For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేవ్ తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశాను.. కానీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది - #mystory122

శనివారం, ఆదివారం బెంగళూరులోని ప్రతి పబ్ లో ఎంజాయ్ చేశాం. గోవా, ముంబై, ఊటీ ఇలా మేము వెళ్లని పర్యాటక ప్రాంతం అంటూ ఏదీ లేదు. వీకెండ్స్ లో ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లం.

|

తను నాకు కాలేజీ డేస్ నుంచి ఫ్రెండ్. చాలా మంచి కుర్రాడు. టెన్త్ వరకు నేను గర్ల్స్ స్కూల్ లో చదివాను. ఇంటర్ లో కో ఎడ్యుకేషన్ కాలేజీలో చేరాను. అక్కడ నాకు దేవేంద్ర పరచయం అయ్యాడు. నేను అతన్ని ముద్దుగా దేవ్ అని పిలిచేదాన్ని. కాలేజీలో జాయిన్ అయిన కొన్ని రోజులకే ఒక చిన్న టెస్ట్ పెట్టాడు మా ఇంగ్లిష్ లెక్చరర్.

ఏదో ఒక వంకతో మాట్లాడేదాన్ని

ఏదో ఒక వంకతో మాట్లాడేదాన్ని

ఆ టెస్ట్ లో నేను, దేవ్ ఇద్దరం ఫస్ట్ వచ్చాం. మా ఇద్దరికీ ఇంగ్లిష్ లెక్చరర్ గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు. అప్పుడు నాతో ఫస్ట్ టైమ్ దేవ్ మాట్లాడాడు. తర్వాత నేను కూడా . ఇంటర్ రెండు సంవత్సరాలు ప్రతి రోజూ దేవ్ తో ఏదో ఒక టాఫిక్ గురించి డిస్కస్ చేసేదాన్ని.

ఇంటర్ నుంచే

ఇంటర్ నుంచే

ఇంటర్ నుంచే ఇద్దరికీ భవిష్యత్తుపై ఒక అవగాహన ఉండేది. ఇంటర్ అయిపోయాక ఏం చదవాలి. తర్వాత ఏం చేయాలి అనే అంశాలపై నేను, దేవ్ ఎప్పుడూ చర్చిస్తూ ఉండేవాళ్లం. ఇంటర్ లోనే ఎంసెట్ కు ప్రిపేరయ్యేవాళ్లం.

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్

ఇంటర్ తర్వాత ఇద్దరం ఎంసెట్ రాశాం. ఇద్దరికీ మంచి ర్యాంకులు వచ్చాయి. తర్వాత మంచి కాలేజీలో బీటెక్ లో జాయినయ్యాం. ఇద్దరం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లలో సీట్లు సాధించాం.

ఎక్కడా కూడా హద్దులు దాటలేదు

ఎక్కడా కూడా హద్దులు దాటలేదు

బెంగళూరులో టాప్ కాలేజీలో జాయినయ్యాం. ఇంటర్ నుంచి బాగా ఫోకస్ పెట్టి చదవడం వల్ల మా ఇద్దరికీ సీట్లు వచ్చాయి. ఇక బీటెక్ నాలుగేళ్లు చదువుపైనే దృష్టి పెట్టాం. అయితే మా ఫ్రెండ్ షిప్ మాత్రం ఎక్కడా కూడా హద్దులు దాటలేదు.

ఔటింగ్ కు

ఔటింగ్ కు

దేవ్ తో నేను అప్పుడప్పుడు ఔటింగ్ కు వెళ్లేదాన్ని. అలాగే ఇద్దరం ఉదయాన్నే ప్రాకికల్ క్లాసులకు వెళ్లేవాళ్లం. బీటెక్ తర్వాత బెంగళూరులో ఎంటెక్ కూడా చేశాం.

ప్రతి పబ్ లో ఎంజాయ్ చేశాం

ప్రతి పబ్ లో ఎంజాయ్ చేశాం

తర్వాత ఇద్దరం ఒకే కంపెనీలో జాబ్ సాధించాం. లక్షల్లో వేతనం వచ్చేది. అలా ఇద్దరం సెటిల్ అయ్యాక అప్పుడు ఎంజాయ్ గురించి ఆలోచించాం. శనివారం, ఆదివారం బెంగళూరులోని ప్రతి పబ్ లో ఎంజాయ్ చేశాం.

వీకెండ్స్ లో ఫుల్ ఎంజాయ్

వీకెండ్స్ లో ఫుల్ ఎంజాయ్

గోవా, ముంబై, ఊటీ ఇలా మేము వెళ్లని పర్యాటక ప్రాంతం అంటూ ఏదీ లేదు. వీకెండ్స్ లో ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లం. మళ్లీ మా జాబ్ కూడా ఫర్ పెక్ట్ గా చేసేవాళ్లం. జాబ్ లో జాయినయ్యాక మా ఆనందానికి అవధులుండేవి కావు.

ఏదో వెలితి

ఏదో వెలితి

దేవ్ తో ఒక్కరోజు మాట్లాడకున్నా నాకు ఏదో వెలితిగా అనిపించేది.

దేవ్ కు కూడా అంతే. నాతో ఒక్కరోజు తను మాట్లాడుకున్నా కూడా ఉండలేపోయేవాడు. ఇద్దరం ఉద్యోగంలో చేరిన తర్వాత చాలా క్లోజ్ అయిపోయాం.

చాలా మంది ప్రపోజ్ చేసేవారు

చాలా మంది ప్రపోజ్ చేసేవారు

దేవ్ తో నేను ప్రతి విషయం చెప్పేదాన్ని. నాకు ఎవరెవరు ప్రపోజ్ చేశారు.. నాకు ఎవరు సైట్ కొడుతుంటారు ఇలా ప్రతి విషయం ఇద్దరం మాట్లాడుకుంటూ నవ్వుకునేవాళ్లం. దేవ్ కు కూడా చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసేవారు. అయినా పట్టించుకునే వాడు కాదు.

క్యాజ్ వల్ గా టచ్ చేసినా

క్యాజ్ వల్ గా టచ్ చేసినా

దేవ్ పై నాకు ఎప్పుడు కూడా అలాంటి భావన కలగలేదు. కానీ

సడన్ గా ఎందుకో అతనిపై తెలియని ప్రేమ పుట్టింది. తను మాట్లాడుతుంటే నాకు తెలియని హాయి కలిగేది. జస్ట్ దేవ్ నన్ను క్యాజ్ వల్ గా టచ్ చేసినా కూడా నా శరీరం పులకరించిపోయేది.

అతనిపై ప్రేమ చిగురించింది

అతనిపై ప్రేమ చిగురించింది

దేవ్ నాతో ఉన్నంతసేపు నేను దేవ లోకంలో విహరిస్తున్నట్లు ఉండేది. ఇన్నాళ్లు ఎందుకు నేను దేవ్ కు ప్రపోజ్ చేయలేదని మనస్సులో అనిపించింది. కాలేజీ రోజుల నుంచి మా పరిచయం ఉన్నా నాకు అతనిపై ప్రేమ చిగురించింది మాత్రం జాబ్ లో జాయిన్ అయ్యాకే.

తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను

తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను

దేవ్ తో నేను నా ప్రేమ గురించి చాలాసార్లు చెప్పాలనుకున్నాను. కానీ చెప్పలేకపోయాను. నన్ను తను రిజెక్ట్ చేస్తే నేను తట్టుకోలేను. అందుకే నేను ఆ విషయం చెప్పలేకపోయాను. తర్వాత మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధం నిశ్చయించారు. తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను.

ఫోన్ స్విచాఫ్ చేసేస్తాడు

ఫోన్ స్విచాఫ్ చేసేస్తాడు

నాకు ఇప్పుడు పెళ్లయిపోయింది. కానీ దేవ్ ఆలోచనలతోనే ఎక్కువసేపు కాలం గడుపుతుంటాను. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీసులో నాతో చనువుగా మాట్లాడే దేవ్.. ఇంటికెళ్లగానే ఫోన్ స్విచాఫ్ చేసేస్తాడు. నాతో మాట్లాడడు.

మనస్సును అర్థం చేసుకోవడం లేదు

మనస్సును అర్థం చేసుకోవడం లేదు

తన మాటలు విననిదే నేను ఉండలేకపోతున్నా. నన్ను దేవ్ అంతగా ఎందుకు ఉడికిస్తున్నాడో అర్థం కావడం లేదు. ఒక్కోసారి నాకే అనిపిస్తూ ఉంటుంది. నాతో అతను కేవలం మాట్లాడటం వరకే చేస్తున్నాడు. నా మనస్సును అర్థం చేసుకోవడం లేదని బాధ వేస్తూ ఉంటుంది.

నా భర్తకన్నా దేవ్ ఇంపార్టెంట్

నా భర్తకన్నా దేవ్ ఇంపార్టెంట్

ఇప్పుడు నేను మరో వ్యక్తి భార్యను అనే విషయం నాకు తెలుసు. నిన్న కాక మొన్న నా జీవితంలోకి వచ్చిన నా భర్తకన్నా దేవ్ నాకు చాలాచాలా ఇంపార్టెంట్. దేవ్ తో నా పరిచయం ఈ నాటిది కాదు. అతనితో గడిపిన ప్రతి రోజూ నాకు ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటుంది.

నువ్వంటే నాకు చాలా ప్రేమ

నువ్వంటే నాకు చాలా ప్రేమ

దేవ్ ని పెళ్లి చేసుకోలేకపోయానని నాలో నేను కుమిలిపోతూ ఉంటాను. నువ్వంటే నాకు చాలా ప్రేమ దేవ్. మనం ఎంతగా ప్రేమించినా.. ఎంతగా కోరుకున్నా.. మనం కోరుకున్న వ్యక్తులు మన పక్కన ఉన్నా కూడా దేవుడు మనకు వారితో రాసిపెట్టకుండా ఉంటే కచ్చితంగా వారితో జీవితాన్ని పంచుకోలేము అని నాకు అనిపిస్తూ ఉంటుంది. దేవ్ కు కూడా నేనంటే ప్రాణం. ఆ విషయం అతని కళ్లను చూసి చెప్పగలను.

English summary

his eyes betrayed his feelings for me

his eyes betrayed his feelings for me
Desktop Bottom Promotion