Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
పెళ్లి తర్వాత జరిగే మార్పులేంటి ?
వివాహం అనేది ఇద్దరు మనుషులు, రెండు కుటుంబాలు, రెండు సంస్కృతుల మధ్య బంధం. ఈ బంధాన్ని చాలా జాగ్రత్తగా, గౌరవం మరియూ ప్రేమతో కాపాడుకోవాలి. పెళ్ళి చేసుకుని ఒకరితో అలా నిబద్ధతతో ఉండటం అనేదే ఒక పెద్ద మార్పు. కాదంటారా??
వివాహం అనేది మన జీవితంలో వేసే అతి ముఖ్యమైన అడుగుల్లో ఒకటి. ఈ అడుగువేస్తున్నప్పుడే మనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి అప్పుడే మన భాగస్వామి మనతో సంతోషంగా ఉండగలుగుతారు. స్త్రీలే ఈ మార్పులకి ఎక్కువ గురి అవుతారు. ఉదాహహరణకి అలవాటు లేకపోయినా పొద్దున్నే లేచి వంట చేయడం, ఇంటి పేరు మార్పు ఇలా బోలెడూ మార్పులొస్తాయి.
మగవారిని ఈ మార్పులు పెద్దగా ప్రభావితం చెయ్యవనే చెప్పచ్చు. బాంధవ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పెళ్ళి తరువాత చాలా మార్పులొస్తాయి. వివాహమయ్యాకా వచ్చే కొన్ని మార్పులు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

మీరిప్పుడు ఒంటరి కారు
వివాహమయిపోయిందంటే ఇక మీరు ఒంటరి కారు.నిబద్ధతతో మీరు అనేక బాధ్యతలని తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపై మీరు ఒక్కరు కాదు ఇద్దరు.

అసలైన జీవితం
మీరు ఇష్టపడిన వారిని మీరు వివాహం చేసుకున్నాకే అసలు జీవితం మొదలవుతుంది.వివాహ బంధం లోకి అడుగిడటమంటే అంత సులభం కాదు.ఈ మూడు ముళ్ళు మీకు అసలు జీవితాన్ని పరిచయం చెయ్యడంతో పాటు మీ భాగస్వామిలోని మంచీ,చెడు కోణాలని కూడా మీకు చూపిస్తుంది.

భాగస్వామి మీద ప్రేమ తగ్గడం
వివాహమయ్యి ఒక సంవత్సరమయ్యాకా మీ ఇద్దరినీ కలిపి ఉంచిన ఒకరి మీద ఒకరికి ఇష్టం మెల్లిగా తగ్గుతుందనేది వాస్తవం. కానీ అందరికీ కాదు సుమా. కొంత మంది దంపతులు తమ మధ్య సాన్నిహిత్యాన్ని కాలంతో పాటు పెంచుకుని ఆనందంగా జీవిస్తారు.

బాధ్యతలు ముఖ్యమనిపించడం
వివాహమయ్యాకా వచ్చే ముఖ్య మార్పు బోలెడు బాధ్యతలు మీ మీద పడటం.ఇద్దరు భాగస్వాములు చక్కగా అరమరికలు లేకుండా మాట్లాడుకుని బాధ్యతలు ఒక్కరి మీద పెట్టకుండా చెరి సగం పంచుకోవాలి.

గొడవలు మొదలు
ఇద్దరు వేరు వేరు నేపధ్యాలనుండి వచ్చిన వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటైనప్పుడు వారు వాదులాడుకోవడానికి అవకాశాలెక్కువ.కాలం గడిచేకొద్దీ ఒకరినొకరు అర్ధం చేసుకుని ఎదుటివారిని మనస్ఫూర్తిగా అంగీకరించగలగాలి.

మారే ప్రాముఖ్యతలు
మీరొంటరిగా ఉన్నప్పుడు ఇలా చెయ్యి,అలా చెయ్యి అని చెప్పేవారుండరు.కానీ వివాహం తరువాత చాలా మార్పొస్తుంది.వాటిలో మీ ప్రాముఖ్యతలు మారడం కూడా ఒకటి.ఒక నిర్ణయం తీసుకునే ముందు మీ భాగస్వామి గురించి కూడా ఆలోచించాలి.



Click it and Unblock the Notifications
