మీ భాగస్వామిని సంతోషపెట్టే 10 రొమాంటిక్ టిప్స్

సాధారణంగా కొన్ని జంటల పెళ్లైన కొత్తలో ఉండే ప్రేమ, ఆకర్షణ తర్వాత ఉండదని చెబుతుంటారు. పెద్దలు కుదిర్చిన వివాహమో లేదా... ప్రేమ వివాహమో చేసుకోవడం పెద్ద విషయం కాదు. పెళ్లితో ఏకమైన బంధాన్ని సజావుగా సాగించేందుకు తగిన మార్గాలను ఎంచుకోవాలి. లేదంటే పెళ్లైన కొత్తలో కపుల్స్ ఉండే ఆ ప్రేమ, ఆకర్షణ మెల్లమెల్లగా పిల్లలు పుట్టాక, బాధ్యతలు పెరిగాక కనుమరుగవుతుంటాయి.? మరి మీరేమంటారు?

ఖచ్చితంగా నిజమే అంటున్నారు సైకాలిజిస్టులు. ఎందుకంటే వీరు కొంత మంది పెళ్లైన జంటల మీద పరిశోధనలు జరిపినప్పుడు వారి నుండి చాలా విషయాలను గ్రహించారు. పెళ్లైన కొత్తలో ఉండే ప్రేమ, ఆప్యాయత, తర్వాత ఉండవని తేల్చేశారు. జంటల్లో చిన్ని చిన్న మనస్పర్థాలు.. యధాతథంగా గొడవలు పెరుగుతాయి. తద్వారా విడాకులు తప్పవు. ఈ మద్యకాలంలో చాలా మందిలో జంటలు పెళ్లైన కొన్ని సంవత్సరాలకే విడాకుల వరకూ కోర్టు మెట్లెక్కుతున్నారు. అందుచేత నేటి ట్రెండ్ ప్రకారం భాగస్వాముల మధ్య వివాహ బంధం స్ట్రాంగ్ గా ఉండాలంటే.. ఇద్దరూ సర్దుకుపోయే నైజాన్ని కలిగివుండాలి. పెళ్లయ్యాక కూడా భాగస్వాములు ఒకరిపై ఒకరు ప్రేమను కలిగివుండాలి. ఎన్ని పనులున్నా భాగస్వామి ఆరోగ్యం ఇతరత్రా విషయాలపై శ్రద్ధ చూపాలి.

మీ పార్ట్నర్ ను ఈ మద్యకాలంలో ఎక్కువగా సంతోషపెట్టిన లేదా స్పెషల్ గా ఫీలయ్యే అవకాశాన్ని కల్పించారా? ఎప్పుడో కొద్ది రోజుల క్రితం అని చెబుతారు?
కానీ మీ పాట్నర్ యొక్క మనస్సు తెలుసుకోగలిగితే మీ అంత అద్రుష్టవంతులు మరొకరుండరు. ఆమె పట్ల కొద్దిగా కృతజ్ఞత చూపించండి, ఆమెకోసం ఏదైన స్పెషల్ గా చేయండి, రోజూ లేకపోయినా ఏదో ఒక రోజు ఆమెను సంతోషంగా ఉండేటట్లు చూసుకోండి. ఆమె కష్టాలన్నింటిని మర్చిపోయి మీకు దాసోహం అయిపోతుంది.

ఆమె సంతోషం కోసం స్పెషల్ గా అంటే ప్రతి సారి శారీ, నగలు కొనమని చెప్పడం లేదు, ఆమె కోసం ఒక మూర మల్లెపువ్వులు పట్టుకెళ్లండి ఎంత సంతోషిస్తోందో... ఆమె సంతోషానికి ఖరీదైనవే అవసరం లేదు. ఎందుకంటే ఆమె మీ భార్య కాబట్టి, మీరు ఏం ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తుంది. ఆ పరిస్థితిలో ఆమెకు అది పెద్ద బహుమతిగా ఫీలవుతుంది. మీకు ఆమెంటే ఎంత స్పెషల్ అని భావిస్తుంది. ఇదొక్కటే కాదు,భార్యను సంతోషపెట్టడానికి చాలా ట్రిక్స్ అండ్ టిప్స్ ఉన్నాయి. వీటిని ఫాలో అయితే చాలు ఆమె మనస్సును మీరు గెలిచినట్లే. మీ కష్టసుఖాల్లో మీముందుండి నడిపించే మీ భాగస్వామికి మీరు ఏం చెయగుతారు. ఆమెను ఎప్పటికప్పడు సంతోషంగా ఉండేట్లు చూస్తే చాలు మీకు కొండత దైర్యాన్నిఇస్తుంది. మీ కష్టసుఖాల్లో వెన్నంటి ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో ఆమె సంతోషంగా లేనప్పుడు లేదా దు:ఖంలో ఉన్నప్పుడు, ఆమెను కన్వీన్స్ చేయడంలో మీరు ఫెయిల్ అయ్యుండొచ్చు. కానీ సందర్భాన్ని బట్టీ మీరు చేయగలిగే కొన్నిటిప్స్ అండ్ ట్రిక్స్ ను ఫాలో అయితే ఆమెను సంతోషంగా, మరింత బెటర్ గా ఫీలయ్యేందుకు సహాయపడుతాయి. మరి ఆ ట్రిక్స్ అండ్ టిప్స్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం...

ఆమెకోసం వంట చేయండి:

ఆమెకోసం వంట చేయండి:

ఆమెకోసం , ఆమెకు ఇష్టమైన వంట చేసి సర్ప్రైజ్ చేయండి. స్పెషల్ మీల్స్ అంటే ప్రయోగాలు చేయాల్సి అవసరం లేదు , సింపుల్ గా ..తక్కువ సమయంలో రెడీ అయ్యే రిసిపిని ఎంపిక చేసుకోండి. అంతే కాదు ఆమె కోసం ఇంట్లోనే చిన్న టేబుల్ పార్టీ ఏర్పాటు చేయండి. ఆమె కోసం మీరు స్పెషల్ గా చేసినందుకు గ్రేట్ గా ఫీలవుతుంది.

ఫ్లవర్స్ కొనివ్వుండి:

ఫ్లవర్స్ కొనివ్వుండి:

పువ్వులు కొనివ్వడానికి కారణాలేవి అవసరం లేదు. ఏ సందర్భంలో అయినా కొనివ్వొచ్చు . ఆమెకు ఇష్టమైన పువ్వులతో, రెడ్ రోస్ , సువాసనలిచ్చే పువ్వులతో సర్ ప్రైజ్ చేయండి.

నవ్వించండి:

నవ్వించండి:

మహిళలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఆమె మూడీగా ఉన్నప్పుడు, ఫన్నీ జోక్స్ లేదా మీ ఎక్స్పెషన్స్ , డ్రమాటిక్ ఎక్స్ ప్రెషన్స్ లేదా గెటప్స్ తో ఆమెను నవ్వించండి. ఒక మ్యాజిక్ క్రియేట్ చేయండి.

ఇంట్లో సహాయంగా ఉండండి:

ఇంట్లో సహాయంగా ఉండండి:

ఇంట్లో కొన్ని సందర్భాల్లో ఆమెకు ఇష్టంలేని పనులు మీరు చేసి పెట్టండి. క్లీనింగ్, కుక్కింగ్ వంటి వాటి ఆరోజు మీరు తీసుకోవడం వల్ల ఆమె చాలా రిలాక్స్ గా ఫీలవుతుంది .

అప్పుడప్పుడు షాపింగ్ తీసుకెళ్లండి:

అప్పుడప్పుడు షాపింగ్ తీసుకెళ్లండి:

ఎప్పుడో ఒకప్పుడు ఆమెను షాపింగ్ తీసుకెళ్లండి . డిఫరెన్స్ మీరే చూస్తారు . స్త్రీలను సంతోషపెట్టడంలో ఇంత కంటే మంచి ట్రిక్స్ మరొకటి ఉండదు? నేను చెప్పానని కాకుండా మీరే ఒక సారి ట్రై చేసి చూడండి.

బహుమతులివ్వండి:

బహుమతులివ్వండి:

పార్ట్నర్ కు గిప్ట్ ఇవ్వడానికి అకేషన్ ఉండక్కర్లేదు. ఎప్పుడైనా గిఫ్ట్ ఇవ్వొచ్చు. ఆమెకు అదే పెద్ద అకేషన్ అవుతుంది. ఆ సందర్భలో ఆమె ముఖం వెలిగిపోతుంది. అది ఖరీదైనది కావచ్చు, లేదా చిన్న బహుమతి కావచ్చు. ఆమెను సంతోషపెట్టడానికి ఇది ఒక అవకాశం.

ఆమెకోసం పాటలు పాడండి:

ఆమెకోసం పాటలు పాడండి:

ఆమెకోసం పాటలు పాడటానికి పాప్ సింగర్ అవ్వాల్సిన అవసరం లేదు, కూనిరాగాలు తీసినా సరే ఆమెముఖంలో ముసిముసి నవ్వులు మీరు గమనించవచ్చు . ఆ సందర్భంలో మీకు పాతరోజులు తిరిగి గుర్తొస్తాయి . అంతే కాదు, కూనిరాగాలతో పాటు డ్యాన్స్ కూడా చేయండి . ఇక అంతే మీ మీద ప్రేమతో పాటు, ఆమె ముఖంలో నవ్వులు టన్నుల కొద్ది ఉంటుంది.

 ఫూట్ లేదా బ్యాక్ మసాజ్:

ఫూట్ లేదా బ్యాక్ మసాజ్:

రోజంతా సేవ చేసిన అలసిపోయిన మీ పార్ట్నర్ కు సున్నితంగా ఫూట్ లేదా బ్యాక్ మసాజ్ చేయండి . ఈ చిన్న ట్రిక్ వండర్స్ ను క్రియేట్ చేస్తుంది . ఒత్తిడితో ఉన్న కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఎంత స్ట్రెస్ లో ఉన్నా సరే చిన్నిపాటి మసాజ్ తో ఎంతో రిలాక్స్ అవుతుంది.

ఎప్పుడూ మీరు చెప్పినట్లే కాదు, ఆమె చెప్పేవి కూడా వినండి:

ఎప్పుడూ మీరు చెప్పినట్లే కాదు, ఆమె చెప్పేవి కూడా వినండి:

ఆమె ఎమి చెప్పదల్చుకొన్నదో దాన్ని పూర్తిగా చెప్పనివ్వండి. ఇంట్లో ఏదైనా చర్చించాల్సి వచ్చినప్పుడు ఆమె మాటలకు కూడా విలువివ్వండి, అప్పుడే ఆమెకు మర్యాద ఇస్తున్నట్లు ఫీలవుతుంది. కుటుంబంలోని వారికి దగ్గరవుతుంది.

కిస్ చేయండి:

కిస్ చేయండి:

రిలేషన్ షిప్ లో ఒక సింపుల్ కిస్ వండర్స్ క్రియేట్ చేస్తుంది. వారికోసం మీరు ప్రదర్శించే చిలిపి పనుల వల్ల వారిలో పునరుత్తేజాన్ని తీసుకొస్తుంది. కిస్ అంటే అలాంటి ఇలాంటి కిస్ కాదు, గతంలో ఎప్పుడు ఇచ్చిండకూడదు, డిఫెరెంట్ కిస్, డిఫరెంట్ ప్లేస్. ఇక అంతే మీకు ఫ్లాట్, రోజంతా ఉత్సాహంగా , అఫెక్షనేట్ గా కనబడుతారు.

Desktop Bottom Promotion