Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
పెళ్లికి ముందు నేనంటే పడి చచ్చేవాడు, ఎంత వెంటపడ్డాడో, పెళ్లయ్యాక #mystory368
నోటి వెంట మాట రాలేదు. మూగబోయాను. "ఏం భయపడకు.. నీకు ఒక మాట చెబుతాను. నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. నీ అభిప్రాయం పాజిటివ్ గా ఉన్నా నెగెటివ్ గా ఉన్నా నేను గౌరవిస్తాను. నీకు ఆలోచనలకు నేను విలువ ఇస్తాను. "
నా భర్త చాలా అందగాడు. తను ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయియైనా ఒకే చెబుతుంది. కానీ తను నన్నే ఇష్టపడ్డాడు. అవి మేము కాలేజీ చదివే రోజులు.
రోజూ తను నావంకే చూసేవాడు. నన్నే ఫాలో అయ్యేవాడు. అవన్నీ నాకు తెలిసేవి. కానీ తెలియనట్లు నటించేదాన్ని. ఎందుకంటే అంత అందగాడు నిజంగా నా వెంట పడుతున్నాడా అని నా డౌట్.

అతని వంక చూడలేదు
అందుకే నేను చాలా రోజుల వరకు అతని వంక చూడలేదు. ఒకరోజు నేను ఉదయమే వచ్చి కాలేజీలో కూర్చొన్నాను. తను కూడా మార్నింగే వచ్చాడు. వచ్చి నా పక్కన కూర్చొన్నాడు. నాకు చాలా భయం వేసింది.

నీకు ఒక మాట చెబుతాను
నోటి వెంట మాట రాలేదు. మూగబోయాను. "ఏం భయపడకు.. నీకు ఒక మాట చెబుతాను. నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. నీ అభిప్రాయం పాజిటివ్ గా ఉన్నా నెగెటివ్ గా ఉన్నా నేను గౌరవిస్తాను. నీకు ఆలోచనలకు నేను విలువ ఇస్తాను. " అని తను అన్నాక నాకు కాస్త ధైర్యం వచ్చింది.

నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా
తను చెప్పబోయే మాట నేను నిన్ను ప్రేమిస్తానని నాకు తెలుసు. అయితే తను.. నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. మన చదువు పూర్తయ్యాక నాకు జాబ్ వచ్చాకే నన్ను పెళ్లి చేసుకో అన్నాడు.

నేను నిన్ను బాగా చూసుకుంటాను
నేను ఒక్కణ్నే కొడుకుని. ఆర్థికంగా నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. నేను నిన్ను బాగా చూసుకుంటాను. ఆ విషయంలో నీకు ఎలాంటి సందేహం లేదన్నాడు. నాకు కూడా అతని మాటల్లో నిజాయితీ కనిపించింది. ఆ క్షణంలోనే ఒకే చెప్పేశాను.

అమ్మాయిల దగ్గర వెకిలి చేష్టలు
చాలా మంది అబ్బాయిలు ప్రేమ పేరుతో అమ్మాయిల దగ్గర వెకిలి చేష్టలు చేస్తూ ఉంటారు. కానీ నా భర్త అలా ఎన్నడూ చేయలేదు. తాను నన్ను ప్రేమించేటప్పుడు కూడా ఎంతో గౌరవంగా మెలిగేవాడు. తను నేను కాదన్నా కూడా అంతే పాజిటివ్ గా తీసుకునేవాడు అనుకుంటాను.

జాబ్స్ లో జాయినయ్యాక
తను మంచి ర్యాంకర్ స్టూడెంట్. నేను కూడా. మా ఇద్దరిదీ మంచి ఈడుజోడు అని అందరూ అంటూ ఉంటారు. ఆయన హైట్ కు తగట్లే నేనూ ఉంటాను. ఇద్దరిదీ ఎంసీఏ అయిపోయాక జాబ్స్ లో జాయినయ్యాక ఇరు కుటుంబాల్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం.



Click it and Unblock the Notifications
