Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వదినను ఆహ్వానించడానికి ఆడపడుచుకి చిట్కాలు..
కొత్తగా పెళ్లై అత్తారింటికి వెళ్లే అమ్మాయికి.. లైఫ్ లో కొత్త పార్ట్ స్టార్ట్ అయినట్టే. ప్రతి విషయంలో కొత్తదనం ఉంటుంది. కొత్త కుటుంబంలోని ప్రతి ఒక్కరితో.. జాగ్రత్తగా మసులుకుంటూ, అందరితో కలిసిపోతూ.. ప్రతి ఒక్కరి దగ్గర మంచి ఇంప్రెషన్ సంపాదించాలి. కొత్త కోడలిగా అత్తింటి బాధ్యతను ఎంతో జాగ్రత్తగా, గౌరవప్రదంగా చేతిలోకి తీసుకోవాలి.
పెళ్లి తర్వాత అమ్మాయిలు సర్దుకుపోవాల్సినవి, అర్థం చేసుకోవాల్సినవి చాలా విషయాలే ఉంటాయి. భర్త, అత్తమామలే కాకుండా, ఆడపడుచుతోనూ ఫ్రెండ్లీగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులనే కాకుండా.. బంధువులందరిలోనూ.. తనకంటూ ఓ గుర్తింపు, స్థానాన్ని సంపాదించుకోవాలి. అందరినీ కలుపుకుని పోయే తత్వం కలిగి ఉండాలి.
ఇలా కొత్త కోడలిని ఇంట్లో వాళ్లకు దగ్గర చేయడంలో ఆడపడుచే కీలకపాత్ర పోషించాలి. ఇంటికి వచ్చే వదినను స్నేహితురాలిగా భావించి, కొత్త వాతావరణంలో, కొత్త కుటుంబంలో త్వరగా కలిసిపోవడానికి అనువైన వాతావరణం కల్పించాలి. మరి వదినను అత్తింటికి.. హ్యాపీగా ఆహ్వానించడానికి ఏం చేయాలో ఇప్పుడే చూడండి..

ఎక్కువ టైం స్పెండ్ చేయడం
పెళ్లైన తర్వాత అత్తారింట్లో.. అంతా కొత్త వాతావరణం, కొత్త వాళ్లు ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి లోన్లీగా ఫీలయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఒంటరి ఫీలింగ్ దూరం చేసే బాధ్యత మరదలిదే. ఎందుకంటే.. వదిన, మరదళ్లు దాదాపు ఒకే వయసు వాళ్లు అయి ఉంటారు. కాబట్టి తేలికగా కలిసిపోవచ్చు. కాబట్టి ఎక్కువ సమయం మీరు తనతో గడిపేలా ప్లాన్ చేసుకోండి. దీనివల్ల ఇష్టాఇష్టాయిలు తెలుస్తాయి. ఏ విషయానికి ఎలా స్పందిస్తుందనేది తెలుస్తుంది.
తెలుసుకోవడం
అన్నయ్య లేదా తమ్ముడి పెళ్లై ఇంటికి వదిన రాబోతోందంటే.. ఎక్కువగా సంతోషించేది ఆడపడుచే. ఎందుకంటే అమ్మ తర్వాత ఫ్రెండ్లీగా వదినతోనే ఉండగలదు. కాబట్టి వదినకు వెల్ కమ్ చెప్పడానికి, ఆమెకు దగ్గరవడానికి చాలా ఆసక్తి చూపుతుంది మరదలు. అలాంటప్పుడు వదిన అభిరుచులు ముందుగానే తెలుసుకోవాలి. ఇష్టమైన ఫుడ్, హోటల్, సరదాలు ఇలా.. అన్నీ తెలుసుకుని.. ఏదైనా స్పెషల్ ప్లాన్ చేస్తే బావుంటుంది.

సర్ ప్రైజ్ ఇవ్వడం
ఎవరికైనా దగ్గర అవ్వాలంటే.. క్లోజ్ గా మాట్లాడటమే కాకుండా.. వారికి నచ్చిన గిఫ్ట్స్ ఇవ్వడం కూడా.. మంచి అలవాటు. కాబట్టి వదినకు ఇష్టమైన వస్తువులు కొని సర్ ప్రైజ్ ఇవ్వాలి. ఇద్దరూ షాపింగ్ కి వెళ్లడం, సరదాగా గడపడం వల్ల మీ ఇద్దరి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ గా మారుతుంది.
ప్రైవసీ ఇవ్వడం
వదినతో కలిసిపోయి, సరదాగా గడపమంటే.. ఎప్పుడూ పక్కనే ఉండమని కాదండోయ్. కొత్తగా పెళ్లైన జంటకు కూడా కాస్త ప్రైవసీ ఇవ్వండి. వాళ్లిద్దరూ ఏకాంతంగా గడపడానికి కొంత సమయం ఇవ్వాలి. వీలైతే.. కొత్త జంటకు.. సర్ ప్రైజ్ లు ప్లాన్ చేయండి. దీనివల్ల మీ ఇద్దరి మధ్యే కాకుండా, వాళ్లిద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. మీ మీద వదినకు ప్రేమ పెరుగుతుంది.



Click it and Unblock the Notifications