వేసవి సెలవులకు మా మామయ్య ఇంటికెళ్తే నన్ను ఏదేదో చేశాడు - My Story #14

Written By:
Subscribe to Boldsky

నా కాలేజీ స్టడీస్ అప్పుడే అయిపోయాయి. వేసవిలో ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. మా మామయ్య వాళ్ల ఇంటికి వెళ్దామనుకున్నాను. వెంటనే ఇంట్లో చెప్పి బ్యాగ్ సర్దుకుని

విజయవాడ బస్సు ఎక్కాను.

అతని బైక్ పై..

అతని బైక్ పై..

నన్ను రిసీవ్ చేసుకోవడానికి బస్ స్టాండ్ కు మా మామయ్య వచ్చాడు. బైక్ పై ఇద్దరం ఇంటికెళ్లాం. మా మామయ్య నాతో చాలా బాగా మాట్లాడాడు. మామయ్య అంటే మా అమ్మ తమ్ముడు. మా ఇద్దరి ఏజ్ లో పెద్దగా గ్యాప్ లేదు. నా కన్నా కొన్ని సంవత్సరాలు మాత్రమే అతను పెద్దవాడు.

లూజ్ హెయిర్ తో హాల్లో కూర్చొన్నా

లూజ్ హెయిర్ తో హాల్లో కూర్చొన్నా

మామయ్యకు రీసెంట్ గానే పెళ్లి అయ్యింది. ఆయన భార్యను అక్క అని పిలుస్తాను. ఇంటికెళ్లాక ఫ్రెష్ గా స్నానం చేసి రెడీ అయ్యాను. వైట్ టాప్.. జీన్స్ ఫ్యాంట్ వేసుకుని హెయిర్ ను మొత్తం లూజ్ గా వదిలి హాల్లో సోపాలో కూర్చొని టీవీ చూస్తున్నాను. నా పక్కన మా మామయ్య వచ్చి కూర్చొన్నారు.

మేమిద్దరం ముచ్చటించుకుంటున్నాం

మేమిద్దరం ముచ్చటించుకుంటున్నాం

నా చదువు గురించి, ఇంట్లో వాళ్ల యోగక్షేమాల గురించి అడిగాడు. అక్క వంటిట్లో వండుతూ ఉంది. మేమిద్దరం ముచ్చట్లలో ఉన్నాం. జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ కూర్చొన్నాం. చదువు పరంగా ఏమైనా ఇబ్బందులుంటే చెప్పు.. నీకు డబ్బు కావాలంటే పంపుతాను అని అన్నాడు. ఓకే.. ఇప్పుడు ఏమి ఇబ్బందుల్లేవు అని చెప్పాను.

అతను చూపిన ప్రేమ

అతను చూపిన ప్రేమ

నా తల్లిదండ్రుల కంటే అతను నాపై చూపించిన ప్రేమ నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత అందరం కలిసి భోజనం చేశాం. చాలాసేపు నేను, అక్క, మామయ్య మాటల్లో మునిగిపోయాం.

ముగ్గురం ఒకే బెడ్ పై

ముగ్గురం ఒకే బెడ్ పై

అలా మా మాటలు రాత్రి 12 గంటల వరకు కొనసాగాయి. జర్నీ చేయడం వల్ల నాకు బాగా నిద్రవస్తుంది. అయితే మామయ్య వాళ్ల ఇంట్లో ఒక్కటే బెడ్ రూమ్ ఉంది. ఇళ్లు కూడా చాలా చిన్నదిగా ఉంది. దాంతో ఎక్కడ నిద్రపోవాలో అర్థం కావడం లేదు. చివరకు ముగ్గురం ఒకే బెడ్ పై పడుకుందామనుకున్నాం.

నాపై చేతులేశాడు

నాపై చేతులేశాడు

అక్క మధ్యలో నిద్రపోయింది. మామయ్య అటు వైపు నేను ఇంకోవైపు పడుకున్నాం. నా బాగా నిద్రపోతున్నాను. అకస్మాత్తుగా నాకు మెలకువ వచ్చింది. నా జుట్టును మా మామయ్య తన చేతులతో నిమురుతున్నాడు. ఒక్కసారిగా గట్టిగా అరవాలనిపించింది. కానీ నోట్లో నుంచి మాట రాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు.

భార్య పక్కనే ఉన్నా

భార్య పక్కనే ఉన్నా

నేను అతన్ని ఎప్పుడు కూడా అలా భావించలేదు. అతనిపై నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. అందులో అతను పెళ్లి అయిన వాడు. భార్య పక్కనే ఉంది. అయినా ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.

ఇంత దారుణంగానా..

ఇంత దారుణంగానా..

చివరకు అక్క నిద్రోలోనే నా వైపు తిరిగేసరికి అతను సైలెంట్ అయిపోయాడు. తర్వాత అటువైపు తిరిగి పడుకున్నాడు. నాకు మాత్రం గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఛీ.. ఇంత దారుణంగా ఉంటుందా సమాజం అని చాలా సార్లు కొన్ని రకాల వార్తలు చదివినప్పుడు అనిపించేది. కానీ మన ఇళ్లలో మన ఆత్మీయుల మనస్సులో కూడా ఇలాంటి దురాలోచనలుంటాయని అప్పుడే అర్థం అయ్యింది.

రాత్రంతా నిద్రరాలేదు

రాత్రంతా నిద్రరాలేదు

ఆ రాత్రి మొత్తం నాకు నిద్రపట్టలేదు. రాత్రంతా భయంభయంగా గడిచింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమన్నా అందామంటే బయటి వ్యక్తి కాదు. సొంతవాడే. చెప్పి ఆయన పరువు ఎందుకు తీద్దామని ఎవరికీ చెప్పలేదు. మొత్తానికి ఆ కాల రాత్రి అలా గడిచిపోయింది.

ఊరికెళ్తా అన్నాను

ఊరికెళ్తా అన్నాను

మరుసటి ఉదయం లేచి వెంటనే రెడీ అయి పోయాను. అక్క బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసింది. గబాగబా తిని నేను ఊరుకెళ్తా అని చెప్పాను. అప్పుడేనా నిన్న వచ్చావు.. అప్పుడే వెళ్తానంటున్నావ్ అని అక్క ఆశ్చర్యపోయింది.

ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చుగా అని అంది. కానీ ఇక్కడ ఉంటే జరిగే అనార్థాలేమో నాకు తెలుసు అని మనస్సులో అనుకున్నాను.

అప్పుడే వెళ్తుందా ఇది?

అప్పుడే వెళ్తుందా ఇది?

ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.. రేపు కాలేజీలో అర్జెంట్ పని ఉందని చెప్పాను. మా మామయ్య మాత్రం ఏమి అనలేదు. లోపల మాత్రం ఇది అప్పుడే వెళ్లి పోతుందా అని అనుకుంటున్నట్లున్నాడు.

బైక్ పై డ్రాప్

బైక్ పై డ్రాప్

మీ మామయ్య బస్ స్టాండ్ దగ్గర బైక్ పై డ్రాప్ చేస్తాడులే అని అంది మా అక్క. వద్దు తల్లీ అని మనుసులో అనకున్నాను. లేదు అక్కా.. నేను ఇక్కడి నుంచి ట్యాక్సీ లో వెళ్తాను. ట్యాక్సీ బుక్ చేశాను అని చెప్పాను.

ఇంట్లో కూడానా?

ఇంట్లో కూడానా?

ట్యాక్సీ రావడంతో లగేజీ తీసుకుని వెంటనే అక్కడి నుంచి బయల్దేరి పోయాను. బస్టాండ్ కొచ్చి మా ఊరికి వచ్చేశాను. బయటనే కాదు.. మనకు సంబంధించిన ఆత్మీయులు, బంధువులతో కూడా అమ్మాయిలకు సేఫ్టీ ఉండదనే విషయం నాకు అప్పుడు అర్థమైంది.

English summary

My Story My Uncle Tried To Abuse Me Even As My Aunt Slept In The Same Bed

My Story My Uncle Tried To Abuse Me Even As My Aunt Slept In The Same Bed