Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
పెళ్లైన కొత్తలో... కపుల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్
పెళ్లైన తర్వాత న్యూ కపుల్స్ సంతోషంగా ఉన్నా... బయటకు చెప్పుకోలేని అనేక ఇబ్బందులను ఫేస్ చేస్తుంటారు. అనేక రకాల ప్రశ్నాలు వాళ్లను చిత్రహింసలు పెడుతుంటాయి. ఇండియన్ ఫ్యామిలీస్ లో ఇంట్లో ఉండే పెద్దవాళ్లు ఎక్కువగా వాళ్లను ఫోకస్ చేస్తుంటారు.
అయితే కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్లు అడిగే ప్రశ్నలు చాలా ఫన్నీగా ఉంటాయి. అలాగే.. ఇబ్బందికరంగానూ ఉంటాయి. ఫస్ట్ నైట్ తర్వాత.. ఇతరుల ముందుకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని.. ఇండియన్ కపుల్స్ చెబుతూ ఉంటారు. వింత వింత హావభావాలకు చాలా ఇబ్బందికి గురిచేసే సందర్భాలు చాలా ఉంటాయని.. చెబుతున్నారు. ఏ ప్రశ్నలు సంధించినా.. చిరునవ్వుతో తప్పుకోవడమే.. కొత్త జంటలకు ఉన్న మార్గం. ఇంతకీ.. పెళ్లైన కొత్త జంటకు ఎదురయ్యే ఇబ్బందులు, ప్రశ్నలేంటో ఓ లుక్కేద్దాం...

గుడ్ న్యూస్ ఎప్పుడు ?
పెళ్లైన కొన్ని రోజులకే.. అందరూ అడిగే ప్రశ్న గుడ్ న్యూస్ ఎప్పుడు అని. అదేనండి.. పిల్లలు ఎప్పుడు, గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారు వంటి కామన్ క్వశ్చన్స్ తో పెద్దవాళ్లు న్యూ కపుల్స్ ని ఇబ్బందికి గురిచేస్తుంటారు.

అత్త, మామలతో
చాలా మంది స్నేహితులు, రిలేటివ్స్ అత్తమామలకు దూరంగా ఉండమని కొత్త జంటకు సలహా ఇస్తుంటారు. అయితే ఇది వాళ్ల వ్యక్తిగత విషయం. వాళ్లు డిసైడ్ అవ్వాలి, వాళ్లతో కలిసి ఉండాలా ? వద్దా ? అన్నది వీళ్లు చెప్పడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

హనీమూన్
వర్క్ కారణంగా, కొన్ని పనుల కారణంగా హనీమూన్ కాస్త లేట్ అయ్యే అవకాశాలున్నాయి. అంతేకాదు.. వర్క్ టెన్షన్ లో ఇది వాయిదా పడుతూ ఉంటుంది. అయితే.. చాలా మంది హనీమూన్ ఎక్కడ, ఎలా జరుపుకుంటారని ప్రశ్నలతో విసుగు తెప్పిస్తూ ఉంటారు.

వర్క్ చేయనిస్తాడా ? లేదా ?
కొత్తగా పెళ్లైన జంటకు ఎదురయ్యే ఇబ్బందుల్లో ఇదొకటి. అతను నిన్ను వర్క్ చేయడానికి అంగీకరిస్తాడా ? లేదా ? అని. ఇది వాళ్లిద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ని బట్టి ఉంటుంది.

వంట
పెళ్లైన తర్వాత వంట చేయడం అమ్మాయిల డ్యూటీ. తనకోసం, తన భర్త కోసం వంట చేస్తుంది. అయితే.. చాలా మంది వంటపై అనేక రకాల ప్రశ్నలతో విసుగెత్తిస్తుంటారు. వంట చేస్తావా మీ భాగస్వామి కోసం అన్నప్రశ్నలు పెళ్లికూతుళ్లను ఇబ్బందికి గురిచేస్తాయి.

సెక్స్ లైఫ్
కొత్తగా పెళ్లైన జంటకు ఎదురయ్యే సూటి ప్రశ్నల్లో ఇదొకటి. చాలా చిత్రహింసలకు గురిచేసే అంశమిది. మీ సెక్స్ లైఫ్ ఎలా ఉంది అంటూ.. ఎవరైనా క్వశ్చన్ చేస్తే.. ఆ జంటకు చాలా కోపం వచ్చేస్తుంది.



Click it and Unblock the Notifications
