సెక్స్ చేస్తుంటే పురుషాంగంపై ఉన్న పూర్వ చర్మం చిట్లిపోయింది! ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా వయసు 34 ఏళ్లు. నాకు ఇరవై మూడు ఏళ్లు ఉన్నప్పుడే పెళ్లి అయ్యింది. మొదట సెక్స్ లో చాలా బాగా పాల్గొనేవాణ్ని. నేను మొదట్లో సెక్స్ చేసేటప్పుడు స్ట్రోక్స్ ఇస్తుంటే నా భార్య తట్టుకోలేకపోయేది. అంత గట్టిగా స్ట్రోక్స్ ఇచ్చేవాణ్ని. రానురాను స్ట్రోక్స్ ఇవ్వాలంటే భయం వేసేది.

సెక్స్ చేసేటప్పుడు ఇదివరకు ఎంతో తృప్తి

సెక్స్ చేసేటప్పుడు ఇదివరకు ఎంతో తృప్తి

కాస్త గట్టిగా స్ట్రోక్స్ ఇస్తే నాకు చాలా నొప్పి వేసేది. దీంతో చాలా సున్నితంగా నా భార్యతో సెక్స్ చేసేవాణ్ని. గతంలో నా భార్యతో సెక్స్ చేసేటపుడు ఇదివరకు ఎంతో తృప్తిగా ఉండేది. ఇప్పుడది లేకపోగా చాలా భయంకరంగా మారిపోయింది. ఈ మధ్య ఒకసారి మళ్లీ రెచ్చిపోయాను. చాలా స్ట్రాంగ్ గా స్ట్రోక్స్ ఇవ్వడం మొదలుపెట్టాను.

రక్తం కూడా కారుతోంది

రక్తం కూడా కారుతోంది

ప్రస్తుతం నా పురుషాంగం పూర్వచర్మ బిగుతుగా మారుతోంది. అంగం బాగా స్తంభించినప్పుడు సెక్స్ చేస్తుంటే పూర్వచర్మం చిట్లిపోయి రక్తం కూడా కారుతోంది. దాంతో నాకు నా భార్యతో సెక్స్ చేయాలంటేనే భయమేస్తోంది.

సెక్స్ కోసం ఎదురు చూస్తుంది

సెక్స్ కోసం ఎదురు చూస్తుంది

నా భార్య రోజూ రాత్రికాగానే ఎప్పటి మాదిరిగా బెడ్ పైకి సెక్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ నేను సెక్స్ చేయలేకపోతున్నాను. నా భార్య నుంచి ఎలా తప్పుకోవాలా అని చూస్తుంటాను. ఆమెతో సెక్స్ లో పాల్గొనలేకపోవడం నాకు సిగ్గుగా అనిపిస్తూ ఉంది.

పురుషాంగం నార్మల్ గా మారుతుంది

పురుషాంగం నార్మల్ గా మారుతుంది

నా సమస్యను నా ఫ్రెండ్స్ కు చెప్పాను. కొన్ని రోజులు వెయిట్ చేస్తే మళ్లీ పురుషాంగం నార్మల్ గా మారుతుందని నా ఫ్రెండ్స్ చెప్పారు. డాక్టర్ కు చూపించాల్సిన అవసరం కూడా లేదన్నారు. మా ఫ్రెండ్స్ కు కూడా అప్పుడప్పుడు ఇలా అయ్యేదట. మళ్లీ ఇప్పుడు నార్మల్ గా మారిందట.

చర్మం వెనక్కి రాకపోవడం

చర్మం వెనక్కి రాకపోవడం

సమాధానం : సెక్స్ లో పాల్గొన్నప్పుడు పురుషాంగపు పూర్వచర్మ చిట్లడం, ఆ తర్వాత బిగుసుకుపోవడం, శిశ్నంపై నుంచి చర్మం వెనక్కి రాకపోవడం వంటి సమస్యల్ని చాలా మంది మగవారు ఎదుర్కొంటూ ఉంటారు.

వెనక్కి రావటం కష్టమవుతుంటుంది

వెనక్కి రావటం కష్టమవుతుంటుంది

కొందరికి యుక్తవయసు వచ్చిన తర్వాత కూడా పూర్వచర్మం, అది తెరుచుకునే మార్గం సన్నగా ఉంటుంది. దీంతో పెళ్లయ్యాక శృంగారంలో పాల్గొన్నప్పుడు.. చర్మం బలంగా వెనక్కి లాగినట్త్లె.. ఆ సున్నితమైన చర్మం చిరిగి, గాట్లు పడుతుంది. కొందరికి అంగం మామూలుగా ఉన్నప్పుడు చర్మం తేలికగానే వెనక్కి వస్తున్నప్పటికీ.. స్తంభించినప్పుడు అంగం పరిమాణం పెరిగి చర్మం వెనక్కి రావటం కష్టమవుతుంటుంది.

మళ్లీ చినుగుతుంటుంది

మళ్లీ చినుగుతుంటుంది

దీంతో చర్మం చిరిగినట్త్లె రక్తస్రావం అవుతుంది. క్రమేపీ ఇది మానిపోవచ్చుగానీ ఆ మానిన చోట చర్మం కొంత బిగువుగా ఉంటుంది. దీంతో ఆ తర్వాత మళ్లీ వెనక్కిలాగినప్పుడు అదే ప్రదేశంలో మళ్లీ చినుగుతుంటుంది.

వెనక్కే రాకపోవచ్చు

వెనక్కే రాకపోవచ్చు

ఇలా తరచూ చిట్లటం, మానటం జరుగుతూ.. ఇదో ఇబ్బందికర వ్యవహారంగా తయారవుతుంది. యుక్తవయసులో, ముఖ్యంగా పెళ్లి అయిన కొత్తలో, శృంగారంలో పాల్గొన్నపుడు ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది. కొందరికి అసలు పూర్వ చర్మం వెనక్కే రాకపోవచ్చు, మరికొందరికి కొంత భాగమే వెనక్కి వచ్చి, తరచూ చిరుగుతుండొచ్చు.

డాక్టర్ దగ్గరకు వెళ్లాలి

డాక్టర్ దగ్గరకు వెళ్లాలి

పురుషాంగపు పూర్వచర్మం చిట్లినపుడు చాలా బాధ కలుగుతుంది. అలాగే శిశ్నంపై ఉన్న చర్మం గట్టిగా బిగుసుకుపోయి వెనక్కి లాగినా కూడా రాదు. దీనివల్ల శిశ్నానికి రక్తప్రసారం సాఫీగా జరుగదు. శిశ్నం మొద్దుబారినట్లు మారిపోతుంది. ఇలాంటి సమస్యలు ఎదురైనపుడు వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.

ఏవేవో సలహాలు ఇస్తుంటారు

ఏవేవో సలహాలు ఇస్తుంటారు

అంగం మీద చర్మం వెనక్కి పంపేందుకు మీరుబలవంతంగా ప్రయత్నిస్తే బాగా నొప్పి పుడుతుంది. ఒక వేళ కొన్ని రోజుల వరకు సెక్స్‌లో కూడా పెద్దగా ఇబ్బందులు రాకపోవొచ్చు. మీరు శృంగారంలో కూడా కొన్ని రోజులు బాగానే ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఈ విషయాన్ని తమ స్నేహితుల వద్ద ప్రస్తావిస్తే వారు ఏవేవో సలహాలు ఇస్తుంటారు.

సున్తీ అవసరం

సున్తీ అవసరం

అంగంపై ఉండే చర్మం శృంగారంలో పాల్గొన్నపుడు ఎలాంటి ఇబ్బంది అనిపించకపోతే ఆపరేషన్‌ అవసరం లేదు. కానీ నొప్పి అనిపించడం, పూర్వ చర్మం మూత్ర రంధ్రాన్ని మూసివెయ్యడం వంటి సందర్భాల్లో మాత్రం మీరు సర్కమ్‌‌సెషన్‌ ఆపరేషన్‌ అవసరం. దీన్నే సున్తీ అంటారు.

స్నేహితుల సూచనలు వద్దు

స్నేహితుల సూచనలు వద్దు

అయితే ఈ ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా అనేది మీ అనుకూలతను, అవసరాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో స్నేహితుల సూచనలు, సలహాలు పాటించడం మంచిది కాదు.సెక్స్‌ కు సంబంధించిన విషయాల్లో నిపుణులైన వైద్యుల సలహాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.

రక్త సమస్యలేవైనా ఉంటే

రక్త సమస్యలేవైనా ఉంటే

సున్తీ అనేది చిన్నపాటి సర్జరీ ప్రక్రియేగానీ దీన్ని శాస్త్రీయ పద్ధతిలో చేయించటం మంచిది. ఈ సర్జరీకి ముందు కొన్ని రక్తపరీక్షలు, ముఖ్యంగా రక్తం గడ్డకట్టే సమయం (బ్లీడింగ్‌, క్లాటింగ్‌ టైమ్‌) వంటి పరీక్షలు చేయటం అవసరం. రక్త సమస్యలేవైనా ఉంటే సున్తీ చెయ్యకూడదు.

మధుమేహం కూడా కారణం

మధుమేహం కూడా కారణం

నడి వయసులో, అంటే 35-40 ఏళ్ల వయసులో పూర్వచర్మం ముందుకూ వెనక్కూ కదలకుండా బిగిసినట్లు అయిపోయి, వాచి ఫైమోసిస్‌ రావచ్చు. ఈ వయసులో ఇలా వచ్చిందంటే చాలా వరకూ ఒక రకంగా మధుమేహం కూడా కారణం అయి ఉంటుంది. దాన్ని గుర్తించకపోవడం వల్లే ఇలా జరగవచ్చు.

నెమ్మదిగా, కొద్దికొద్దిగా వెనక్కిలాగితే..

నెమ్మదిగా, కొద్దికొద్దిగా వెనక్కిలాగితే..

ఇక పూర్వచర్మం బిగుతుగా ఉంటే.. రోజూ దాన్ని నెమ్మదిగా, కొద్దికొద్దిగా వెనక్కిలాగేందుకు ప్రయత్నించటం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. కొందరికి వైద్యులు స్టిరాయిడ్‌ క్రీములు ఇచ్చి.. రోజూ రెండుమూడుసార్లు పూర్వచర్మం మీద రాస్తుండమని చెబుతారు. దీనివల్ల చర్మం పల్చబడి, మృదువుగా వెనక్కిలాగటం తేలికయ్యే అవకాశం ఉంటుంది.

ఒకట్రెండు రోజులు కొంత నొప్పి

ఒకట్రెండు రోజులు కొంత నొప్పి

కాకపోతే అందరి విషయంలోనూ ఈ క్రీములతో అంత ఉపయోగం ఉండకపోవచ్చు. కొందరికి సర్జరీ చేసి, పూర్వచర్మాన్ని తీసెయ్యటం (సున్తీ) చేస్తారు. నొప్పి, బాధ తెలియకుండా మత్తుమందు ఇచ్చి సున్తీ చేస్తారు. ఇది చాలా తేలికైన సురక్షితమైన పద్ధతి. కొద్ది గంటల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. ఒకట్రెండు రోజులు కొంత నొప్పి ఉండొచ్చు.

కొద్దిరోజులు అది సున్నితంగా అనిపిస్తుంటుంది

కొద్దిరోజులు అది సున్నితంగా అనిపిస్తుంటుంది

ముఖ్యంగా అప్పటి వరకూ పూర్వచర్మం కింద ఉండిపోయిన శిశ్నం ఒక్కసారిగా బయటపడినట్లయ్యే సరికి కొద్దిరోజులు అది సున్నితంగా అనిపిస్తుంటుంది. ఏది తగిలినా జివ్వుమనటం, అండర్ వేసుకోవటం కష్టం కావటం వంటి ఇబ్బందులుండొచ్చు. 5-7 రోజుల్లో దానంతట తగ్గిపోతుంది. ఈ లోపు శిశ్నం మరీ సున్నితంగా అనిపించకుండా, కాస్త మొద్దుబారినట్లయ్యేందుకు దాని పైనరాసే క్రీముల వంటివి ఇస్తారు. మీరు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

English summary

how to circumcise a grown man

how to circumcise a grown man
Story first published: Tuesday, April 17, 2018, 13:03 [IST]