Latest Updates
-
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
ఈ ఎనిమిదేళ్లలో ఆరుసార్లు కలిశాం.. ఒక్కసారి సెక్స్ లో పాల్లొన్నాం - My Story # 106
అతడు నాకు 2010లో పరిచయం అయ్యాడు. నాకు అప్పుడు 18 సంవత్సరాలు. మా బంధువుల పెళ్లికి వెళ్లాను. అక్కడే అశోక్ పరిచయం అయ్యాడు. తొలిచూపులోనే అతనిపై ఇష్టం కలిగింది. అతను కూడా నన్ను తొలిచూపులోనే ఇష్టపడట్లు అతని కళ్లు చెప్పాయి.


హీరోలా ఉంటాడు
చూడడానికి సినిమా హీరోలా ఉంటాడు. కానీ చాలా సాధారణంగా ఉంటాడు. కొద్దిగా కూడా గర్వం ఉండదు. చాలా మంచి మనిషి. పెళ్లి అయిపోయేలోపు ఎలాగైనా సరే అతన్ని పరిచయం చేసుకోవాలనుకున్నాను.

చూపులు కలిశాయి
అతను కూడా నాతో మాట్లాడాలని తహతహలాడాడు. భోజనం చేసే దగ్గర ఇద్దరి చూపులు కలిశాయి. తినేటప్పుడు నా పక్కనే కూర్చొన్నాడు. తర్వాత మాట కలిపాడు. జోకులు వేశాడు. ఇద్దరం నవ్వుకున్నాం.

పెళ్లి కూతురు తరుఫు బంధువట
అలా మా పరిచయం ఏర్పడింది. తను పెళ్లి కూతురు తరుఫు బంధువట. పెళ్లి కొడుకు మా పెద్దమ్మ కొడుకే అని చెప్పాను. అయితే బావగారు మీ అన్ననే అన్నమాట అని వరుసలు కలిపాడు. పెళ్లి కూతురు అతనికి వరుసకు సిస్టర్ అవుతుందని అలా ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు.

సాయంత్రం వరకు
ఏం చదువుతున్నావ్ అన్నాడు. నేను డిగ్రీ ఫైనలియర్ చేస్తున్నా అన్నాను. తను బీఈడీ చేస్తున్నానని చెప్పాడు. అలా మొదలైన మా మాటలు సాయంత్రం వరకు అలాగే కొనసాగాయి.

విజయవాడ వస్తే ఇంటికి రా
ఇద్దరం బోలెడన్నీ విషయాలపై మాట్లాడుకున్నాం. ఇద్దరి మనస్సులు కలిశాయి. అశోక్ ది విజయవాడ. మాది ఖమ్మం. ఎప్పుడైనా విజయవాడ వస్తే తమ ఇంటికి రమ్మని కూడా అశోక్ ఆహ్వానించాడు.

ఫోన్ చేశాను
పెళ్లి అయిపోగానే అశోక్ వెళ్లిపోయాడు. అతని ఫోన్ నంబర్ కూడా నేను తీసుకోలేదు. అతను కూడా నన్ను ఫోన్ నంబర్ అడగలేదు. వేరే వాళ్ల ద్వారా అశోక్ ఫోన్ నంబర్ సంపాదించాను. ఫోన్ చేశాను.. బాగున్నావా.. అశోక్ అన్నాను. నువ్వు ఎలా ఉన్నావ్ అన్నాడు.

అందుకే నంబర్ అడగలేదు
నీ నంబర్ కోసం చాలా ట్రై చేశాను అశోక్ అన్నాను. నువ్వు అలా ట్రై చేసి నంబర్ సంపాదించి నాకు ఫోన్ చేయాలనే ఉద్దేశంతోనే నేను నిన్ను ఫోన్ నంబర్ అడగలేదు అన్నాడు.

నాకు ఫోన్ చేస్తావని తెలుసు
ఎందుకంటే... నీకు నాపై ప్రేమ ఉంటే కచ్చితంగా నువ్వు నాకు ఫోన్ చేస్తావనే నమ్మకం నాకు ఉంది అందుకే అలా చేశాను అన్నాడు.

నిన్ను ప్రేమించడం లేదు
నేను నిన్ను ఏమి ప్రేమించడం లేదు ఏదో క్యాజ్ వల్ గా ఫోన్ చేశాను అని జోక్ చేశాను. తర్వాత అసలు విషయం చెప్పాను. నిన్ను చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాను.

పెళ్లి చేసుకుందామనుకున్నాం
తను కూడా ఒకే అన్నాడు. ఇద్దరి ఇళ్లలో పెద్దవారితో మాట్లాడి పెళ్లి చేసుకుందామనుకున్నాం. తర్వాత ఒక రోజు నేను బ్యాంక్ ఎగ్జామ్ కోసం అని విజయవాడ వెళ్లాను. ఎగ్జామ్ అయిపోయాక సెంటర్ దగ్గరకు అశోక్ వచ్చాడు.

ఫ్లాట్ అయ్యాను
తర్వాత నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. ఇళ్లు సింపిల్ గా చాలా బాగుంది. వాళ్ల అమ్మానాన్న, చెల్లెలు ఆ రోజు పెళ్లికి వెళ్లారు. తనే స్వయంగా భోజనం చేసి వడ్డించాడు. తను చూపిన ప్రేమకు నేను ఫ్లాట్ అయ్యాను.

మార్నింగ్ వస్తానన్నాను
కచ్చితంగా అశోక్ ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అప్పటికే సాయంత్రం అయ్యింది. ఇంటికి ఫోన్ చేసి రేపు మార్నింగ్ వస్తానని చెప్పు అని అశోక్ చెప్పాడు. ఇంటికి ఫోన్ చేసి ఫ్రెండ్ వాళ్ల ఇంట్లో ఉన్నాను రేపు మార్నింగ్ వస్తానని చెప్పాను. ఇంట్లో వాళ్లు ఒకే అన్నారు.

చాలా కసిగా చూశాడు
నైట్ అశోక్ వాళ్ల ఇంట్లో ఎవరూ లేరు. నేను ఫ్రెషప్ అయి అశోక్ చెల్లెలి నైటీ వేసుకున్నాను. అశోక్ నన్నే చూస్తూ ఉండిపోయాడు. అతని చూపుల్లోని అంతరార్థం కూడా నాకు అర్థం అయ్యింది. చాలా కసిగా చూశాడు.

రోజూ స్వర్గమే
ఇంత అందంగా ఉన్న నువ్వు నా భార్యగా వస్తే నాకు ప్రతి రోజూ స్వర్గమే అన్నాడు. అతని కోరికను చెప్పకనే చెప్పాడు. కొద్ది సేపు ఇద్దరం కలిసి టీవీ చూశాం. తర్వాత నేను బెడ్రూమ్ లోకి వెళ్లాను.

బెడ్రూమ్ లో పడుకోమన్నాను
కొత్త ప్లేస్ కావడంతో నిద్రపట్టలేదు. అందులో నాకు కాస్త భయం వేసింది. అశోక్ ను కూడా అదే బెడ్రూమ్ లో పడుకోమని చెప్పాను. లైట్స్ ఆఫ్ చేశాం. కొద్ది సేపటి వరకు అశోక్ సైలెంట్ గా ఉన్నాడు.

నడుముపై చెయ్యి వేశాడు
సడన్ గా నా నడుముపై చెయ్యి వేశాడు. నాకు అదోలా అనిపించింది. తర్వాత ఆ చెయ్యి ఎక్కడికంటే అక్కడికి వెళ్లింది. ఏదేదో చేశాడు. నేను కూడా కమిటి అయ్యాను. అతన్ని కౌగిళ్లలో ఒదిగిపోయాను.

కన్యత్వాన్ని సమర్పించాను
చీకట్లో ఏవేవో చేసేశాం. అంత వరకు దాచుకున్న నా కన్యత్వాన్ని కూడా అతనికి మనస్పూర్తిగా సమర్పించుకున్నాను. ఇద్దరి ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. అలాగే జీవితాంతం ఉండాలని అనుకున్నాం. అలా ఉండటమే మా ఇద్దరికి ఇష్టం కూడా.

లేదంటే చస్తాను
ఉదయం నన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేశాడు. కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. నేను మా ఇంట్లో మా ప్రేమ గురించి చెప్పాను. మా నాన్న అస్సలు ఒప్పుకోలేదు. మా నాన్న తన చెల్లెలి కొడుకుకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. లేదంటే చస్తాను అని బెదిరించాడు.

పెళ్లి
చివరకు నా పెళ్లి మా నాన్న చెల్లెలి కొడుకుతోనే అయ్యింది. ఈ విషయం తెలిశాక అశోక్ చాలా బాధపడ్డాడు. కానీ నేను అసలు విషయం చెప్పే సరికి అర్థం చేసుకున్నాడు. ఇప్పటికీ నాతో మాట్లాడుతుంటాడు.

ఒక్కసారి మాత్రమే..
మేము పరిచయం అయిన ఎనిమిదేళ్లలో నేను అశోక్ మొత్తం ఆరుసార్లు మాత్రమే కలిశాం. ఒక్కసారి అంటే నేను విజయవాడకు ఎగ్జామ్ కు వెళ్లినప్పుడు మాత్రం కాస్త హద్దులు దాటాం. ఇప్పటికీ ఆ విషయం గుర్తొస్తే మనస్సంతా ఆనందంతో నిండిపోతుంది. మేమిద్దరం కలిసేది చాలా తక్కువ అయినా మా మధ్య ఉన్న ప్రేమ మాత్రం చచ్చేదాకా అలాగే శాశ్వతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











