Latest Updates
-
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా?
భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడాలంటే..
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భార్యభర్తల మధ్య అన్యోన్యత కలకాలం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుని.. అభిప్రాయాలు, అభిరుచులు ఒకరినొకరు పంచుకుంటూ చిలకాగోరింకల్లా కలిసిమెలిసి ఉంటారు. అన్యోన్యత, ప్రేమానురాగాలు.. పెళ్లైన కొత్తలోనే ఉంటాయని.. రానురాను ఈ ముచ్చట్లన్నీ.. కనుమరుగవుతుంటాయని.. చెబుతుంటారు.
పిల్లలు, బాధ్యతలు, అవసరాలు.. ఇలా పెరిగే కొద్దీ భార్యభర్తల మధ్య అన్యోన్యతకు కాస్త దూరం పెరుగుంది. ఒత్తిడి, రకరకాల పనుల కారణంగా.. ఇద్దరూ ఒంటరిగా గడపడానికి సమయం దొరకదు. దీంతో విబేధాలకు దారితీయచ్చు. కాబట్టి.. ఎలాంటి అవసరాలు వచ్చినా.. ఎన్ని పనులు భుజానికేసుకున్నా.. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలకు కొరత రాకుండా ఉండాలంటే.. ఈ చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవండి. మీకు పెళ్లై ఎన్ని ఏళ్లైనా.. కొత్త జంటలా కనిపిస్తారు.

ప్రేమను వ్యక్తపరచడం
చిన్న చిన్న చిలిపి పనులే.. భార్యభర్తల మధ్య బంధాన్ని మరింత పెంచుతాయి. ఐ లవ్ యూ అని.. మేసేజ్ చేయడం, పేపర్ లో రాసి ఇంట్లో అతికించండి. లేదా మీ భాగస్వామి ఇష్టపడే వస్తువులు కానుకగా ఇచ్చి సర్ ప్రైజ్ చేసి.. మీ పార్ట్ నర్ పై మీకున్న ప్రేమను వ్యక్తపరచండి.

నవ్వించడం
ఇద్దరి మధ్య విబేధాలు వచ్చినప్పుడు, గొడవపడుతున్నప్పుడు ఎవరో ఒకరు సున్నితంగా వ్యవహరించాలి. ఎదుటి వ్యక్తిని నవ్వించి చూడండి.. ఫలితం మీకే తెలుస్తుంది. ఇద్దరూ నవ్వుతూ.. ఆనందంగా గడిపితే.. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా మారిపోతుంది.

ఇద్దరు ఏకాంతంగా గడపడం
నిత్యం ఉద్యోగాలు, స్కూళ్లు అంటూ బిజీగా గడిపేస్తుంటారు. అలాంటప్పుడు మీ కోసం కాస్త సమయాన్ని వెచ్చించండి. సరదాగా బయటకు వెళ్లడం లేదా సినిమాకు వెళ్లడం చేయడం ద్వారా సఖ్యత పెరుగుతుంది.

స్నేహితులతో మీటింగ్స్
ఇద్దరు ఏకాంతంగా గడిపినప్పుడు అన్యోన్యత పెరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ల ఫ్రీడమ్ కోరుకుంటారు. కాబట్టి వాళ్ల ఇష్టాలకు అనుగుణంగా మసులుకోవాలి. స్నేహితులతో గడపటానికి ఇష్టపడితే.. దాన్ని అర్థం చేసుకోవాలి.

అభిప్రాయాలు పంచుకోవడం
ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకోవాలి. అనుబంధం బాగుండాలంటే.. ప్రతి ఒక్క విషయం ప్రేమగా చర్చించాలి. కావాల్సిన సలహాలు, సూచనలు చెబుతూ ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ శాశ్వతం అవుతుంది. ఎలాంటి సమస్యలున్నా.. మీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిపోదు.



Click it and Unblock the Notifications