Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
మీ భర్త మనసుదోచే రొమాంటిక్ బర్త్ డే గిఫ్ట్ ఐడియాస్
మీ భాగస్వామి బర్త్ డేని మరింత స్పెషల్ గా చేయాలనుకుంటున్నారా ? మీ భర్తకు సర్ ప్రైజింగ్ బర్త్ డే ప్లాన్ చేయాలనుందా ? మీ భర్త లేదా బాయ్ ఫ్రెండ్ కి స్పెషల్ బర్త్ డే గా గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేయాలని భావిస్తున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.
బర్త్ డేని చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరికీ ఇదే ఆశ. అయితే తమ భాగస్వామి బర్త్ డేని చిరకాలం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసి సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేసేవాళ్లు కూడా ఉంటారు. అయితే.. చిన్నపిల్లలను ప్రేమించినట్టు తనను ప్రేమించాలని మీ భర్త కూడా కోరుకుంటాడు. కాబట్టి.. మీ బాయ్ ఫ్రెండ్ స్పెషల్ గా ఫీలయ్యేలా.. రొమాంటిక్ గిఫ్ట్ ఐడియాస్ తో సర్ప్రైజ్ చేయండి.

గిఫ్ట్ # 1
లవ్ కొటేషన్స్, లవ్ మెసేజెస్ తో నిండిన జార్ తయారు చేయండి. మెసేజ్ లు కనిపించకుండా.. సర్ప్రైజింగ్ గా ఉండేలా జాగ్రత్త పడండి. రోజూ వాటిని చదవమని సలహా ఇవ్వండి.

గిఫ్ట్ # 2
వయసు పెరిగినా.. బర్త్ డే మాత్రం స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటాం. కాబట్టి.. మీ ఆయనకు ఇష్టమైన స్నేహితులు, చుట్టాలను పిలిచి.. సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేయండి. కేక్ కట్ చేయండ.

గిఫ్ట్ # 3
మీ భర్తకు ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసి ప్రేమను చూపించండి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్నీ తనకు ఇష్టమైన ఆహారాలే తయారు చేసి, వడ్డించండి.

గిఫ్ట్ # 4
మీరు ఎందుకు మీ భర్తను ఇష్టపడతారో, ఎందుకు ప్రేమిస్తున్నారో రీజన్స్ తెలియజేయండి. తనపై నిమిష నిమిషానికి ప్రేమ పెరగడానికి అతనిలో నచ్చే క్వాలిటీస్ లిస్ట్ మీ స్వహస్తాలతో రాసి ఇవ్వండి.

గిఫ్ట్ # 5
మీరు ఫస్ట్ టైం ఎక్కడ కలిశారో అక్కడికి వెళ్లి సర్ప్రైజ్ ఇవ్వండి. కళ్లకు గంతలు కట్టి.. ఆ ప్లేస్ లోకి తీసుకెళ్లండి. చాలా హ్యాపీగా ఫీలవుతాడు.

గిఫ్ట్ # 6
మీరు ఇద్దరు హ్యాపీగా, జాలీగా గడిపిన క్షణాలన్నింటినీ.. కలిపి ఒక సీడీ రూపంలో ఇవ్వండి. అందులో రొమాంటిక్ సాంగ్స్, ఎఫెక్ట్స్ జతచేస్తే.. మీ పార్ట్ నర్ ఆనందానికి అవదులుండవు.

గిఫ్ట్ # 7
తనకు ఇష్టమైన పనులు చేయడానికి ఈ రోజుని మార్చేయండి. అన్నీ తనకు నచ్చే పనులు చేయండి. సినిమాలు చూడటం నుంచి అన్ని రకాల ఇష్టాలను మీరు ఎంజాయ్ చేయండి.



Click it and Unblock the Notifications