Latest Updates
-
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? -
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! -
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే!
తనీష్ ఆమెతో రాసుకుని పూసుకుని తిరగడం చూసి నాకు మండింది,ఆ విషయంలో మళ్లీ ఇద్దరం ఒక్కటయ్యాం #mystory191
మా ఇద్దరిదీ చూడముచ్చటైన జంట అని కాలేజీ మొత్తం అనేవారు. కాలేజీలో అంతా మేమే కనిపించేవాళ్లం. మొదట మేమిద్దరం కాస్త గొడవపడ్డాం. తర్వాత ఇద్దరం కలిసిపోయాం. ఆ తర్వాత మా ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టం పెరిగింది
మా ఇద్దరిదీ చూడముచ్చటైన జంట అని కాలేజీ మొత్తం అనేవారు. కాలేజీలో అంతా మేమే కనిపించేవాళ్లం. మొదట మేమిద్దరం కాస్త గొడవపడ్డాం. తర్వాత ఇద్దరం కలిసిపోయాం.
ఆ తర్వాత మా ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టం పెరిగింది.
అతని పేరు తనీష్. తనకు నేను బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువే. అమ్మాయిల్లో ఏ ఒక్కరితోనూ అంతగా మాట్లాడని తనీష్ నాతో మాత్రం ఇరవై నాలుగు గంటలు కబుర్లు చెబుతుంటాడు.

ఫైనల్ ఎగ్జామ్స్
ఇక మా ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమా అని అంటే ఏమో నాకే తెలియదు. మేమిద్దరం ఎప్పుడూ ఆ త్రీ మ్యాజిక్ లెటర్స్ చెప్పుకోలేదు కూడా. కాలేజీలో ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరపడ్డాయి. ఆ సమయంలో నాకు తనీశ్ కు మధ్య గొడవ జరిగింది.

తనీష్ ఆమెతో రాసుకుంటూ తిరగడం చూసి
అది నేను మీకు చెబితే చాలా సిల్లీగానే అనిపించొచ్చు. మరీ అంత సిల్లీ అయితే కాదు. గొడవలో మా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఒక రోజు తనీష్ తో మరో అమ్మాయి ఉండడం నేను కళ్లారా చూశాను. కాలేజీలో ఎవరితోనూ మాట్లాడని తనీష్ ఆమెతో రాసుకుంటూ తిరగడం చూసి నాకు ఒళ్లు మండింది.

నా గర్ల్ ఫ్రెండే
దాంతో నేను తనీష్ తో గొడవపడ్డాను. నేను తనను ప్రశ్నించాననే కారణంతో.. అతను "అవును ఆ అమ్మాయి కూడా నా గర్ల్ ఫ్రెండే... ఇప్పుడేంటి" అని పొగరుగా మాట్లాడాడు. నాకు మండిది. వాస్తవానికి తను తనీష్ కు జూనియర్. ఇద్దరూ ఎన్సీసీలో పరిచయమని, వారిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని నాకు తర్వాత తెలిసింది.

మళ్లీ కాలేజీ మొదలైంది
మొత్తానికి మేము ఇద్దరం మాట్లాడుకోవద్దని ఒక నిర్ణయానికి వచ్చేశాం. విడిపోయాం. తనీష్, నేను ఫ్రెండ్స్ గా కూడా ఉండకూడదనుకున్నాం. మా పరీక్షలైపోయాయి. సెలవులు కూడా అయిపోయాయి. మళ్లీ కాలేజీ మొదలైంది. తర్వాత కాలేజీలో ఎవరికి వారే అన్నట్టుగానే ఉండేవాళ్లం.

తనీష్ తో మాట్లాడాల్సి వచ్చింది
కానీ తనీష్ తో నేను ఒక విషయంలో మాట్లాడాల్సి వచ్చింది. నా ఫ్రెండ్ రజిత తనీష్ ఫ్రెండ్ ఉదయ్ లవ్ చేసుకునేవారు. వారిద్దరి ప్రేమ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను తప్పని పరిస్థితుల్లో తనీష్ తో మాట్లాడాల్సి వచ్చింది. వాళ్లిద్దరూ కలవాలంటే మేము కలవాలి అందుకే నేనే తనీష్ త్ తో మాటలు కలపాలనుకున్నాను.

సీరియస్ గా చూశాడు తనీష్
కాలేజీలో నాకు తనీష్ ఎదురైనా, నన్ను పట్టించుకోకుండానే వెళ్తున్నాడు. నేను తనీష్ అని పిలిచాను. అంత కోపంగా.. అలా పేరుతో అతన్ని అంతకు ఎప్పుడూ నేను పిలవలేదు. ఏంటి? అన్నట్టు నావైపు సీరియస్ గా చూశాడు తనీష్.

రజిత, ఉదయ్ ల గురించి
"నేను నీతో రాజీపడటానికి రాలేదు. ఒక విషయం గురించి నీతో మాట్లాడాలి. రజిత, ఉదయ్ ల గురించి మాట్లాడానికొచ్చాను. " అన్నాను. ఉదయ్ గురించి రజిత వాళ్ల నాన్నకు తెలిసింది.. అందుకే రజితను కాలేజీకి పంపడం లేదు అని చెప్పాను. ఉదయ్ కి కూడా రజిత వాళ్ల నాన్న వార్నింగ్ ఇవ్వడంతో అతను కాలేజీకి రాకుండా ఊర్లోనే ఉన్నాడు అని చెప్పాను.

వాళ్లిద్దరినీ కలుపుదాం
మరి రజిత పరిస్థితి ఎలా ఉంది అని సిద్దు అడిగాడు. రజిత కుమిలి కుమిలి ఏడుస్తోంది అని చెప్పాను. అందుకోసం మనం మళ్లీ కలిసి వారిద్దరినీ కలపాలి అన్నాను. సరే అన్నాడు. "నిన్ను, ఉదయ్ ని కలిపే బాధ్యత నాదని రజితకు చెప్పొచ్చాను. ఆ విషయం గురించే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీరు కూడా గతంలో వారిద్దరి ప్రేమకు ఏ అడ్డంకి వచ్చినా అండగా నిలుస్తానని ప్రామిస్ చేశారు. సో.. ఇద్దరం మన ప్రామిస్ కోసం కలిసి.. వాళ్లిద్దరినీ కలుపుదాం" అన్నాను.

నాపై కోపం చూపిస్తున్నట్లు నటించాడు
కానీ మనిద్దరం కలిసి తిరగబోయే రోజుల్లో మన మధ్య ఉండేది ఎలాంటి బంధం ఉండకూడదన్నాను. నేను చెప్పినట్టు మీరు నాతో నడుచుకుంటారని నమ్ముతున్నాను అన్నాను. అలా మేమిద్దరం మళ్లీ కలిశాం. రజిత, ఉదయ్ లకు రిజిస్టర్ మ్యారేజ్ చేశాం. తనీష్ చాలా రోజుల వరకు నాపై కోపం చూపిస్తున్నట్లు నటించాడు.

తనీష్ ను పెళ్లి చేసుకున్నా
చివరకు ఒక రోజు తనీష్ ఓపెన్ అయ్యాడు. తనకు నాపై ఉన్న ప్రేమ ఏంటో ఆ రోజు అర్థమైంది. తను నాతో పైకి అలా ప్రవర్తిస్తున్నా తన గుండెల్లో నా స్థానం మాత్రం ఎప్పటీకీ పదిలమే అని నాకు తెలిసింది. అందుకే తనీష్ ను పెళ్లి చేసుకున్నా. ఇప్పటికీ అప్పుడప్పుడు మా మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. కానీ అవి కూడా మాకు తీపి జ్ఞాపకాలే.



Click it and Unblock the Notifications