Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మంచి భర్తగా మార్కులు కొట్టేయాలంటే..!!
మీ డార్లింగ్ మనసు గెలుచుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించి విఫలమవుతున్నారా ? ఏం చేసినా.. ఎలా మసలుకున్నా.. మీ పార్ట్ నర్ హ్యాపీగా ఫీలవడం లేదా ? మీరు మీ లవ్ ఎక్స్ ప్రెస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారా ? అయితే మీ లైఫ్ పార్ట్ నర్ తో స్పెండ్ చేసే టైం.. హ్యాపీగా, జాలీగా, చిరకాలం గుర్తుండిపోయేలా చేయాలంటే.. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీ భార్య లేదా ప్రియురాలితో గడిపే సమయంలో కొన్ని విషయాల్లో కొన్ని సూచనలు ఫాలో అయితే.. మీ రిలేషన్ షిప్.. లవ్లీగా ఉంటుంది. మీ పార్ట్ నర్ తో మిమ్మల్ని గుడ్ లవర్ అనిపించుకోవాలంటే.. ఈ రూల్స్ ఫాలో అయిపోండి.

రెస్పెక్ట్
మీ భార్యను లేదా ప్రియురాలిని గౌరవించడం నేర్చుకోవాలి. అమ్మాయిలకు ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల మీమీద వాళ్లకు గౌరవం పెరుగుతుంది. మంచి ఇంప్రెషన్ ఉంటుంది. తనకు మీరు ప్రత్యేకతను ఇస్తే.. మీ మీద పూర్తీగా నమ్మకం పెరుగుతుంది. తన గురించి ప్రతి విషయంలో కేర్ తీసుకుంటూ ఉండాలి.
READ MORE: నిద్రించే భంగిమ.. భార్యభర్తల బంధాన్ని తెలుపుతుందా ?
డామినేట్
మీ గురించి ప్రతి నిమిషం, ప్రతి రోజూ జాగ్రత్త తీసుకుంటుంది మీ భార్యే అని మరిచిపోకండి. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్న మీ భాగస్వామిని డామినేట్ చేస్తూ వ్యవహరించకండి. తన నిర్ణయాలు, ఆలోచనలను గౌరవించండి. ప్రతి విషయంలోనూ ఆమెను తప్పుపట్టకూడదు. ఇలా చిన్న చిన్న విషయాల్లో కూడా ఆమె ఆలోచనలకు గౌరవం ఇవ్వకపోతే మీపై అభిప్రాయం మారిపోతుంది.

నిజాయితీగా
ఏ పని చేసినా.. ఎంత ఖర్చుపెట్టినా.. ఎక్కడికి వెళ్లినా.. తప్పైనా.. కరెక్ట్ అయినా.. నిజాయితీగా ఉండండి. ప్రతి విషయాన్ని మీ భాగస్వామితో షేర్ చేసుకోండి. అపద్దాలతో మీ పొరపాట్లు దాచిపెట్టడం వల్ల మీమీద గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది. నిజాయితీగా ఉంటే.. మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. మీ రిలేషన్ లో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా హ్యాపీగా సాగుతుంది.
READ MORE: తోడి కోడలితో ఆత్మీయ అనుంబంధానికి ఐడియాస్
సహకారం
మీ భాగస్వామి చేసే పనిలో మీ సహకారాన్ని కోరుకుంటుంది. కాబట్టి.. తనకు అవసరమైనప్పుడు సలహాలు, సూచనలే కాకుండా.. అవసరాలకు తగ్గట్టు హెల్త్ చేయండి. మీ భార్య ఏదైనా కొత్త ఆలోచనతో ముందుగు సాగాలనుకున్నప్పుడు... మీ సహాయ, సహకారాలను అందించండి. ఆమె అభిరుచులు, అలవాట్లకు ప్రాధాన్యమివ్వండి. అప్పుడు మీపై ప్రేమ, ఆప్యాయతలు మరింత పెరుగుతాయి.



Click it and Unblock the Notifications