పురుషాంగాన్ని ఆ విధంగా చేయించుకున్న అబ్బాయిలు సెక్స్‌లో అమ్మాయిలను ఎక్కువగా సంతృప్తి పరుస్తున్నారట

Written By:
Subscribe to Boldsky

ఒక్కో మతం సంప్రదాయం ఒక్కో విధంగా ఉంటుంది. మనం అన్నింటినీ గౌరవించాలి. అయితే మత సంప్రదాయాలు ఒక్కోసారి సైన్స్ తో లింక్ ఉంటాయి. ఆనందానికి చివరకు సెక్స్ సంతృప్తికి కూడా మతాచారాలను పక్కనబెట్టి మరీ కొన్ని పాటిస్తేనే మంచిదని పరిశోధనలు తెలుపుతున్నాయి.

సంప్రదాయం

సంప్రదాయం

సున్తీ చేయించుకోవడం పక్కాగా కొన్ని మతాల సంస్కృతి అని అందరికీ తెలుసు. కానీ దానివల్ల మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు ఉండవని చాలా కాలంగా వైద్యులు చెబుతూనే ఉన్నారు. తాజాగా సెక్స్‌లో నిజమైన సంతృప్తిని పొందాలంటే జీవితంలో ప్రతి ఒక్కరూ అలాగే చేసి తీరాల్సిందే అంటున్నారు పరిశోధకులు.

సున్తీతో ప్రయోజనాలు

సున్తీతో ప్రయోజనాలు

సున్తీ చేయించుకోవడం అనేది కొన్ని మతాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. కానీ మత సంబంధ కారణాలను పక్కనబెడితే సున్తీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

సెక్స్ చేసే సమయంలో

సెక్స్ చేసే సమయంలో

పూర్వచర్మం బిగుతుగా ఉండటం అనేక సమస్యలకు కారణం అవుతుంది. సెక్స్ చేసే సమయంలో చర్మం వెనక్కి రాకపోవడం వల్ల చిట్లి గాయాలపాలయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంగప్రవేశం

అంగప్రవేశం

ఒక్కోసారి అంగప్రవేశం కూడా కష్టం అవుతుంది. సున్తీతో ఈ సమస్యను అధిగమించడంతోపాటు శృంగారాన్ని కూడా మరింతగా ఆస్వాదించవచ్చని ఓ పరిశోధనలో తేలింది.

శృంగారాన్ని ఆస్వాదిస్తున్నారు

శృంగారాన్ని ఆస్వాదిస్తున్నారు

పురుషాంగంపై పూర్వ చర్మాన్ని తొలగించిన వారిలో రెండింట మూడొంతుల మంది గతంతో పోలిస్తే శృంగారాన్ని ఆస్వాదిస్తున్నారని తేలింది. సున్తీ చేయించుకున్న రెండేళ్ల తర్వాత చక్కటి ఫలితం కనిపించినట్లు వారు వెల్లడించారు.

చర్మంపై గాయాలు

చర్మంపై గాయాలు

సున్తీ చేయించుకోవడం వల్ల పూర్వ చర్మంపై గాయాలు కావడం తగ్గిందని అధ్యయనంలో తేలింది. ఫలితంగా పురుషులు మరింతగా శృంగారాన్ని ఆస్వాదిస్తున్నట్లు వెల్లడైంది.

హ్యాపీగా ఉన్నాం

హ్యాపీగా ఉన్నాం

సున్తీ తర్వాత హ్యాపీగా ఉన్నామని 98 శాతం మంది తెలపగా, తమతో సెక్స్‌లో పాల్గొనే మగువలు మరింత సంతృప్తి చెందుతున్నారని 95 శాతం మంది తెలిపారు. సున్తీ చేయించుకోవడం వల్ల సంక్రమించే ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుందనే సంగతి కూడా తెలిసిందే.

పూర్తిస్థాయి సంతోషం ఉండదు

పూర్తిస్థాయి సంతోషం ఉండదు

అయితే గతంలో సున్తీకి సంబంధించి మరికొన్ని విషయాలు వెల్లడయ్యాయి. పురుషాంగం పూర్వచర్మాన్ని కట్ చేసుకున్న(సున్తీ) చేయించుకున్న పురుషుల్లో సెక్స్‌లో పూర్తిస్థాయి సంతోషాన్ని, తృప్తిని పొందలేరని గతంలో కొందరు పరిశోధకులు తెలిపారు.

సెక్స్ తృప్తి తక్కువ

సెక్స్ తృప్తి తక్కువ

పురుషాంగం పూర్వచర్మాన్ని తొలగించుకున్న పురుషుల్లో భావప్రాప్తి, సెక్స్ తృప్తి తక్కువ మోతాదులో ఉన్నట్లు డెయిల్ మెయిల్ అప్పట్లో వెల్లడించింది.

ఇన్ఫెక్షన్ సమస్యలు తక్కువ

ఇన్ఫెక్షన్ సమస్యలు తక్కువ

అదేసమయంలో పూర్వచర్మం లేకుండా సున్తీ చేయించుకున్నవారిలో పురుషాంగం శిశ్నం వద్ద వచ్చే ఇన్ఫెక్షన్ సమస్యలు తక్కువని, సున్తీ చేయించుకోనివారిలో ఇది ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.

పురుషాంగం పూర్వచర్మం

పురుషాంగం పూర్వచర్మం

సున్తీ చేయించుకోని పురుషుల్లో శిశ్నం సున్నితంగా ఉండటానికి కారణం వారి పురుషాంగం పూర్వచర్మమేనని వెల్లడించారు. దీనివల్ల సంభోగం సమయంలో పూర్వచర్మం వెనుకకు కదిలి సున్నితంగా ఉన్న శిశ్నం యోనిలోకి ప్రవేశించడంతో అనిర్వచనీయమైన తృప్తిని వారు పొందుతున్నట్లు తేలిందన్నారు.

అండర్వేర్ ధరించినపుడు

అండర్వేర్ ధరించినపుడు

సున్తీ చేయించుకున్న పురుషుల్లో పురుషాంగం పూర్వచర్మం లేకపోవడంతో శిశ్నం అండర్వేర్ ధరించినపుడు దానికి తగులుతూ ఉండటం వల్ల సున్నితత్వాన్ని కోల్పోతుందని తేలిందన్నారు. అయితే ఎవరి మతవిశ్వాసాలు వారివే. మతవిశ్వాసాలను గౌరవిద్దాం. పాటిద్దాం.

English summary

effects of circumcision on male sexual functions

effects of circumcision on male sexual functions
Story first published: Saturday, March 10, 2018, 9:58 [IST]