Latest Updates
-
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త!
మీరు భార్యకు లొంగి ఉండే భర్త అని తెలిపే సంకేతాలు..!!
భార్యల చెప్పు చేతల్లో ఉండే భర్తలను భార్యలకు లొంగి ఉండే భర్త (హెన్ పెక్క్డ్ హస్బండ్) అని పిలుస్తారు. ఇలాంటి బంధం దాదాపు అసంబద్ధమైన సంబంధంగా చెప్పవచ్చు.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా అందమైన బంధం. కానీ.. అది.. హ్యాపీగా ఉన్నంతవరకు బావుంటుంది. కానీ.. ఒకవేళ అది వ్యతిరేకంగా మారితే కష్టం.
భార్యల చెప్పు చేతల్లో ఉండే భర్తలను భార్యలకు లొంగి ఉండే భర్త (హెన్ పెక్క్డ్ హస్బండ్) అని పిలుస్తారు. ఇలాంటి బంధం దాదాపు అసంబద్ధమైన సంబంధంగా చెప్పవచ్చు.

ఎప్పుడైతే.. భర్తలు బ్లాక్ మెయిల్ అవుతారో.. భార్యలు చాలా డామినేట్ చేస్తారు. ఒకవేళ అలా ఉన్నాకూడా హ్యాపీగా ఉన్నారంటే.. అది రిలేషన్ ని హాని చేయదు కానీ.. అతని ఫీలింగ్స్ కాస్త ఇబ్బందికి గురిచేస్తాయి.
అయితే ఇలాంటి సమస్యకు విడాకులు పరిష్కారం కాదు. అయితే.. చర్చల ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే ఇప్పుడు.. భార్యకు లొంగిపోయిన వ్యక్తిలో కనిపించే లక్షణాలేంటో చూద్దాం..

సంకేతం 1
మీ భార్యను ప్రేమించడం మంచిది. కానీ ఆమె చెప్పే ప్రతి విషయానికి తల ఆడించడం, మీ మనసు కాదు అని చెప్పిన విషయాన్ని కూడా.. మీ భార్యకు చెప్పలేకపోవడం వంటి లక్షణాలు.. మీరు మీ భార్యకు లొంగిపోయారని సూచిస్తుంది. కాబట్టి మీ భార్యకు భయపడుతున్నారా లేదా వాదించడానికి భయపడుతున్నారో తెలుసుకోండి.

సంకేతం 2
మీరు బాగా నిబంధనలకు గురవుతున్నారా ? ఫ్రీడమ్ కోల్పోయారా ? కనీసం మీ తల్లిదండ్రులను కలవడానికి కూడా ఫ్రీడం లేదా ? అయితే.. మీది అన్ హెల్తీ రిలేషన్ అని సంకేతం. దీనిపై మీరు ఇలాగే సైలెంట్ గా ఉంటే.. మీరు మీ భార్యకు లొంగిపోయి ఉండాల్సి వస్తుంది.

సంకేతం 3
మీరు ఏదైనా సొంత నిర్ణయం తీసుకోవడానికి భయపడుతున్నారా ? ప్రతి విషయానికి మీ భార్యాను సంప్రదిస్తున్నారా అయితే.. ఇది.. లొంగిపోయి ఉండే భర్తకు సంకేతం. సంబంధంలో ప్రేమ, ఫ్రీడం అనేవి లక్ష్యాలు. భయం, వాగ్వాదాలు కాదు.

సంకేతం 4
మీ భార్య మిమ్మల్ని అతిగా డామినేట్ చేయాలని, మీపై ఆధిపత్యం సంపాదించాలని భావిస్తోందా ? ఆమె నుంచి అవమానాలను సైలెంట్ గా ఫేస్ చేస్తున్నారా ? అయితే.. మీరు మీ భార్య లొంగిపోయారని సంకేతం.

సంకేతం 5
వర్క్ అయిపోయిన తర్వాత.. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లాలంటే భయపడుతున్నారా ? త్వరగా ఇంటికి వెళ్లడానికి భయపడుతున్నారంటే.. ఇది ఖచ్చితంగా మీరు మీ భార్యకు లొంగిపోయరని సూచిస్తుంది.

సంకేతం 6
మీరు ప్రతిరోజూ మానసికంగా బ్లాక్ మెయిల్ కి గురవుతున్నారా ? మీరు ఒక బానిసలా ఫీలవుతున్నారా ? అయితే మీరు ఇలానే కొనసాగితే.. ఖచ్చితంగా మీ భార్యకు లొంగిపోవాల్సి వస్తుంది.

సంకేతం 7
ఆమె పెట్టే శారీరక ఒత్తిడికి మీరు అలవాటుపడిపోయారా అలాగే ఆమె ఏమి చెప్పినా ఓకే అని చెప్పేసేలా మారిపోయారా.. అయితే ఈ లక్షణాలన్నీ మీరు ఆమెకు లొంగిపోయారని సూచిస్తాయి.



Click it and Unblock the Notifications