రోజంతా సెక్స్ చేస్తూ ఉండొచ్చా? అసలు రోజుకు ఎన్నిసార్లు సెక్స్ చెయ్యాలి?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు పెళ్లి అయి ఆరునెలలు అవుతోంది. మా ఆవిడ నాతో సెక్స్ లో పాల్గొనేందుకు బాగా సహకరిస్తుంది. నేనంటే నా భార్యకు చాలా ఇష్టం. నేను ఎన్నిసార్లు నా భార్యతో సెక్స్ లో పాల్గొన్నా ఆమె నన్ను ఏమీ అనదు.

ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొంటే

ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొంటే

కానీ ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనడం మంచిది కాదని కొందరు ఫ్రెండ్స్ చెప్పారు. అలా ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొంటే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుందట. నా భార్య కూడా నువ్వు ఎక్కువగా సెక్స్ లో పాల్గొంటే చాలా ఇబ్బందులపడాల్సి వస్తుందని చెప్పింది.

ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొనవచ్చు?

ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొనవచ్చు?

ఏ వయస్సులో ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొనవచ్చు? అలాగే పెళ్లి అయిన కొత్తలో ఎక్కువసార్లు సెక్స్ లో పాల్గొనేవాళ్లు రానురాను సెక్స్ లో పాల్గొనలేరట కదా? అసలు సెక్స్ గురించి అవగాహన అవసరమా? జీవితాంతం రోజుకు మూడు సార్లు సెక్స్ చేసే ఓపిక ఉంటుందా? సెక్స్ లో బాగా ఎంజాయ్ చేయాలంటే ఏం చెయ్యాలి? రోజంతా సెక్స్ చేస్తూ ఉండొచ్చా? వీటన్నింటి గురించి కాస్త వివరించండి.

శృంగారం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే

శృంగారం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే

సమాధానం : శృంగారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే అని గుర్తుపెట్టుకోండి. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి సిగ్గుపడకూడదు. భయం అస్సలే ఉండకూడదు. కోరికలు అనేవి మగ, ఆడ ఇద్దరిలో సమానమే.

మితిమీరకుండా పాల్గొంటే

మితిమీరకుండా పాల్గొంటే

అటువంటి కోరికలు ఇద్దరిలో ఒకేసారి కలిగినప్పుడు ఆపడం చాలా కష్టం. దాంపత్య జీవితంలో అయినా, రిలేషన్ షిప్ లో ఉన్నా సరే శృంగారంలో మితిమీరకుండా పాల్గొంటే కొన్ని పరిణామాలు ఎదుర్కోకతప్పదు.

ఎక్కువసార్లు సెక్స్ లో పాల్గొంటే

ఎక్కువసార్లు సెక్స్ లో పాల్గొంటే

కొత్తగా పెళ్లి అయిన చాలామంది దంపతులకు సెక్స్‌లో రోజుకు ఎన్నిసార్లు పాల్గొనాలనే సందేహం వస్తూ ఉంటుంది. ఎక్కువసార్లు సెక్స్ లో పాల్గొంటే భర్త ఆరోగ్యం దెబ్బతింటుందని, బాగా నీరసించి పోతాడని కొందరు భార్యలు కూడా భావిస్తుంటారు.

రోజుకు ఇన్నిసార్లే

రోజుకు ఇన్నిసార్లే

రోజుకు ఇన్నిసార్లే సెక్స్ లో పాల్గొనాలనే రూల్ ఏమీ లేదు. ఇన్నిసార్లు సెక్స్ లో పాల్గొంటే ఆరోగ్యకరం, అంతకంటే ఎక్కువసార్లు సెక్స్ లో పాల్గొంటే అనారోగ్యమని చెప్పలేం.

వీలును బట్టి

వీలును బట్టి

భార్యాభర్తలిద్దరూ ఇష్టానుసారంగా, వారి వీలును బట్టి రోజుకు ఎన్నిసార్లు అయినా సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఎంత ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటే భార్యాభర్తల మధ్య అంత ఎక్కువ ఆకర్షణ, ప్రేమ, కోర్కెలు మరింత బలంగా పెరుగుతాయి.

అవగాహన ఉండాలి

అవగాహన ఉండాలి

అయితే వయస్సును బట్టీ రోజుకు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలనే విషయాలపై కూడా అవగాహన ఉండాలి. టీనేజ్ దాటిన తర్వాత అంటే 25 ఏళ్ళ తర్వాత మగ, ఆడ ఇద్దరిలో శృంగార కోరికలు బలంగా ఉంటాయి.

మూడు నాలుగు సార్లు

మూడు నాలుగు సార్లు

ఈ వయస్సులో మిగతా విషయాల కంటే ఎక్కువగా శృంగారం గురించి ఆలోచిస్తుంటారు. కాబట్టి రోజుకు మూడు నాలుగు సార్లు సెక్స్ లో పాల్గొనవచ్చు. ఇక అందరూ శృంగారంలో పాల్గొనాలి అని కోరుకోవడం సాధారణమే.

నెలకు పదిసార్లు

నెలకు పదిసార్లు

కానీ ఈ వయస్సు పై బడ్డవారు శృంగారంలో సంవత్సరానికి 120 సార్లు అంటే నెలకు పదిసార్లు పాల్గొనవచ్చు. ఈ విధంగా చేయడం వలన గుండె సంబంధిత సమస్యలు ఉండవని వైద్యులే సూచిస్తున్నారు కూడా.

సంవత్సరానికి ఓ 80 సార్లు

సంవత్సరానికి ఓ 80 సార్లు

30 నుంచి 40 ఏళ్ళ వయసులో దాంపత్య జీవితం, పిల్లలు, కుటుంబంతో చాలా మంది బిజీబిజీగా ఉంటారు. అలాగే కుటుంబాన్ని బాగా చూసుకోవాలన్న ఆలోచనలు, ఒత్తిడి కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఏజ్ లో సంవత్సరానికి ఓ 80 సార్లు సెక్స్ లో పాల్గొనవచ్చు.

వారంలో 3 లేదా 4 సార్లు

వారంలో 3 లేదా 4 సార్లు

ఇక 40 ఏళ్ళ తర్వాత కూడా కొందరిలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఈ వయస్సులో ఎటువంటి టెన్షన్స్, ఏ ధ్యాస ఉండకపోవడం కొందరిలో శృంగార కోరికలు కలుగుతుంటాయి. 40 ఏళ్ళ తర్వాత అయినా వయసులో ఉన్న వారైనా సరే వారంలో మూడు లేదా నాలుగు సార్లు శృంగారంలో పాల్గొనడం వలన ఎటువంటి ప్రమాదం ఉండదు.

ఉత్తేజంగా ప్రవర్తిస్తారు

ఉత్తేజంగా ప్రవర్తిస్తారు

సెక్స్ లో పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటారు. బాగా ఉత్తేజంగా ప్రవర్తిస్తారు. శృంగారంలో పాల్గొనడం వలన రక్తంలో ఉండే కొన్ని ప్రమాదకర రసాయనాలు తగ్గించవచ్చు. అలాగే రక్త సరఫరా మెరుగుపడి రక్త నాళాలు దృఢంగా ఉంటాయి. అలాగే సుఖవ్యాధులు, శరీరానికి అంటుకున్న ఇన్ఫెక్షన్స్, ఒత్తిడిని దూరం చేయగల శక్తి శృంగారానికి ఉంటుంది.

అనుమానంతో సెక్స్ లో ఫెయిల్

అనుమానంతో సెక్స్ లో ఫెయిల్

ఇక పెళ్లైన మొద‌ట్లో రోజుకు మూడు సార్లు, నాలుగు సార్లు చేసేవారు.. కొన్ని రోజుల తర్వాత వారానికో లేదంటే ప‌దిహేను రోజుల‌కో ఒక సారి సెక్స్ చేస్తుంటారు. దాంతో తమకు లైంగిక సామ‌ర్థ్యం తగ్గిందేమోన‌ని దిగులు ప‌డుతుంటారు. ఈ అనుమానంతో సెక్స్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు.

రంజుగా పాల్గొనండి

రంజుగా పాల్గొనండి

సగటున వారానికి ఒకసారి శృంగార‌ంలో పాల్గొన్నా వారికి ఏమాత్రం సెక్స్ సామ‌ర్థ్యం త‌గ్గ‌దు. అందువ‌ల‌న మీరు వారంలో ఇంకా ఎన్ని ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొంటే అంత ఎక్కువ‌గా మీరు అందులో మీరు యాక్టివ్‌గా వున్నట్టే. శృంగారంలో శ‌రీరం ఉద్వేగానికి లోనుచేస్తూ మ‌రింత రంజుగా ఒక‌రి ఒక‌రు మాట‌ల‌తో రెచ్చగొడుతూ సెక్స్ ను చేసుకుంటే మీరు శృంగారంలో మ‌రింత యాక్టివ్‌గా పాల్గొన‌డానికి ఆస్కారం ఉంటుంది.

సెక్స్ తో సంతోషం

సెక్స్ తో సంతోషం

ప్రేమ, అన్యోన్యతలతో పాటు శృంగారం కూడా ఉంటేనేదాంపత్య జీవితం సజావుగా సాగుతోంది. భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య సెక్స్ అనేది వారిలో ఎంతో సంతోషాన్ని నింపుతుంది. అయితే రోజులో ఇన్నిసార్లే శృంగారంలో పాల్గొనాలని కచ్చితంగా నిర్ణయించలేము.

ఆరోగ్య పరమైన సమస్యలు

ఆరోగ్య పరమైన సమస్యలు

ఇక 20 నుంచి 23 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడవారు రోజులో మూడు లేదా నాలుగు సార్లు కంటే ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొంటే ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చే అవకాశం లేదని పలు పరిశోధనల్లోనూ వెల్ల‌డైంది.

అతిశృంగారం వల్ల

అతిశృంగారం వల్ల

అయితే ఒకే రోజులో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల నొప్పి రావడం, ఇనఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. అతిశృంగారం వల్ల కొందరు అనారోగ్యాల బారిన కూడా పడుతుంటారు. అయితే ఇది చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది.

తొందరగా బయటపడరు

తొందరగా బయటపడరు

మహిళలతో పోలిస్తే పురుషుల్లో శృంగార వాంఛలు ఎక్కువ. మగాళ్లే ఈ విషయంలో ముందుగా చొరవ తీసుకుంటారని భావిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆడవాళ్లకు కూడా ఆ విషయం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ వారు అంత తొందరగా బయటపడరు. దీనికి చాలా కారణాలున్నాయట. మగువలు శృంగారం కంటే ఉద్వేగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

ఫోర్ ప్లేకు ఎక్కువ ప్రాధాన్యం

ఫోర్ ప్లేకు ఎక్కువ ప్రాధాన్యం

వారితో శృంగారాన్ని ఆస్వాదించాలంటే ఆప్యాయంగా మాట్లాడటం తప్పనిసరి. ఫోర్ ప్లేకు మగువలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పురుషులు ఇదేం పట్టించుకోకపోతే ఆడవారు మూడ్లోకి రావడం కష్టమవుతుంది. దీంతో వారు అన్యమనస్కంగానే భాగస్వామికి సహకరిస్తారు. వారు సంతృప్తి చెందరు కాబట్టి.. లైంగిక ప్రక్రియ పట్ల అంతగా ఆసక్తి చూపరు.

కొలమానం ఏమీ లేదు

కొలమానం ఏమీ లేదు

ఇక మీకు శృంగారంలో ప‌టుత్వం ఉందో లేదో అన‌డానికి మొద‌ట‌గా మీరు మీలో ఉన్న భ‌యాన్ని తొల‌గించుకుని మార్పునకు గ‌ల కారాణాలను కొత్త విధానాల‌ను వెత‌కండి ప‌రిష్కారం ల‌భిస్తుంది. అసలు ఎన్నిసార్లు చేస్తే లైంగికంగా పటుత్వం వున్నట్టు అనే దానికి ఒక కొలమానం ఏమీ లేదు. లైంగిక పటుత్వం ఉంటే రోజుకు ఎన్ని సార్లు సెక్స్ చేసినా ఏమీ కాదు.

ఎక్కువ సార్లు సెక్స్‌ గురించే ఆలోచిస్తాడట

ఎక్కువ సార్లు సెక్స్‌ గురించే ఆలోచిస్తాడట

ఆరోగ్య వంతుడైన ఒక మనిషి ఒక రోజులో చాలా ఎక్కువ సార్లు సెక్స్‌ గురించే ఆలోచిస్తాడట. కానీ మనదేశంలో చాలా మంది పురుషులు సెక్స్‌ జీవితాన్ని సంపూర్ణంగా ఎంజాయ్‌ చేయకుండా అసంతృప్తులతో బతికేస్తున్నారు. ఈ అసంతృప్తులే పెరిగిపెద్దవై, మహావృక్షాలుగా మారి అక్రమ సంబంధాలకు దారితీస్తున్నాయి కూడా.

ఎంజాయ్‌ చేయాలంటే ఏం చెయ్యాలి

ఎంజాయ్‌ చేయాలంటే ఏం చెయ్యాలి

సెక్స్‌ జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలంటే ఏం చెయ్యాలని చాలా మంది సతమతం అవుతూ ఉంటారు. సమస్యను నిపుణులతోనో లేదంటే సన్నిహితులైనవారితో చర్చిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లేకుంటే తెలిసీ తెలియని విధానాలతో సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు.

బ్రహ్మాండంగా ఎంజాయ్‌ చేయవచ్చు

బ్రహ్మాండంగా ఎంజాయ్‌ చేయవచ్చు

నియమబద్ధ జీవితానికి కట్టు బడి సరైన అవగాహన పెంపొందించుకుంటే సెక్స్‌ను బ్రహ్మాండంగా ఎంజాయ్‌ చేయవచ్చు. సెక్స్‌ విషయంలో మానసిక పరమైన ముందస్తు ఊహలు, ఫీలింగ్స్‌ డామినేట్‌ చేయడం వల్ల స్త్రీ పురుషులు, ముఖ్యంగా మగవారు స్త్రీ సంతృప్తిపరచలేననే భావంతో సంపూర్ణంగా సెక్స్‌ జీవితాన్ని ఎంజాయ్‌ చేయకుండా ఏదో ఆ క్షణానికి అయ్యిందనిపించి కోరిక తీర్చుకుని తప్పించుకు తిరగడం వల్లనే ఎన్నో కుటుంబాల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

అద్భుతంగా ఎంజాయ్‌ చేయొచ్చు

అద్భుతంగా ఎంజాయ్‌ చేయొచ్చు

ఎంతోమంది స్త్రీలు ఆత్మన్యూనతతో భర్తలకు చేరువకాలేక పోతున్నారు. నియమబద్ధమైన జీవితానికి అవగాహన తోడైతే భాగస్వామితో కొత్త కొత్త భంగిమలు ట్రై చేస్తూ అద్భుతంగా ఎంజాయ్‌ చేస్తూ సెక్స్‌ అసంతృప్తుల్ని తరిమికొట్టవచ్చు.

స్టామినా బట్టీ

స్టామినా బట్టీ

ఇక ఒక్కో పురుషుడు అతని స్టామినా బట్టీ రోజుక వీలైనన్నీ సార్లు సెక్స్ లో పాల్గొంటారు. కచ్చితంగా ఇన్నిసార్లే సెక్స్ లో పాల్గొంటారని మాత్రం అని చెప్పలేము. కొందరు రోజుకు ఒక్కసారే సెక్సు చేయొచ్చు. ఇంకొందరు గ్యాప్ తీసుకొని చాలా సార్లు సెక్స్ చేస్తారు. ఎవరి స్టామినా బట్టీ వారు సెక్స్ లో దమ్ము చూపిస్తారు.

క్రమంగా ఆ కోరికలు తగ్గుతాయి

క్రమంగా ఆ కోరికలు తగ్గుతాయి

మీరు సెక్స్ లో వెంటనే వెంటనే పాల్గొనకుండా.. కనీసం రెండు గంటల పాటు గ్యాప్ ఇచ్చి సెక్స్ లో పాల్గొనండి. పెళ్లయిన కొత్తలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల వారు ఎక్కువసార్లు సెక్స్ చేసుకుంటారు. క్రమంగా ఆ కోరికలు తగ్గుతాయి. మీకు కొత్తగా పెళ్లయింది మీరు ఎక్కువ సెక్స్ లో పాల్గొంటున్నారు.

పరస్పరం ముద్దుపెట్టుకోవడం

పరస్పరం ముద్దుపెట్టుకోవడం

రోజంతా సెక్స్ చేస్తూ ఉండాలని బలంగా అనుకుంటే చేయొచ్చు. అయిలే కేవలం సెక్స్ మాత్రమే చేయడంకాకుండా మిగతావి కూడా చేయాలి. పరస్పరం ముద్దుపెట్టుకోవడం, ఓరల్ సెక్స్ చేసుకోవడం, ఫోర్ ప్లే చేసుకోవడం కూడా చేసుకోవాలి. యోని చూషణ, అంగ చూషణ వంటివి చేసుకోవడం వల్ల కూడా సెక్స్ లో పొందే ఆనందాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య కరమైన సెక్స్ ను ఎన్నిసార్లు చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులుండవు.

English summary

how many times sex in a day is healthy

how many times sex in a day is healthy
Story first published: Thursday, April 12, 2018, 15:44 [IST]