Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
బాయ్ ఫ్రెండ్ ను నా ఆఫీస్ లో జాయిన్ చేసుకున్నా, అబ్బా.. ఆ నరకం భరించలేకపోయాను
ఇక ఒక రోజు నేను, నా బాయ్ ఫ్రెండ్ ఉదయమే ఆఫీస్ కు వెళ్లాం. తన సీట్ దగ్గరకు వెళ్లి నేను మాట్లాడుతూ ఉన్నాను. సడెన్ గా తను నన్ను ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. నేను చిలిపిగా తన నుంచి తప్పించుకోవడానిక
నేను ఎంసీఏ పూర్తి చేసిన తర్వాత క్యాంపస్ ప్లేస్ మెంట్ లో జాబ్ కు సెలెక్ట్ అయ్యాను. అయితే నాకు ఎంసీఏ ఫస్ట్ ఇయర్ నుంచే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనికి కూడా సేమ్ నా కంపెనీలో జాబ్ వస్తే బాగుండని నేను చాలా కోరుకున్నా. కానీ తనకి వేరే కంపెనీలో జాబ్ వచ్చింది.
ఒక ఆరు నెలల వరకు ఇద్దరం వేర్వేరు కంపెనీల్లోనే జాబ్స్ చేశాం. కానీ ఆఫీస్ లో ఉన్నంత సేపు తనే గుర్తొచ్చేవాడు. కాస్త టైమ్ దొరికితే చాలు ఫోన్ లో తనతోనే మాట్లాడుతూ ఉండేదాన్ని.

ఆఫీస్ లో జాబ్ వచ్చేలా చేశాను
ఆరునెలల తర్వాత తనకు మా ఆఫీస్ లో జాబ్ వచ్చేలా చేశాను. తను నేను పని చేసే ఆఫీస్ లోనే జాయిన్ కావడంతో నా ఆనందానికి అవధులుండేవి కావు. అయితే అందరి కళ్లు మాపైనే ఉండేవి. మమ్మల్ని చూసి అస్సలు ఓర్చుకోలేకపోయేవారు.

చిలుకాగోరింకల్లా ఉంటారు
కొందరు మాత్రం మీరిద్దరూ చిలుకాగోరింకల్లా ఉంటారు.. త్వరగా పెళ్లి చేసుకోండి అని చెప్పేవారు. రోజూ లంచ్ మేమిద్దరం కలిసే చేసేవాళ్లం. ఇద్దరం ఆఫీస్ కు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వెళ్లేవాళ్లం. తనే నన్ను బైక్ పై ఎక్కించుకుని వచ్చేవాడు.

సుపీరియర్ కు నచ్చలేదు
అయితే నేను అతనితో అంత చనువుగా ఉండడం మా సుపీరియర్ కు నచ్చలేదు. అతను రోజూ నన్ను క్యాబిన్ కు పిలుచుకుని గంటల తరబడి టార్చర్ చేసేవాడు. నేను నా బాయ్ ఫ్రెండ్ తో తిరగడం ఇష్టంలేదని డైరెక్ట్ గా చెప్పకుండా వర్క్ ప్రెజర్ తో ఇబ్బందిపెట్టేవాడు.

నన్ను ఇష్టపడేవాడు
అందరికంటే ఎక్కువగా నాకే ఎక్కువగా వర్క్ అప్పగించేవాడు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసీ కూడా తను నన్ను ఇష్టపడేవాడు. నాకు ఏవేవో మెసేజ్ లు పంపేవాడు. తనకు నాపై క్రష్ ఉందని అర్థమైంది.

నేను మోసం చేయలేను
కానీ నేను అలాంటి దాన్ని కాదు. నా జాబ్ కోసం నా బాయ్ ఫ్రెండ్ ను మోసం చేయలేను. తనపై ఎంతో ప్రేమ ఉండబట్టే తనని కూడా నా కంపెనీలోకి తీసుకొచ్చుకున్నాను.

తట్టుకోలేకపోయేవాడు
కానీ మా సుపీరియర్ ఇవేమీ అర్థం చేసుకునేవాడు కాదు. నేను ఆ ట్రయాంగిల్ లవ్ లో చాలా ఇబ్బందిపడేదాన్ని. నా బాయ్ ఫ్రెండ్ తో నవ్వుతూ మాట్లాడితే మా బాస్ అస్సలు తట్టుకోలేకపోయేవాడు. ఇన్ డైరెక్ట్ గా తిట్టేవాడు.

అనవసరంగా జాయిన్ చేయించుకున్నా
అప్పుడనిపించేది.. చీ అనవసరంగా నా బాయ్ ఫ్రెండ్ ని ఈ కంపెనీలో జాయిన్ చేయించుకున్నాననిపించింది. తనకు అంతకుముందు ఇక్కడ ఇచ్చే సాలరీ కంటే ఎక్కువే ఇచ్చేవారు. కానీ కేవలం తనని నిత్యం చూసుకుంటూ ఉండాలనే కోరికతో నేను పని చేసే కంపెనీకి రప్పించుకున్నాను.

ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు
ఇక ఒక రోజు నేను, నా బాయ్ ఫ్రెండ్ ఉదయమే ఆఫీస్ కు వెళ్లాం. తన సీట్ దగ్గరకు వెళ్లి నేను మాట్లాడుతూ ఉన్నాను. సడెన్ గా తను నన్ను ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. నేను చిలిపిగా తన నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాను.

నోటికొచ్చినట్లు తిట్టాడు
అంతలోనే మా సుపీరియర్ వచ్చాడు. అంతే.. దాదాపు ఆ రోజంతా క్లాస్ పీకాడు. ఇది ఆఫీస్ అనుకుంటున్నారా.. ఇంకేమనుకుంటున్నారని నోటికొచ్చినట్లు తిట్టాడు. వాస్తవానికి మాకంటే ఎక్కువ చేసేవాళ్లు ఆఫీస్ లో చాలామందే ఉన్నారు. కానీ వాళ్లంతా అతనికి అనుకూలంగా ఉండడంతో ఒక్కమాట కూడా అనడు.

మనస్సులో ఏదో పెట్టుకుని
అందరికంటే ఎక్కువగా ఆఫీస్ లో పని చేసేది మేమిద్దరం. అందరికంటే తక్కువ సాలరీలు తీసుకుంటున్నది మేమే. కానీ మా సుపీరియర్ మాత్రం మనస్సులో ఏదో పెట్టుకుని మమ్మల్ని టార్చర్ చేసేవాడు. చివరకు మేమిద్దరం ఆ కంపెనీకీ రిజైన్ చేశాం.

నాలాగే కోరుకుంటూ ఉంటారు
తర్వాత అంతకంటే ఎక్కువ సాలరీలతో మరో వేర్వేరు కంపెనీల్లో జాయిన్ అయ్యాం. చాలా మంది అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ కూడా తాము పని చేసే పని చేయాలని నాలాగే కోరుకుంటూ ఉంటారు. కానీ అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండండి.

బాయ్ ఫ్రెండ్ ను చాలా ఇబ్బందులకు గురి చేశా
ఆఫీస్ రాజకీయాల్లోకి మీ పర్సనల్ జీవితాన్ని తీసుకురాకండి. తీసుకొస్తే నాలాగే మీరు ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అన్నిచోట్ల అలాగే ఉంటుందని నేను చెప్పలేను కానీ నూటికి తొంభైతొమ్మిదిశాతం అలాంటి సోంబేరీలే సుపీరియర్స్ గా ఉంటారని గుర్తుంచుకోండి. నాకు ఇవన్నీ అర్థంకాక నా బాయ్ ఫ్రెండ్ ను చాలా ఇబ్బందులకు గురి చేశాను.



Click it and Unblock the Notifications