Latest Updates
-
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే..
కొంతమంది మహిళలు పెళ్లిపై ఆసక్తి చూపకపోవడానికి కారణాలు..!
చాలా మంది మోడ్రన్ మహిళలు.. పెళ్లి చేసుకోవాలని ఆసక్తి చూపడం లేదు. ఫ్యామిలీని క్రియేట్ చేయడం కంటే.. రకరకాల ఆసక్తికరమైన విషయాలున్నాయని, కొత్తగా జీవితాన్ని అనుభవించవచ్చని వాళ్లు భావిస్తున్నారు.
ఇతరులతో అన్యోన్యత కుదరడం అంటే.. సింపులే.. కానీ పెళ్లి చేసుకోవడం అనేది కాస్త క్లిష్టతరమైనది. అలాగే ఈ రోజుల్లో మహిళల అభిప్రాయాలు మారిపోతున్నాయి.

చాలా మంది మోడ్రన్ మహిళలు.. పెళ్లి చేసుకోవాలని ఆసక్తి చూపడం లేదు. ఫ్యామిలీని క్రియేట్ చేయడం కంటే.. రకరకాల ఆసక్తికరమైన విషయాలున్నాయని, కొత్తగా జీవితాన్ని అనుభవించవచ్చని వాళ్లు భావిస్తున్నారు.
ఓ సర్వే నిర్వహించడం ద్వారా మహిళలకు పెళ్లిపై ఉన్న కొత్త అభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది పెళ్లిపై ఆసక్తి లేదని, మరికొందరు కొంతకాలం ఇంకా ఒంటరిగా జీవితం ఎంజాయ్ చేస్తామని, మరికొందరు అలాంటి రిలేషన్ మొదలుపెట్టాలని ఆసక్తి వచ్చేంతవరకు వెయిట్ చేస్తామని చెప్పారు. అసలు కొంతమంది మహిళలకు పెళ్లిపై ఆసక్తిలేకపోవడానికి కారణాలేంటి ?

రీజన్ 1
చాలామంది కపుల్స్ పెళ్లి తర్వాత సంతోషంగా లేరని, అందుకే పెళ్లి అంటే జీవితాంతం బాధలు, కష్టాలతో సరిపోతుందని భావిస్తున్నారు. అలాంటి బాధ నుంచి బయటపడాలంటే.. చట్టపరంగా అనుమతి కావాలని భావిస్తున్నారు. ఈ అభిప్రాయం ఉన్న మహిళలు పెళ్లికి ఆసక్తి చూపడం లేదు.

రీజన్ 2
పెళ్లి అనేది లీగల్ పేపర్ లాంటిది.. అది ఒకరితో కలిసి జీవించాలని ఈ ప్రపంచానికి తెలుపుతుంది. ఒకవేళ మీ రిలేషన్ గురించి మీకు నమ్మకం ఉంటే, ఎలాంటి ఇన్ సెక్యూరిటీ లేకపోతే.. ఎలాంటి పర్మిషన్స్ అవసరం ఉండదని భావిస్తున్నారు.

రీజన్ 3
ఒకవ్యక్తికి భార్యగా ఉంటే.. మహిళలు వాళ్ల ఇంటిపేరు మార్చుకోవాలి, తమ అభిప్రాయాలు మారుతాయి, రకరకాల ఫార్మాలిటీస్ ఉంటాయని భావించి పెళ్లికి ఇష్టపడరు.

రీజన్ 4
పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త ఇంటికి వెళ్లడం, పరిచయం లేని వ్యక్తులతో కలిసి ఉండటం, జీవితం మొత్తాన్ని అలా గడిపేయడం ఇష్టంలేక పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు.

రీజన్ 5
మన చుట్టూ ఉన్న మనుషులు, మీడియా పెళ్లిని మహిళ త్యాగంగా క్రియేట్ చేస్తారు. దీనివల్ల కొంతమంది మహిళలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు.



Click it and Unblock the Notifications