Latest Updates
-
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే..
జంటల మధ్య వయసు భేదం మరీ ఎక్కువ ఉంటే కష్టమా?
ప్రేమ గుడ్డిది అంటారు. చాలా సందర్భాల్లో ఇది నిరూపితమైంది కూడా. నిజమైన ప్రేమ ఉంటే వయసును పెద్దగా పట్టించుకోరు. అమ్మాయి 31 సంవత్సరాలు ఉండొచ్చు. అబ్బాయికి 25ఏళ్లు ఉండొచ్చు. స్త్రీ పురుషుల మధ్య 10ఏళ్ల తేడా ఉన్నా వారి మధ్య అనుబంధం బలంగా ఉంటే నడిచిపోతుంది. సంబంధంలో వయసు పాత్ర ఎలాంటిది అనే విషయంపైన 6 మందిని తమ అభిప్రాయాలను అడిగాం. వారు చెప్పిన అభిప్రాయాలివే...

పరిపక్వతతో సంబంధం లేదు...
మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. నా భర్త నా కంటే 15ఏళ్లు పెద్ద. పెళ్లికి ముందే మా జంట గురించి చాలా మంది అపహాస్యం చేశాను. ఇప్పుడు మా పెళ్లయి 20ఏళ్లవుతోంది మేము అనోన్య దాంపత్య జీవితాన్ని గడుపుతున్నాం. ఒక్కోసారి చిన్నవయసు వారు మంచి పరిపక్వతను కలిగి ఉంటారు. కొన్నిసార్లు పెద్దవారు కూడా ఎలాంటి పరిపక్వత లేకుండా ఆలోచిస్తారు.

ఎవరి ఇష్టాయిష్టాలు వారివి...
మూడేళ్లుగా నా బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తున్నాను. అతడు నా కంటే 5ఏళ్లు చిన్న. మేమిద్దరం ఒకరినొకరం గౌరవించుకుంటాం, ఎవరి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు వారికుంటాయి. అందుకే మా ఇద్దరికీ బాగా కుదిరింది. ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వయసు పెద్దగా అడ్డు రాదు.

పెళ్లి అతి పెద్ద సమస్య...
నేను నా కంటే నాలుగేళ్లు చిన్న అయిన అబ్బాయితో డేటింగ్ చేశాను. మా ఇద్దిరికీ ప్రతి విషయంలోనూ అభిప్రాయభేదాలు వచ్చేవి. అదే మా బ్రేకప్‌కు కారణమైంది. చిన్న విషయాల్లోనూ గొడవపడేవాళ్లం. పెళ్లి మా ఇద్దరిదీ అతి పెద్ద సమస్య. నేనేమో అప్పటికే 30 ఏళ్లకు దగ్గరకొచ్చేశాను. నా ప్రియుడేమో ఇంకా చిన్న వయసు, పెళ్లి గురించిన ఆలోచనే లేదు.

పిల్లల విషయానికొచ్చేసరికి...
వయసు బేధాల వల్ల సంబంధంలో సమస్యలు ఎదురవ్వవచ్చు. నా భర్త 40వ పడిలో ఉన్నాడు. నాకిప్పుడే 30 నిండాయి. అతడికేమో పిల్లలు వద్దని.. నాకేమో పిల్లలు కావాలని.. ఇలా మా సంసార సాగరం సాగిపోతుంది.

ఇద్దరం ఒకేదానిపై నిలవలేకపోయాం..
నా గర్ల్ ఫ్రెండ్ నా కంటే 6ఏళ్లు చిన్న. ఇద్దరి భావోద్వేగాలు కలిసేవి కాదు. ఇరువైపులా స్నేహితులతోనూ కలిసినా అంతగా హాయిగా ఉండేవాళ్లం కాదు. తను ప్రతి విషయానికి గందరగోళపడేది. నాదేమో స్థిరమైన మనస్తత్వం.

మంచి వ్యక్తిగా మారేందుకు...
నా భర్త నా కంటే కేవలం మూడేళ్లు పెద్ద. ఇది మా అనుబంధానికి బలంగా మారింది. అతడు నా కంటే బాగా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాడు. అతడి ఆలోచనలకు అబ్బురం చెందుతాను. మంచి వ్యక్తిగా మారేందుకు అతడి తోడ్పాటు బాగా ఉంది. అతడి మెచ్యూరిటీ కారణంగానే నేను అతడికి పడిపోయాను.



Click it and Unblock the Notifications