Latest Updates
-
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.! -
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
కళ్యాణ వైభోగమే..హిందూ సంప్రదాయం ప్రకారం గోవాలో సమంత పెళ్లి, స్టన్నింగ్ ఫోటోలు, సమంత నాగచైతన్య పెళ్లి
టాలీవుడ్ ప్రేమ పక్షులు ఒక ఇంటి వారయ్యారు. సమంత అక్కినేని వారి ఇంటి కోదలైంది. హిందు సాంప్రదాయం ప్రకారం సమంత... నాగచైతన్య వివాహం శుక్రవారం అర్ధరాత్రి శుభ ముహూర్తంలో పూర్తయింది.
తొలిచూపులోనే సమ్మోహనానికి గురై 'ఏ మాయ చేసావే' అంటూ అతడు చేసిన ప్రేమ ప్రతిపాదనకు ఆమె మనోల్లా'సమంతా' ఇంతా కాదు! నువ్వూ నేను ఇక 'మనం' అంటూ ఆనందంగా ఓకే చెప్పేసింది! కట్‌చేస్తే..
ఇక నుంచి వారి వైవాహిక జీవితం నిత్య 'చైతన్య'మే! మొత్తంగా ఆ ఇద్దరి మధ్య ఏడేళ్ల ప్రేమ.. ఏడడుగులు నడిపించింది. అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కొడుకు సినీ నటుడు నాగచైతన్య, నటి సమంత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

నాగచైతన్య, సమంత వివాహం శుక్రవారం అందాల తీరం గోవాలో వైభవంగా జరిగింది. వెగాటర్ బీచ్‌లోని డబ్ల్యూ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం రాత్రి 11.52 నిమిషాలకు సమంత మెడలో నాగచైతన్య తాళి కట్టారు.
అక్కినేని, రామానాయుడు కుటుంబసభ్యులు సహా సినీ రంగానికి చెందిన పలువురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

శనివారం సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్య ఇక్కడే క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో నాగచైతన్య-సమంత మరోసారి పెళ్లి ప్రమాణాలు చేయనున్నారు.











Click it and Unblock the Notifications