Just In
- 4 hrs ago 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- 5 hrs ago ఈ 3 రాశుల వారు ఏప్రిల్ 23 నుండి అప్రమత్తంగా ఉండాలి, అంగారకుడి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు
- 9 hrs ago అయోధ్య బాలరాముడిపై సూర్య తిలకం.. కిరణాలు నుదుటిపై పడేందుకు ఏమి చేసారంటే..!
- 10 hrs ago కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
కళ్యాణ వైభోగమే..హిందూ సంప్రదాయం ప్రకారం గోవాలో సమంత పెళ్లి, స్టన్నింగ్ ఫోటోలు, సమంత నాగచైతన్య పెళ్లి
టాలీవుడ్ ప్రేమ పక్షులు ఒక ఇంటి వారయ్యారు. సమంత అక్కినేని వారి ఇంటి కోదలైంది. హిందు సాంప్రదాయం ప్రకారం సమంత... నాగచైతన్య వివాహం శుక్రవారం అర్ధరాత్రి శుభ ముహూర్తంలో పూర్తయింది.
తొలిచూపులోనే సమ్మోహనానికి గురై 'ఏ మాయ చేసావే' అంటూ అతడు చేసిన ప్రేమ ప్రతిపాదనకు ఆమె మనోల్లా'సమంతా' ఇంతా కాదు! నువ్వూ నేను ఇక 'మనం' అంటూ ఆనందంగా ఓకే చెప్పేసింది! కట్‌చేస్తే..
Some more #chaisam happiness!! So beautiful❤️❤️❤️ pic.twitter.com/kCKiw1JQEq
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 6, 2017
ఇక నుంచి వారి వైవాహిక జీవితం నిత్య 'చైతన్య'మే! మొత్తంగా ఆ ఇద్దరి మధ్య ఏడేళ్ల ప్రేమ.. ఏడడుగులు నడిపించింది. అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కొడుకు సినీ నటుడు నాగచైతన్య, నటి సమంత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
నాగచైతన్య, సమంత వివాహం శుక్రవారం అందాల తీరం గోవాలో వైభవంగా జరిగింది. వెగాటర్ బీచ్‌లోని డబ్ల్యూ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం రాత్రి 11.52 నిమిషాలకు సమంత మెడలో నాగచైతన్య తాళి కట్టారు.
అక్కినేని, రామానాయుడు కుటుంబసభ్యులు సహా సినీ రంగానికి చెందిన పలువురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
శనివారం సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్య ఇక్కడే క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో నాగచైతన్య-సమంత మరోసారి పెళ్లి ప్రమాణాలు చేయనున్నారు.