Latest Updates
-
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త!
మీ భాగస్వామి మీకు కో ఆపరేట్ చేసేలా మార్చుకునే మార్గాలు..!
జీవితాంతం కలిసి ఉండటం, కలిసి పనిచేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. కపుల్స్ అయినా, టీమ్ మెంబర్స్ అయినా.. వేర్వేరు అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఒకరి అభిప్రాయానికి ఒకరు అంగీకరించలేరు.
జీవితాంతం కలిసి ఉండటం, కలిసి పనిచేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. కపుల్స్ అయినా, టీమ్ మెంబర్స్ అయినా.. వేర్వేరు అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఒకరి అభిప్రాయానికి ఒకరు అంగీకరించలేరు.

కొన్నిసార్లు మీ రిలేషన్ లో మీరు వెళ్లే విధానానికి మీ భాగస్వామి అంగీకరించవచ్చు లేదా సమస్యలు తీసుకురావచ్చు. ప్రతి విషయానికి, ప్రతి సందర్భంలో మీ భాగస్వామిని మోసం చేయడం, మీరు చెప్పినదే జరగాలని పట్టుబడితే.. మాత్రం.. మీ పార్ట్ నర్ ఎప్పటికీ మీతో కో ఆపరేట్ చేయరు.
రిలేషన్ షిప్ అనేది అద్దం లాంటిది. మీరు ఏది చూపిస్తే.. అదే తిరిగి మీకు కనిపిస్తుందని అర్థం. కాబట్టి ఎప్పుడైతే మీరు జాలి కలిగి ఉంటారో.. మీరు మరింత ఎక్కువ జాలి మీ పార్ట్ నర్ ద్వారా పొందగలుగుతారు. మీ భాగస్వామి మీకు కో ఆపరేట్ చేయడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి.. ఫాలో అయిపోండి.

మీ భాగస్వామి మీకు కో ఆపరేట్ చేయాలంటే..
నాకు బాగా తెలుసు అని చెప్పడం కంటే.. ఇద్దరూ చేద్దాం అనడం మంచిది. ఆమె వేసే ప్రతి అడుగులో, ప్రతి విషయంలో, లక్ష్యాలలో మీరు తలదూర్చితే.. తన లక్ష్యాలు నెరవేర్చుకోవడంలో ఆసక్తి కోల్పోతుంది.

మీ భాగస్వామి మీకు కో ఆపరేట్ చేయాలంటే..
ఆమె లక్ష్యంవైపు ఆమె పనిచేయాలని మీరు కోరుకుంటే.. ఆమె తన సత్తా నిరూపించుకోవడానికి అవకాశం అని చెప్పండి. అలాగే.. ఆమె సాధించడానికి మీరే కారణం అని, ఆమె హార్ట్ వర్క్ ని గుర్తించకుండా మాట్లాడకూడదు.

మీ భాగస్వామి మీకు కో ఆపరేట్ చేయాలంటే..
ఏదైనా తప్పు జరిగినప్పుడు.. ఆ పొరపాట్లన్నింటికీ.. ఆమె కారణం అని చెప్పడం సరైనది కాదు. అది మన తప్పుగా భావించాలి. అలాగే.. ఈ సారి పొరపాట్లు జరగకుండా.. ఇద్దరూ కలిసి పనిచేసి.. సరైన ఫలితాలు పొందుదామని ప్రోత్సహించాలి. ఆమెకు కాంప్లిమెంట్స్ ఇవ్వాలి.

మీ భాగస్వామి మీకు కో ఆపరేట్ చేయాలంటే..
బాధగా ఆమె ఇంటికి వచ్చినప్పుడు.. ఆమెకున్న సమస్యను ముందుగా తెలుసుకోవాలి. ఆమెకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి.. తన మూడ్ మార్చే ప్రయత్నం చేయాలి.

మీ భాగస్వామి మీకు కో ఆపరేట్ చేయాలంటే..
ఇద్దరూ బాగా అలసిపోయినప్పుడు.. ఏదైనా గొడవ వచ్చినప్పుడు.. దాన్ని అలాగే సాగదీయకుండా.. ఒకరిపై ఒకరు నింద మోపుకోవడం కంటే..తర్వాత చర్చించుకుందాం అంటే.. మన్పర్థలకు దూరంగా ఉండవచ్చు.

మీ భాగస్వామి మీకు కో ఆపరేట్ చేయాలంటే..
కొన్ని సమస్యలు మీ ద్వారా మొదలుకాకపోయి ఉండవచ్చు. కానీ.. ముందుగా మీరే సారీ చెప్పడం వల్ల ఎలాంటి నష్టం జరగదు. కాబట్టి.. ముందు రోజు ఎక్కువగా సాగదీయకపోయి ఉంటే బావుండేదని మీరు చెప్పి, క్షమాపణ అడిగితే.. బావుతుంది.



Click it and Unblock the Notifications