For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లేహ్ వెళ్తుంటే ఆయన ఇచ్చిన ముద్దు ఊపిరినిచ్చింది.. ఒక్కసారైనా అలా ఎంజాయ్ చెయ్యాలి - #mystory173

మనాలి నుంచి లేహ్‌ మొత్తం 473 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఆ రోడ్డు చాలా ఎత్తులో ఉంటుంది. ఇది ఏడాదిలో ఎనిమిది నెలల పాటు మంచులో కూరుకుపోయి ఉంటుంది.లేహ్ ట్రిప్, మనాలి నుంచి లేహ్

|

వయస్సులో ఉన్నప్పుడే మనం తిరగాల్సిన అన్ని ప్లేసులు తిరగాలి. చూడాల్సినవన్నీ చూడాలి. చెయ్యాల్సినవన్నీ చెయ్యాలి. ఇదే నేను నమ్మేది. అందుకే ప్రతి క్షణం నేను అలాగే నడుచుకుంటూ ఉంటాను.

యూత్ లో ఒంట్లో శక్తి బాగా ఉంటుంది. గుండెలో ధైర్యం కావాల్సినంత ఉంటుంది. అన్నింటినీ మించి దమ్ముంటుంది. నాకు కొత్తగా పెళ్లి అయ్యింది. నా భర్తకు కూడా సేమ్ నాలాంటి అభిరుచులే ఉన్నాయి. మా ఆఫీసులో నాకు హనీమూన్ హాలీడేస్ ఇచ్చారు.

మనాలి నుంచి లేహ్‌

మనాలి నుంచి లేహ్‌

నేను చాలా రోజులుగా ఆలోచించాను. మనాలి నుంచి లేహ్‌ వెళ్లాలని ప్లాన్ చేశాను. మాది మనాలికి సమీపంలోని పట్టణం కాబట్టి నాకు ఈ ట్రిప్ వెళ్లాలని అది కూడా నా భర్తతో వెళ్లాలని చాలా రోజులుగా ఉండేంది. ఆ రహదారిలో ఉండే కొండలు, లోయల గుండా మా ఆయన బైకు రైడింగ్ చేస్తుంటే నేను వెనకాల కూర్చొని ఫుల్ గా ఎంజాయ్ చేశాను.

లోయలన్నీ పూలతో

లోయలన్నీ పూలతో

అందమైన కశ్మీరం.. లోయలన్నీ పూలతో పరవశించిపోతుంటే నా ఆనందానికి అవధుల్లేవు. కొండల్లో మంచును చూస్తే మైమరిచిపోతాం. డొంకల్లో గలగలపారే సెలయేళ్లను నా మది పరవశించిపోయేది.

బైక్ పై అక్కడికి వెళ్తున్నప్పుడు

బైక్ పై అక్కడికి వెళ్తున్నప్పుడు

ఇక లద్దాఖ్‌ ప్రాంతాన్ని చూస్తే ఆ సంతోషమే వేరు. లద్దాఖ్‌ జమ్ము-కశ్మీర్‌లో భాగమే అయినా.. ప్రత్యేక కారణాల దృష్ట్యా ఈ ప్రాంతానికి ఓ రాజధాని ఉంది. అదే లేహ్‌. విస్తీర్ణం పరంగా దేశంలోనే రెండో అతిపెద్ద జిల్లా. మేము బైక్ పై అక్కడికి వెళ్తున్నప్పుడు పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేం.

హజ్బెండ్స్ బైకులపై దుమ్ములేపుతూ

హజ్బెండ్స్ బైకులపై దుమ్ములేపుతూ

మేము హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి నుంచి లేహ్‌కు బయల్దేరాం. మాతో పాటు మరికొన్ని జంటలు కూడా వచ్చాయి. హజ్బెండ్స్ బైకులపై దుమ్ములేపుతూ దూసుకెళ్తుంటే ఆడవాళ్లంతా భర్తల్ని గట్టిగా హత్తుకుని కూర్చొన్నారు.

ఎనిమిది నెలలు మంచులో

ఎనిమిది నెలలు మంచులో

మనాలి నుంచి లేహ్‌ మొత్తం 473 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఆ రోడ్డు చాలా ఎత్తులో ఉంటుంది. ఇది ఏడాదిలో ఎనిమిది నెలల పాటు మంచులో కూరుకుపోయి ఉంటుంది. ఏటా ఏప్రిల్‌ చివరి వారం లేదా మే మొదటివారంలో మాత్రమే ఈ దారిలో ప్రయాణాలు చెయ్యడానికి అనుమతి ఇస్తారు.

రోడ్డు బాగా రద్దీగా

రోడ్డు బాగా రద్దీగా

ఈ నాలుగు నెలల పాటు పర్యాటకులతో రోడ్డు బాగా రద్దీగా ఉంటుంది. అందరూ బైక్‌ల పైనే మనాలి నుంచి లేహ్‌ను చూసేందుకు వెళ్తుంటారు. కొండలు ఎక్కుతూ.. లోయల్లో దిగుతూ సాగే ఆ ప్రయాణం చాలా రొమాంటింక్ గా ఉంటుంది.

సొంత బైక్ పైనే వెళ్లాం

సొంత బైక్ పైనే వెళ్లాం

మేము అయితే మా సొంత బైక్ పైనే వెళ్లాం. కానీ కొందరు మనాలీలో భారీ బైక్‌లు అద్దెకు తీసుకుని బయల్దేరుతారు. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, డుకాటి, బీఎమ్‌డబ్ల్యూ పెద్దపెద్ద బైక్‌లు కూడా అద్దెకు దొరుకుతాయి. రోజుకు అద్దె రూ.2000 లోపే ఉంటుంది.

నా పెదాలపై తన పెదాలను ఉంచి

నా పెదాలపై తన పెదాలను ఉంచి

ఆ దారిలో వెళ్తున్నప్పుడు బాగా చలిగా ఉంటుంది. అప్పుడు నేను మా ఆయన్ని గట్టిగా హత్తుకున్నా. చలిగాలి ఊపిరి సలపనీయలేదు. మా ఆయన బైక్ ఆపి గట్టిగా నన్ను హత్తుకుని నా పెదాలపై తన పెదాలను ఉంచి గాఢమైన ముద్దు ఇచ్చాడు.

తొలి ముద్దు అది

తొలి ముద్దు అది

తన శ్వాస గుండెను తాకింది. మళ్లీ తిరగి ఊపిరి వచ్చినట్లుయ్యింది. మా ఆయన మా పెళ్లి అయ్యాక ఇచ్చిన తొలి ముద్దు అది. అందుకే నాకు అంత బాగా గుర్తుంది.

లద్దాఖ్‌

లద్దాఖ్‌

ఇక లద్దాఖ్‌ అంటే పాస్‌ (రెండు పర్వతాల గుండా వెళ్లే దారి)ల నిలయం అని అర్థం. మనాలి నుంచి లేహ్‌ వెళ్లే దారంతా పాస్‌ల మీదుగా సాగిపోతుంది. మనాలి సముద్ర మట్టానికి 6726 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడికి 51 కిలోమీటర్ల దూరంలో ఉండే రోహ్‌తాంగ్‌ పాస్‌ సముద్ర మట్టానికి 13050 అడుగుల ఎత్తులో ఉంటుంది.

పచ్చదనం బాగా ఉంటుంది

పచ్చదనం బాగా ఉంటుంది

మనాలి నుంచి రోహ్‌తాంగ్‌ చేరుకునే సరికి దాదాపు రెండు కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటాం. దారికి ఇరువైపులా పచ్చదనం బాగా ఉంటుంది. రోహ్‌తాంగ్‌ నుంచి కీలాంగ్‌, సార్చు, బార్‌లాచ్లా, లాచులుంగ్‌ పాస్‌ల మీదుగా తాంగ్లాంగ్‌ పాస్‌ చేరుకున్నాం. తాంగ్లాంగ్‌ పాస్‌ ప్రపంచంలోనే రెండో అతి ఎత్తయిన పాస్‌. ఇక్కడి నుంచి ఉప్శీ మీదుగా ప్రయాణించి లేహ్‌ చేరుకున్నాం.

మట్టి, రాళ్లు కలిపి కుమ్మరించినట్టుగా

మట్టి, రాళ్లు కలిపి కుమ్మరించినట్టుగా

ఇక మనాలి నుంచి లేహ్‌ వెళ్లే దారి మొత్తం చాలా బాగుంటుంది. కీలాంగ్‌, సర్చు దాటాక పచ్చదనం జాడలేని పర్వతాలు కనిపిస్తాయి. మట్టి, రాళ్లు కలిపి కుమ్మరించినట్టుగా ఉన్న కొండలపై అక్కడక్కడ మంచు పేరుకుపోయి ఉంటుంది. ఒక్కో కొండ ఒక్కో రంగులో భలే అందంగా ఉంటుంది. ఇక లేహ్‌ దారిలో జోడు మూపురాల ఒంటెలపై విహారం ఉత్సాహాన్నిస్తుంది. లద్దాఖ్‌ ప్రాంతంలో మాత్రమే కనిపించే ఒంటెలపై ఊరేగుతూ ఫొటోలు దిగాం.

తనివితీరా తనువులు మరిచి

తనివితీరా తనువులు మరిచి

లేహ్ కు వెళ్లాక అక్కడ మాకు చాలా హోటల్స్‌, అతిథి గృహాలు కనిపించాయి. కోక్సర్‌, సిస్సూ, గోండియా, టాండీ, కీలాంగ్‌, జిస్పా, ఉప్శీ ఇలాంటి హోటల్స్ మొత్తం మాకు ఆతిథ్యానికి రెడీగా ఉన్నాయి. మేము అందులో ఒక హోటల్ లో బస చేశాం. కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. ఆ వాతావరణానికి మంత్ర ముగ్దులం అయిపోయి ఇద్దరం తనివితీరా తనువులు మరిచి అల్లుకుపోయి ఎంజాయ్ చేశాం.

ఇండో-టిబెట్‌ సంస్కృతి ఎక్కువ

ఇండో-టిబెట్‌ సంస్కృతి ఎక్కువ

లేహ్‌ నగరంలో ఇండో-టిబెట్‌ సంస్కృతి ఎక్కువ. బౌద్ధారామాలు, బౌద్ధ బిక్షువులు కనిపిస్తారు. ఇక్కడికి చుట్టుపక్కల ఎన్నో సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. మేము ఫస్ట్ ప్యాంగాంగ్‌ సరస్సు చూశాం. సరస్సులోని కొంత భాగం చైనా (టిబెట్‌) కొంత భారత్‌లోనూ ఉంటుంది. సూర్యకిరణాలు ప్రసరించినప్పుడు ఒకలా, మబ్బుపట్టినప్పుడు మరోలా ఈ సరస్సులో నీళ్లు రంగులు మారుతుంటాయి.

ఒక్కసారైనా ఎంజాయ్ చేయండి

ఒక్కసారైనా ఎంజాయ్ చేయండి

మాది మనాలి దగ్గర ఊరు కాబట్టి మేము ఈజీగా బైక్ పై లేహ్ వెళ్లాం. ఆ మార్గంలో అందాలన్నీ చూశాం. ఒక వేళ మీరు దూరప్రాంతాల వారు అయితే ముందుగా మనాలి రావాలి. మనాలి రావాలంటే ముందుగా చండీగఢ్‌ చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సులో, ట్యాక్సీలో మనాలికి (305 కి.మీ) రావొచ్చు. ఇక ఇక్కడ నుంచి లేహ్ వెళ్లొచ్చు. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా మీ భార్యతో ఈ ట్రిప్ ఎంజాయ్ చేయండి. మళ్లీ మరిచిపోలేరు.

English summary

awesome experience on my leh trip with my husband

awesome experience on my leh trip with my husband
Story first published:Friday, May 25, 2018, 10:53 [IST]
Desktop Bottom Promotion