Latest Updates
-
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా..
పని ఒత్తిడి వైవాహిక జీవితంపై ప్రభావం చూపుతుందా ?
ప్రస్తుతం ఉన్న రొటీన్ లైఫ్ లో భార్యభర్తలకు ఏకాంతంగా సమయం గడపడానికి కుదరడం లేదు. ఉద్యోగాల్లో పని ఒత్తిడి కారణంగా ఒకరి గురించి ఒకరు కేర్ తీసుకోవడానికి సమయం కుదరదు. అలాగే శరీరం సహకరించదు. ఎక్కువగా అలసిపోవడం వల్ల భార్యతో కాసేపు బయటకు వెళ్లడానికి తీరిక లేకుండా కష్టపడుతుంటారు. ఉదయాన్నే హడావుడిగా వెళ్లడం.. రాత్రి భోజనం సమయానికి గానీ ఇంటికి చేరుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ భాగస్వామితో రిలేషన్ ని హ్యాపీగా లీడ్ చేయాలంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీ కెరీర్ మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపకుండా జాగ్రత్తపడాలి.

చిరాకు
ఉదయం నుంచి మీ కోసం ఆశగా, ఆనందంగా ఎదురుచూస్తున్న భార్యపై చిరాకు పడకుండా జాగ్రత్త పడండి. మీరు అలసిపోయి ఉంటారు కానీ.. మీ పార్ట్ నర్ గురించి కూడా ఒక్క క్షణం ఆలోచించి.. ఉన్న కాస్త సమయాన్ని ప్రేమ పంచడానికి ఉపయోగించండి. కాసేపు తనతో ముచ్చట్లు చెప్పండి. అలాగే ఆఫీస్ వర్క్ ని మళ్లీ ఇంటికి తీసుకువచ్చి.. ఉన్న కాస్త సమయాన్ని కూడా ఆఫీస్ వర్క్ కే పరిమితం చేయకండి.
ఒత్తిడి
భార్యాభర్తలు ఇద్దరూ వర్క్ చేస్తున్నరోజులివి. ఇద్దరూ ఉదయాన్నే ఆఫీసుకి వెళ్లడం సాయంత్రం వచ్చాక వంట, క్లీనింగ్ అనేసరికి చాలా అలసటకు గురవుతారు. దీనివల్ల ఎప్పుడెప్పుడు విశ్రాంతి తీసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటారు. దీనివల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశముంది. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడానికి సమయం కరువవుతుంది. కాబట్టి.. వారాంతాల్లో, సమయం దొరికినప్పుడు బయటకు వెళ్లడం వల్ల ఇద్దరి గురించి కాస్త చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఏకాంతం, ప్రశాంతత
పిల్లలు, చుట్టాలు, స్నేహితులు అంటూ.. ఎప్పుడూ బిజీగా గడిపేయకండి. వర్కింగ్ డేస్ లో ఎలాగూ పని ఒత్తిడిలో బిజీగా టైం తెలియకుండా గడిపేసి ఉంటారు. కాబట్టి.. వారాంతాల్లో ఎలాంటి ఇతర పనులు లేకుండా.. హ్యాపీగా, జాలీగా మీ పార్ట్ నర్ తో స్పెండ్ చేయండి. కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్, పిల్లలూ, బంధువులతో కలిసి వెళ్లినా.. అప్పుడప్పుడు మీరు ఇద్దరే ట్రిప్ ప్లాన్ చేసుకుంటే.. మీ రిలేషన్ మరింత ఆప్యాయంగా, అన్యోన్యంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications