరి.



Click it and Unblock the Notifications