Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎత్తుగా ఉన్న అబ్బాయిలంటే అమ్మాయిలకు క్రేజ్ ఎందుకు ?
అమ్మాయిలు పొడవాటి అబ్బాయిలను ఇష్టపడతారు. ఇది చాలా కామన్ గా వింటూ ఉంటాం. అయితే ఇది అందరికీ వర్తించదని చాలా మంది భావిస్తుంటారు. కానీ.. ఇది అక్షరాల నిజమని తేల్చాయి అధ్యయనాలు. హైట్ డిఫరెన్స్ ఎక్కువగా ఉన్న జంట చాలా హ్యాపీగా ఉన్నట్టు ఈ స్టడీస్ చెబుతున్నాయి. అమ్మాయిలు ఎత్తుగా ఉన్న అబ్బాయిలను ఇష్టపడానికి వాళ్లు రక్షణ కల్పిస్తారని నమ్మడమే.

ఏ అమ్మాయి అయితే ఎత్తు ఎక్కువగా ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందో ఆ జంట.. తక్కువ ఎత్తు ఉన్న జంట కంటే సంతోషంగా ఉంటారట. తమకంటే ఎత్తుగా ఉన్న అబ్బాయినే అమ్మాయిలు ఇష్టపడతారని గతంలో కూడా చాలా అధ్యయనాలు వివరించాయి. దీనికి కారణమేమిటి అంటే.. ఎత్తుకి బలానికి సంబంధం కలిగి ఉంటుందని ఒక నమ్మకం ఉంది.

కాబట్టి బలంగా ఉన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితినైనా జయించే సత్తా కలిగి ఉంటాడు. వీక్ గా ఉన్న వ్యక్తిని భర్తగా పొందడం కంటే.. స్ర్టాంగ్ ఉన్న వ్యక్తిని భర్తగా పొందడం వల్ల.. ఎక్కువ లాభాలుంటాయని అమ్మాయిలు ఫీలవుతారట. అలాగే తనను చాలా కేర్ ఫుల్ గా చూసుకుంటారని భావిస్తారు. పొడవుగా ఉండే వ్యక్తులు ఎక్కువ సంపాదిస్తారు.. ఆర్థికపరంగా, సామాజికంగా ఎలాంటి లోటు రాకుండా చూసుకోవడానికి బలవంతులకే సాధ్యమని అమ్మాయిలు నమ్ముతారు. అందుకే పొడవుగా ఉన్న వ్యక్తులనే అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారు.



Click it and Unblock the Notifications