For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫస్ట్ నైట్ రోజు కూడా నా భర్తను టచ్ చెయ్యనివ్వలేదు, ఒంటిమీద చెయ్యి వెయ్యలేదు, కారణం అదే - #mystory186

ఆ రోజు సోమవారం. సాయంత్రం కావొస్తోంది. బయట వర్షం బాగా పడుతోంది. క్లాస్‌రూమ్‌లో మా లెక్చరర్ పాఠాలు చెబుతూ ఉన్నారు. నాకు అస్సలు వినాలని లేదు. మంచి భర్త, భార్యాభర్తలు, దాంపత్యం, సుఖసంసారం, రొమాన్స్.

|

ఆ రోజు సోమవారం. సాయంత్రం కావొస్తోంది. బయట వర్షం బాగా పడుతోంది. క్లాస్‌రూమ్‌లో మా లెక్చరర్ పాఠాలు చెబుతూ ఉన్నారు. నాకు అస్సలు వినాలని లేదు. కిటికీలోంచి వర్షపు జల్లులను చూస్తూ అలా ఆలోచనలో పడిపోయాను.

ఉదయం అమ్మ చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. "కాలేజీకి అయిపోయాక వెంటనే ఇంటికి వచ్చెయ్. పెళ్లిచూపులు చూడ్డానికి వస్తున్నారు. " అని అమ్మ ఉదయం చెప్పింది. అతను చెప్పేవన్నీ చేసి, మెప్పించి, వాళ్లు ఓకే చెబితే తలొంచి తాళి కట్టించుకోవాలట.. ఛ నాకు పెళ్లి చూపులు అస్సలు నచ్చడం లేదు. ఏం చెయ్యాలో అని నాలో నేను ఆలోచిస్తూ ఉండిపోయాను.

నేనింట్లో ఉంటేనే కదా

నేనింట్లో ఉంటేనే కదా

అయినా నేనింట్లో ఉంటేనే కదా చూడగలుగుతారు? ఒకవేళ నేను రాత్రి అయ్యాక కూడా ఇంటికి వెళ్లకపోతే? నేను వెళ్లను..అని నాకు నేను సర్దిచెప్పుకొని గట్టిగా నవ్వాను. క్లాసయిపోయింది. వర్షం పడుతూనే ఉంది.

నేను ఇంటికెళ్లకూడదని ఫిక్సయిపోయాను.

గ్రౌండ్ లోనే ఆడుతూ పాడుతూ

గ్రౌండ్ లోనే ఆడుతూ పాడుతూ

కాలేజీ అయిపోయింది.. గ్రౌండ్ లోనే ఆడుతూ పాడుతూ గడిపాను. తర్వాత ఇంటికెళ్లాను. పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లు వెళ్లిపోయి ఉంటారనుకున్నా. కానీ వాళ్లు నా కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. భయంభయంగా హాల్ లో నుంచి కిచెన్ లోకి వెళ్లాను. తర్వాత నన్ను అమ్మ రెడీ చేసింది. భయం మొత్తం చంపుకుని ధైర్యం తెచ్చుకున్నాను. కాఫీ కప్ తీసుకుని వెళ్లాను. అబ్బాయికి ఇచ్చాను.

నాతో పర్సనల్‌గా మాట్లాడాలని

నాతో పర్సనల్‌గా మాట్లాడాలని

అబ్బాయి నాతో పర్సనల్‌గా మాట్లాడాలని అడిగాడు. అబ్బాయి పేరు తేజ్. ఇద్దరం ఒక గదిలోకి వెళ్లాం. "మిమ్మల్ని ఇంతసేపు వెయిట్‌ చేయించినందుకు క్షమించమని అడగడం లేదు.ఎందుకంటే నేను చేసింది తప్పు అని నాకనిపించలేదు. నాకిది నచ్చలేదు. ఇలా పిల్లను చూస్కోవడం సంతలో పశువును బేరమాడినట్టు ఉంది. " అని ముఖం మీదే చెప్పేశాను.

ఐ వాన మ్యారీ యూ

ఐ వాన మ్యారీ యూ

"నేను చెప్పాలనుకున్నదంతా చెప్పేశాను. నేను మీకు మంచి భార్యను అవుతానని కూడా నేననుకోను అని అన్నాను చివరగా". తేజ్ లేచి నిలబడి ఒకే ఒక్క మాట అన్నాడు "నువ్వు నాకు నచ్చావు.. ఐ లైక్ యు.. ఐ లవ్ యూ.. ఐ వాన మ్యారీ యూ" అన్నాడు తేజ్.

ఒంటిమీద చెయ్యి కూడా వెయ్యనివ్వలేదు

ఒంటిమీద చెయ్యి కూడా వెయ్యనివ్వలేదు

తర్వాత మా పెళ్లి అయ్యింది. పెళ్లవ్వగానే తేజ్ తో కలిసి బెంగళూర్ వెళ్లిపోయాను. నా ప్రపంచం మొత్తం మారిపోయిందిప్పుడు. కొత్త మనుషులు. కొత్త ప్రదేశం. నాకు నేను కొత్తగా అనిపించేది. నా భర్త నన్ను బాగా ప్రేమించేవాడు. కానీ నచ్చేది కాదు. ఆ ప్రేమ నచ్చలేదు.

చాలా రోజుల వరకూ ఒంటిమీద చెయ్యి కూడా వెయ్యనివ్వలేదు. నన్ను రోజూ రాత్రి బతిమిలాడుకునేవాడు.

ఎందుకు యాక్సెప్ట్‌ చెయ్యలేకపోతున్నానో

ఎందుకు యాక్సెప్ట్‌ చెయ్యలేకపోతున్నానో

బెంగళూర్ కు వచ్చిన రెండో రోజే తేజ్ ఆఫీస్‌కు వెళ్లిపోయాడు. నా మనసులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి.. నేను తనను ఎందుకు యాక్సెప్ట్‌ చెయ్యలేకపోతున్నానో తేజ్ కు తెలియదు. నాకు మాత్రమే తెలుసది.

డిన్నర్‌ పార్టీకి తీసుకెళ్లాడు

డిన్నర్‌ పార్టీకి తీసుకెళ్లాడు

ఒక రోజు తేజ్ డిన్నర్‌ పార్టీకి తీసుకెళ్లాడు. ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ ఇంకా రాలేదు. ఎదురుగా నేను ఏం మాట్లాడకుండా కూర్చొని ఉన్నా. నిమిషాలు మెల్లిగా సెకండ్ల చుట్టూ తిరుగుతున్నాయి. "నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా" అన్నాను. అడుగు అన్నాడు. "నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు?పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేనెన్నో చెప్పాను. అయినా నన్నే ఎందుకు కావాలనుకున్నారు?" అని అన్నాను.

నువ్వు నాకు బాగా నచ్చేశావు

నువ్వు నాకు బాగా నచ్చేశావు

"నువ్వు నాకు బాగా నచ్చావు. మా అన్నయ్యా, వదినల నిర్బంధం వల్ల పెళ్లిచూపులకు వచ్చాను. నిన్ను చూసి ఈ పెళ్లంటే నాకిష్టం లేదు.. .నన్ను క్షమించమని అడుగుదామని నీకోసం ఎదురుచూశాను. కానీ నిన్ను చూసిన తర్వాత.. నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పిన తర్వాత.. మాటల్లో చెప్పలేను.. నువ్వు నాకు బాగా నచ్చేశావు.వద్దని చెప్పాలనుకున్న నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి వచ్చేశాను. నీకు ఈ పెళ్లి జరగడం సంతోషమేగా?"

గట్టిగా అడిగాడు

గట్టిగా అడిగాడు

నేను కళ్లు కిందకు ఉంచి లేదు అని చెప్పాను. తర్వాత డిన్నర్‌ అయిపోయింది. కారులో వెళ్తూ ఉన్నాం. కారు ఆపాడు. తేజ్ ఈ సారి గట్టిగా అడిగాడు.. నీకేమీ కావాలో చెప్పు అన్నాడు. నాకు విడాకులు కావాలి... ఇస్తావా అన్నాను. మళ్లీ నిశ్శబ్దం. తర్వాత కారు స్టార్ట్‌ అయింది. అసలు ఏమైంది నీకు అన్నాడు.

ఓసి.. పిచ్చిదానా

ఓసి.. పిచ్చిదానా

నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించి ఎంతో పేరు తెచ్చుకోవాలనుకున్నాను. కానీ నువ్వు నా ఇంటర్ పూర్తవ్వగానే పెళ్లి చేసుకున్నావు అంటూ ఏడ్చాను. నా ర్యాంకులు, నాకు వచ్చిన బహుమతులు, నన్ను సన్మానించిన ఫొటోలన్నీ మా ఆయనకు చూపించాను.

ఓసి.. పిచ్చిదానా పెళ్లి అయి నీ చదువు ఆగిపోయిందని బాధపడుతున్నావా? నీకు బెంగళూరులో ఒక ఫేమస్ కాలేజీలో అడ్మిషన్ మాట్లాడాను. కాలేజీ తెరవగానే జాయిన్ అవుదువులే అన్నాడు.

తేజ్ ను గట్టిగా హత్తుకుని

తేజ్ ను గట్టిగా హత్తుకుని

నిజమా తేజ్ అన్నాను. అవును నిజమే అన్నాడు. తేజ్ ను గట్టిగా హత్తుకుని ముద్దులుపెట్టాను. పెళ్లయిన చాలా రోజులకు అలా నా భర్తను నేను టచ్ చేశాను. ఫస్ట్ నైట్ రోజు కూడా నా భర్తను నన్ను టచ్ చెయ్యనివ్వలేదు. నిజంగా నన్ను అర్థం చేసుకునే వాడే నా సొంతమయ్యాడని ఆనందించాను.

English summary

i married the perfect man

i married the perfect man
Story first published:Thursday, June 7, 2018, 16:49 [IST]
Desktop Bottom Promotion