మీ బంధాన్ని మరింత అన్యోన్యంగా మార్చే మ్యాజికల్ ఐడియాస్

By Swathi

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భార్యభర్తలు కలకాలం అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుని.. అభిప్రాయాలు, అభిరుచులు పంచుకుంటూ చిలకాగోరింకల్లా కలిసిమెలిసి ఉండాలని ఆరాటపడతారు. హ్యాపీగా, జాలీగా రిలేషన్ ని ఎంజాయ్ చేయాలని కోరుకోని దంపతులు ఉండరేమో.

ఇండియన్ కపుల్స్ గొడవకు కారణమయ్యే క్రేజీ రీజన్స్ ?

అయితే అన్యోన్యత, ప్రేమానురాగాలు, ముద్దు ముచ్చట్లు.. పెళ్లైన కొత్తలోనే ఉంటాయని.. రానురాను ఈ ముచ్చట్లన్నీ.. కనుమరుగవుతాయని.. చాలామంది చెబుతుంటారు. పిల్లలు, బాధ్యతలు, పనులు, ఉద్యోగాలు ఇలా బిజీగా మారే కొద్దీ భార్యభర్తల మధ్య అన్యోన్యతకు దూరం పెరుగుతుందని ఒక అపోహ ఉంది. ఒత్తిడి, రకరకాల పనుల కారణంగా.. ఇద్దరూ ఒంటరిగా గడపడానికి సమయం దొరకదు. దీంతో విబేధాలకు దారితీయచ్చు.

ఎక్కువగా సెలబ్రెటీల పెళ్లిళ్లు ఫెయిల్ అవడానికి కారణాలేంటి ?

కానీ అలాంటి ఆస్కారం మీ ఇద్దరి మధ్య రాకుండా.. ఇద్దరూ ఎప్పటిలాగే.. అన్యోన్యంగా, మరింత ఆప్యాయంగా జీవితాన్ని, బంధాన్ని బలపరుచకునే మార్గాలు చాలానే ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య అన్యోన్యతను పెంచే సింపుల్ థింక్స్ మిమ్మల్ని ప్రేమపక్షులుగా మార్చేస్తాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలకు కొరత రాకుండా ఉండాలంటే.. ఈ చిన్న చిన్న మ్యాజికల్ ఐడియాస్ ఫాలో అయిపోండి. పెళ్లై ఎన్ని ఏళ్లైనా.. కొత్త జంటలా ప్రేమను పంచుకోండి.

చిరునవ్వు

చిరునవ్వు

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే వాళ్లకు పాజిటివ్, ఎమోషన్ గా స్టేబుల్ గా ఉండే తత్వం ఉంటుంది. ఇది హెల్తీయర్ రిలేషన్ ని సూచిస్తుంది. కాబట్టి.. చిరునవ్వుతో మీ భాగస్వామికి దగ్గరవ్వండి.. మీ పార్ట్ నర్ లైఫ్ తో పాటు, మీ రిలేషన్ కి బూస్టప్ ఇవ్వండి.

ముద్దు పేర్లు

ముద్దు పేర్లు

ముద్దు పేర్లతో పిలిస్తే.. మీ భాగస్వామి ఇట్టే కరిగిపోవాల్సిందే. కాబట్టి ముద్దు పేర్లతో ఒకరిని ఒకరు పిలుచుకోవడం వల్ల.. మీ ఇద్దరు మరింత దగ్గరవుతారు. ఇది మీ ఇద్దరి మధ్య బలమైన బంధాన్ని సూచిస్తుంది.

చేతులు పట్టుకోవడం

చేతులు పట్టుకోవడం

మీరు ఎక్కువగా ప్రేమించే మీ పార్ట్ నర్ చేతిని పట్టుకోవడం వల్ల మీలో ఒత్తిడి చాలా తగ్గిపోతుందని స్టడీస్ చెబుతున్నాయి. ఇలా పట్టుకోవడం వల్ల మీ స్వీట్ రిలేషన్ మరింత స్ట్రాంగ్ గా మారుతుంది.

వదిలిపెట్టడం

వదిలిపెట్టడం

వాదించుకోవడాన్ని వదిలిపెట్టడం నేర్చుకోవాలి. మీ వాదిస్తున్న వ్యక్తి మిమ్మల్ని అమితంగా ప్రేమించే, కేర్ తీసుకునే వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఒకవేళ మీ భాగస్వామి మీకు క్షమాపణ చెబితే దాన్ని అంగీకరించండి.

కాంప్లిమెంట్స్ ఫర్ మెన్

కాంప్లిమెంట్స్ ఫర్ మెన్

మగవాళ్లు కూడా కాంప్లిమెంట్స్ ని ఎక్స్ పెక్ట్ చేస్తారు. కాబట్టి.. డియర్ లేడీస్.. మీ భర్త ఎప్పుడైనా మీకు ఇష్టమైన కలర్ లేదా మీకు ఇష్టమైన పని చేసినప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వండి. అది మీ రిలేషన్ ని బలపరుస్తుంది.

కాంప్లిమెంట్స్

కాంప్లిమెంట్స్

చిన్న కాంప్లిమెంట్ మీ రిలేషన్ ని చాలా అన్యోన్యంగా మార్చేస్తుంది. అంటే ఈ చీరలో చాలా అందంగా ఉన్నావ్.. ఈరోజు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నావ్.. ఈ రోజు హ్యాండ్ సమ్ గా ఉన్నావ్ డియర్ వంటి.. సింపుల్ కాంప్లిమెంట్స్ మీ పార్ట్ నర్ ని చాలా సంతోషపెడతాయి.

మెమరీస్

మెమరీస్

మీ ఇద్దరి మధ్య అన్యోన్యతలను, అనురాగాన్ని, మెమరీలను మీ ఇంటి గోడలపై అతికించుకోండి. మీ పెళ్లి సమయంలోవి లేదా మీ వెకేషన్ మెమరీస్ ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల.. మీ రిలేషన్ మరింత స్ట్రాంగ్ అవుతుంది.

మీ కోసం కొంత సమయం

మీ కోసం కొంత సమయం

మీ కోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోండి. మీ రిలేషన్ ని హెల్తీగా ఉంచుకోవడంతోపాటు.. మీ అలవాట్లు, మీ స్నేహితుల కోసం కొంత సమయాన్ని కేటాయించండి.

ముద్దు

ముద్దు

ఉదయాన్ని ఇంటి నుంచి వెళ్లేటప్పుడు, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత.. ముద్దుతో మీ భాగస్వామిని పలకరించండి. ఈ సింపుల్ ఐడియా.. స్ట్రాంగ్ రిలేషన్ షిప్ కి చాలా అవసరం.

థ్యాంక్స్, సారీ

థ్యాంక్స్, సారీ

మీ భాగస్వామికి ధ్యాంక్స్, సారీ చెప్పడం మరిచిపోకండి. అంటే మీ కోసం లంచ్, బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు చాలా హ్యాపీగా.. ధ్యాంక్స్ చెబితే.. సంతోషాన్నిస్తుంది.

నిద్రపోయేటప్పుడు

నిద్రపోయేటప్పుడు

ఎన్ని గొడవలు, వాగ్వాదాలు, సమస్యలు ఉన్నా.. రాత్రి పడుకునేటప్పుడు వాటి గురించి చర్చించకండి. అవసరమైతే.. మరుసటి రోజు మాట్లాడుకోండి. పడుకునేటప్పుడు మాత్రం అన్యోన్యంగా ఉండేలా జాగ్రత్త పడాలి.

సర్ ప్రైజ్

సర్ ప్రైజ్

మీ భాగస్వామికి సర్ ప్రైజ్ లు ఇవ్వండి. క్యాండిల్ లైట్ డిన్నర్స్, వెకేషన్స్, ట్రిప్స్ కోసం బర్త్ డేలు, ఆన్ వర్సరీల కోసం ఎదురుచూడకుండా.. ఏదో ఒక సందర్భంలో సర్ ప్రైజ్ చేస్తే మీ రిలేషన్ హ్యాపీగా ఉంటుంది.

ఐ లవ్ యూ

ఐ లవ్ యూ

మీ ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయండి. ఐ లవ్ యూ అనే పదాల పవర్ ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. చాలా నిజాయితీగా, ప్రేమగా చెప్పడం వల్ల మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి తరచుగా ఈ పదాన్ని ఉపయోగించడం వల్ల మీ రిలేషన్ మరింత అన్యోన్యంగా ఉంటుంది.

Story first published: Wednesday, April 20, 2016, 13:30 [IST]
Desktop Bottom Promotion