Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
హ్యాపీగా సాగుతున్న రిలేషన్ లో కలతలకు కారణాలివే..
రిలేషన్ షిప్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. హ్యాపీగా, జాలీగా సాగుతున్నంతసేపూ చాలా బావుంటుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ.. గౌరవించుకుంటూ.. నమ్మకంగా సాగుతుంటే.. రిలేషన్ కలకాలం ఉంటుంది. కానీ.. సంబంధం మధ్యలో గొడవలు, మనస్పర్థలు మొదలయ్యాయంటే.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమని గుర్తుంచుకోండి.
మీ భర్త మిమ్మల్ని మోసగిస్తున్నారని తెలిపే లక్షణాలు
చాలా హ్యాపీగా సాగుతున్న అనుబంధం చాలా భయంకరంగా మారుతుంది అంటే.. కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అలాంటి పరిస్థితులపై అవగాహన కల్పించుకునే.. వాటిని తెలివిగా డీల్ చేస్తే.. మీ రిలేషన్ లో ఎలాంటి అనర్థాలు చోటుచేసుకోకుండా జాగ్రత్త పడవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనేది తెలుసుకోవడం చాలా అవసరం.

కోపం
ఇద్దరూ చాలా అన్యోన్యంగా, ప్రేమగా ఉంటారు. కానీ.. ఒక్కసారిగా మీ రిలేషన్ లో కోపం స్థానం సంపాదించింది అంటే.. జాగ్రత్త పడాలి. ఈ కోపమే చాలా అనర్థాలకు కారణమవుతుంది. కాబట్టి.. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడు వీలైనంత సైలెంట్ గా ఉండటం వల్ల మీ బంధం బలపడుతుంది.
పెళ్లైన కొత్తలో... కపుల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్
వాదన
వాదులాట రిలేషన్ లో చాలా దుష్ర్పభావం చూపిస్తుంది. మీ పార్ట్ నర్ తో చాలా దురుసుగా మాట్లాడుతూ.. తన మనస్తత్వాన్ని మార్చుకోవాలి అని సూచిస్తున్నారు అంటే.. మీ మధ్య చాలా పెద్దగా సమస్య నడుస్తోంది అని అర్థం. కాబట్టి.. ఇంతవరకూ సమస్య వచ్చినప్పుడు చాలా కూల్ గా వ్యహరించాలి. ఒకపై ఒకరు వాదించుకోవడం వల్ల వచ్చేదేమీ ఉండదు. నిదానంగా సమస్య గురించి చర్చించుకోవాలి. పరిష్కరించుకోవాలి.

కించపరచడం
మీ భాగస్వామిని పదేపదే కించపరచడం వల్ల చాలా డిప్రెషన్ కి లోనవుతారు. ప్రతి చిన్న విషయాన్ని ఇతరులతో పోల్చడం, చులకనగా చూడటం వంటి విషయాలు చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. అలాగే మీరు తనను కించపరుస్తున్నారన్న ఫీలింగ్ ఎక్కువవుతుంది. కాబట్టి.. ఇలాంటి విషయంలో మీ పార్ట్ నర్ మనసు తెలుసుకుని వ్యవహరించడం మంచిది.



Click it and Unblock the Notifications
