For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార్యా భర్తలు పగటిపూట శృంగారం చేసుకోకూడదు, నెలసరి సమయంలోనూ వద్దు, గర్భిణీ జోలికెళ్తే నాశనమే

మగవాళ్లు తమను నమ్మి వివాహ బంధంతో వచ్చిన ఆడవాళ్లకు కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఇవ్వాలి. భార్యా భర్తలు పగటిపూట శృంగారం చేసుకోకూడదు, నెలసరి సమయంలోనూ వద్దు, గర్భిణీ జోలికెళ్తే.

|

భార్యాభర్తలంతా వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపాలని పరితపిపస్తుంటారు. భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. స్త్రీ పురుషులు పెళ్లి అనే బంధంతో దంపతులై ఒక ఇంట్లో సంసార జీవితం సాగిస్తూ అన్ని ధర్మాలను పాటిస్తారు. మగవాడు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య విషయంలో కొన్ని బాధ్యతలను పాటించాలి. అలాగే భార్య కూడా భర్త విషయంలో కొన్ని బాధ్యతలను పాటించాలి.

సంసారం అనే మహా సముద్రాన్ని ఈదడం ఎంతో కష్టం అని మన పెద్దలు అంటూ ఉంటారు. అసలు పెళ్లి అయిన తర్వాత స్త్రీ, పురుషులు ఎలా ఉండాలి? ఎలా ఉంటే వారి ఇంట్లో అన్నీ సవ్యంగా ఉండి కలిసివస్తుందో వైదిక పండితులు ఇలా చెబుతున్నారు.

నెలసరి సమయంలో దూరంగా ఉండాలి

నెలసరి సమయంలో దూరంగా ఉండాలి

మగవాళ్లు తమను నమ్మి వివాహ బంధంతో వచ్చిన ఆడవాళ్లకు కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఇవ్వాలి. అంతేకాదు.. స్త్రీ నెలసరి సమయంలో పురుషుడు ఆమెకు దూరంగా ఉండాలి. ఆ సమయంలో భార్యతో కలవకుండా ఉంటే అన్ని రకాలుగా మేలట. నెలసరి సమయంలో భార్యతో కలవకుండా ఉంటే ఆరోగ్యపరంగా కూడా మేలని శాస్త్రాలు చెబుతున్నాయి.

మగ పిల్లలు పుడతారట

మగ పిల్లలు పుడతారట

అంతేకాదు నెలసరి తర్వాత నుంచి సరి సంఖ్యల రోజుల్లో కలిస్తే మగ పిల్లలు పుడతారని, అదే బేసి సంఖ్య రోజుల్లో కలిస్తే ఆడపిల్లలు పుడతారని ధర్మ శాస్త్రాలు ఘోషిస్తున్నాయట. మరో ముఖ్య విషయం ఏమిటంటే పగటి వేళ, సంధ్యా సమయంలో భార్యా భర్తలు శృంగారంలో పాల్గొనకూడదు.

పరాయి స్త్రీపై వాంఛ

పరాయి స్త్రీపై వాంఛ

అలా చేయడం కోసం తాను చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేసినందుకు తగిన శాస్తి జరుగుతుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. పరాయి స్త్రీపై కామ వాంఛలనే శాస్త్రం పెద్ద అపరాధంగా చెబుతోంది.

గర్భంతో ఉన్న ఆడవాళ్ల జోలికి వెళ్తే

గర్భంతో ఉన్న ఆడవాళ్ల జోలికి వెళ్తే

ఇక తనకంటే పెద్దదైన మహిళ, అదీ గర్భంతో ఉన్న ఆడవాళ్ల జోలికి వెళ్తే నాశనం అయిపోతారని శాస్త్రాలు చెబుతున్నాయి. బాగా లావుగా, బాగా సన్నగా, అవయవ లోపం ఉన్న ఆడవాళ్లతోనూ శారీరక కలయిక మంచిది కాదట.గురు ప్రదేశం, దేవ ప్రదేశం, యజ్ఞ యాగాదులు జరుగుతున్న ప్రాంతాల్లో స్త్రీకి దూరంగా ఉండాలి.

కుడి పాదం పెట్టి మంచం ఎక్కాలట

కుడి పాదం పెట్టి మంచం ఎక్కాలట

స్త్రీ పురుషుల కలయిక ప్రకృతి సిద్ధంగా ఉండాలి కాని తారుమారుగా ఉంటే తారుమారు సంతానమే కలుగుతారట. ఇక పడక గదిలో మగవాళ్లు కుడి పాదం పెట్టి మంచం ఎక్కాలని, అలాగే ఆడవాళ్లేమో ఎడమ పాదం పెట్టి ఎక్కాలని సూచన. ఇలా సంసారాన్ని నియమ నిబంధనలతో, నీతిగా, మధురంగా సాగించిన వారి జీవితం సంతోషమయంగా ఉంటుందని ధర్మ ప్రబోధం.

భార్య నమ్మకాన్ని కోల్పోతే

భార్య నమ్మకాన్ని కోల్పోతే

ఇక ఇవన్నీ శాస్త్రబద్ధమైనవి అయితే శాస్త్రాలకు సంబంధం లేకుండా పాటించాల్సిన మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. సాధారణంగా కొత్తగా పెళ్లైన ప్రతి జంట మొదట కొన్నాళ్లు అన్యోన్యంగా కలిసి మెలసి ఉంటుంది. తర్వాత ఇద్దరి మధ్య చిన్నగా అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఏ విషయంలోనైనా మీరు మీ భార్య నమ్మకాన్ని కోల్పోతే మీ దాంపత్యంలో దూరం పెరుగుతూ పోతుంది. ఆమె ఎందుకలా అనుకుంటుందో భర్త తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

భర్తే మంచి స్నేహితుడైతే

భర్తే మంచి స్నేహితుడైతే

భార్యకు ప్రేమను పంచి, ఆమె కోసం సమయం కేటాయించి ఆమెకు దగ్గరవ్వాలి. ఆమె ఆలోచనలను సరైన దిశలో ఉండేలా ప్రయత్నించాలి. నమ్మకంగా ఉండాలి. భార్య మీపై అనుమాన పడకుండా, నమ్మకం కలిగించేలా ప్రయత్నించాలి. ఓ మంచి భార్యకు మంచి భర్త తోడైనప్పుడు వారి దాంపత్యంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. ఎందుకంటే భర్తే మంచి స్నేహితుడైతే ఇక కష్టాలేముంటాయి. మీ ఇద్దరి మధ్య కుటుంబసమస్యలైనా కెరీర్ కు సంబంధించిన సమస్యలైనా ఇద్దరూ కలిసే పరిష్కరించుకోవాలి. పరస్పర నిర్ణయాల్ని, సలహాలను గౌరవించి స్వీకరించుకుంటుండాలి.

భార్య ప్రెగ్నెంట్ అయితే

భార్య ప్రెగ్నెంట్ అయితే

చాలా మంది భర్తలు ఆలోచలన పరంగా భార్యలతో ఎలాంటి భావాలను పంచుకోకుండా కేవలం భర్తగానే జీవిస్తారు. కొంతమంది భర్తలకైతే తమ భార్యల ఆరోగ్యం, దాని సంబంధిత విషయాలపైనా ఎలాంటి విషయం తెలియదు. భార్య ప్రెగ్నెంట్ అయ్యాక భర్త తన ప్రపంచంలో తాను మునిగిపోతాడు. జాగ్రత్తగా ఉండమని ఆదేశం ఇచ్చేసి ఇక తన బాధ్యత తీరిపోయిందనుకుంటాడు. మిగతా వాటి గురించి పట్టించుకోడు.

దీనిని మహిళలు అంగీకరించరు.

అనుమానించకండి

అనుమానించకండి

అలాగే భర్తలు ముఖ్యంగా గుర్తుంచుకోవలసినది ఇంటి పనులలో అంటే వంటవార్పులలో, గృహాలంకరణలో భార్యకు సహకరించడం. పనిమనిషి రానిరోజు అవసరమైతే పాత్రలను శుభ్రం చేసేందుకు సైతం వెనుకాడకండి. పురుషులైన ఆమె తోటి ఉద్యోగస్థుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను అనుమానించకండి. ఆమె వ్యక్తిత్వాన్ని శంకించక, ఆఫీసులో జరిగే పార్టీలకు, పిక్నిక్ లకు ఆమెను ఒంటరిగా వెళ్ళనివ్వండి.

శ్రీవారి సమక్షంలో ప్రస్తావిస్తే

శ్రీవారి సమక్షంలో ప్రస్తావిస్తే

ఇక భార్య కూడా కొన్ని సూత్రాలు పాటించాలి. తాను సర్వస్వతంత్రురాలని అన్న రీతిలో భర్త ఎదుట ప్రవర్తించవద్దు. భర్త ఎదుట మీ పురుష సహోదోగ్యులను ప్రశంసించకండి. మీ బాస్ నిజంగా గొప్పవాడైనప్పటికీ, ఆ విషయాన్ని మీ శ్రీవారి సమక్షంలో ప్రస్తావిస్తే ఆయన అసూయను పెంచుకునే ప్రమాదముంది. పిల్లల కోసం ఆదుర్దా చెందకండి. అది మీ ఉద్యోగాభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. పిల్లలను ఎప్పుడు పొందాలనే అంశంపై మీ భర్తతో సంప్రదించి ఒక నిర్ణయానికి రండి.

నిత్యయవ్వనంగా ఉంటుంది

నిత్యయవ్వనంగా ఉంటుంది

నిజమైన ప్రేమతో తనను చూసుకునే భర్తకు భార్య ఎంతో గౌరవం ఇస్తుంది. అలాగే భర్త నుంచి ప్రేమను ఆశిస్తుంది. ఆ ప్రేమే వారిద్దరినీ సన్నిహితంగా ఉంచుతుంది. తనపై భర్తకు ఉన్న ప్రేమ అతని కళ్లల్లో భాగస్వామి వెంటనే తెలుసుకుంటుంది. కాబట్టి భార్య భర్తలు ఎప్పటికప్పుడు పరస్పరం ప్రేమను వ్యక్తపరుచుకుంటే వారి దాంపత్యం ఎప్పుడూ నిత్యయవ్వనంగా ఉంటుంది. అందువల్ల ఆమె నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పొవొద్దు.

English summary

how to be a good husband and become your wifes dream man

how to be a good husband and become your wifes dream man
Desktop Bottom Promotion