మా ఆయన నాతో సెక్స్ చేస్తున్నప్పుడు కూడా అలా చేస్తూనే ఉంటాడు - My Story #60

Written By:
Subscribe to Boldsky

నా పేరు శ్వేత. నాది విజయనగరం. నా పెళ్లి అప్పుడు వచ్చిన ఆటంకాలు చూసే నేను భయపడ్డాను. పెళ్లి అయ్యాక నా జీవితం ఎలా ఉండబోతుందోనని చాలా టెన్షన్ పడ్డాను. అనుకున్నట్లుగానే నా జీవితం నాశనం అయ్యింది. నేను మా అమ్మనాన్నలకు ఒక్కదాన్నే కూతుర్ని. నన్ను చాలా బాగా చూసుకున్నారు మా అమ్మనాన్న. నాకు చిన్నప్పటి నుంచి ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు.

మంచి యాక్టర్

మంచి యాక్టర్

మా ఆయనకు మించిన యాక్టర్ ఎవరూ ఉండరేమో. నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పడు మా తల్లిదండ్రులు ఆయన ఒక రేంజ్ లో నటించారు. మాకు ఏదో కొద్దిగా పొలం ఉంది. మా నాన్న రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది. ఎలాగో ఒక్కదాన్నే కూతుర్ని కదా మా అమ్మనాన్నలు సంపాదించిన ఆస్తి మొత్తం అతనికే వస్తుందనుకున్నాడు. అందుకోసం మాపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోశాడు.

నన్నే కొడుకు అనుకోండి

నన్నే కొడుకు అనుకోండి

"మీకు ఎలాగో కొడుకులు లేరు. నన్నే మీ కొడుకు అనుకోండి. నేను ఏ పని చేసి అయినా సరే మీ అమ్మాయిని బాగా చూసుకుంటా. ఆమె అత్తవారింట్లో ఉన్న ఫీలింగ్ ఏ రోజు కూడా తీసుకురాను. ఆమె తన పుట్టింట్లో ఉన్నట్లే చూసుకుంటాను. ఆమె పెళ్లి అయ్యాక ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు. " అని మా అమ్మనాన్నతో అన్నాడు.

మాయ మాటలు నమ్మారు

మాయ మాటలు నమ్మారు

అతని మాయ మాటలు మా అమ్మనాన్న నమ్మారు. ఇలాంటి అబ్బాయి అస్సలు దొరకడు అనుకున్నారు. పెళ్లికి ముందు అతను బాంబేలో ఉండేవాడు. అక్కడ జాబ్ చేసేవాడా? ఏం చేసేవాడో తెలియదు కానీ మాకు మాత్రం అక్కడ ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాను అని చెప్పాడు. మొత్తానికి మా అమ్మనాన్నలను నమ్మించాడు. వాళ్లు అతనికి తప్పా నన్ను ఎవ్వరికీ ఇవ్వకూడదని అనుకున్నారు.

ఎత్తుగడలు వేశాడు

ఎత్తుగడలు వేశాడు

నాకు మొదటి నుంచి అతనిపై డౌట్ ఉండేది. అతను అంతా డ్రామాలు ఆడుతున్నాడని.. పెళ్లయ్యాక అతను కచ్చితంగా నన్ను ఇబ్బందులుపెడతాని నాకు అనిపించేది. నా పెళ్లి అప్పుడు మా నాన్న కట్నం మొత్తం ఆరెంజ్ చేయలేకపోయాడు. కొంత డబ్బు తర్వాత ఇస్తానన్నాడు. మా ఆయన వెంటనే ఎత్తుగడలు వేశాడు.

అప్పు తీసుకొచ్చి ఇచ్చాడు

అప్పు తీసుకొచ్చి ఇచ్చాడు

మామయ్యా.. నాకు కట్నమే వద్దూ.. కానీ మా అమ్మనాన్నలు మాత్రం కట్నం విషయంలో నన్ను టార్చర్ చేస్తారు. వారికోసమైనా మీరు ఎలాగోలా కట్నం అంతా పెళ్లి రోజే ఇచ్చేలా చూడండి అని మా నాన్నకు చెప్పాడు. తర్వాత మా నాన్న ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చి కట్నం మొత్తం ఇచ్చాడు.

శోభనం రోజు శృంగారం గురించి కాకుండా

శోభనం రోజు శృంగారం గురించి కాకుండా

మా వాళ్లు నా పెళ్లి గ్రాండ్ గానే చేశారు. ఇక ఫస్ట్ నైట్ నుంచే నాకు మా ఆయన నుంచి టార్చర్ మొదలైంది. శోభనం రోజు రాత్రి ఏ భర్త అయినా భార్యతో శృంగారం ఎలా చెయ్యాలి. ఆమెను సెక్స్ లో ఎలా సంతృప్తి పరచాలి అని ఆలోచిస్తాడు కానీ అతను మాత్రం ఆ రోజు రాత్రి మా నాన్నకు ఎంత ఆస్తి ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అలాంటి డిటేల్స్ అడిగాడు. నాకు ఏమి తెలియదని చెప్పాడు. తర్వాత ఏదో మొక్కుబడిగా నాతో సెక్స్ చేశాడు. అతని పిచ్చంతా డబ్బుపైనే ఉంది.

అత్తమామల నుంచి కూడా

అత్తమామల నుంచి కూడా

అత్తమామలతో కూడా రోజూ డబ్బుకు సంబంధించిన టార్చర్ ఉండేది. మీ పుట్నింటి వాళ్లు నువ్వు ఒక్క కూతురువైనా కూడా నిన్ను అస్సలు పట్టించుకోరు అనేవాళ్లు. మా నాన్న తనకు స్థోమత ఉన్నంత వరకు ప్రతిదీ నాకు ఇచ్చాడు. కానీ మా ఆయన, మా అత్త కోరికలు మాత్రం చాలా ఎక్కువగా ఉండేవి.

ప్రతీ పండుగకు..

ప్రతీ పండుగకు..

పండుగ వస్తే పుట్టింట్లో ఏదో బట్టలు పెట్టి పంపిస్తారు. కానీ మా ఆయన ప్రతీ పండుగకు గొంతెమ్మ కోరికలు కోరేవాడు. ఒక పండుగకేమో కారు అంటాడు. ఇంకో పండుగకు గోల్డ్ కావాలంటాడు. ఇలా పండుగకు ఆయన నాతో పాటు మా ఇంటికి వచ్చి మా నాన్నను చాలా ఇబ్బందులుపెట్టేవాడు.

సెక్స్ చేస్తున్నప్పుడు కూడా తిడుతుంటాడు

సెక్స్ చేస్తున్నప్పుడు కూడా తిడుతుంటాడు

ఎవరైనా భార్యతో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆమెతో బాగా రొమాన్స్ చేయాలని అనుకుంటారు. అయితే నా భర్త మాత్రం నాతో సెక్స్ లో పాల్గొనేటప్పుడు నన్ను చాలా టార్చర్ చేస్తాడు.సెక్స్ ను మధ్యలో ఆపి నన్ను తిడుతాడు. నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. ఏమంటే.. నువ్వు హ్యాపీగా ఫీలవుతావని నీతో సెక్స్ చేస్తుంటాను అంటాడు. దారుణంగా తిడుతాడు.

భర్త నుంచి కోరుకునేది అదే కదా

భర్త నుంచి కోరుకునేది అదే కదా

ప్రతి భార్య రాత్రి పూట భర్త నుంచి కోరుకునేది కాస్త ప్రేమనే కదా. పగలంతా ఎలాగున్నా పడుకునేటప్పుడైనా తను నాతో ప్రశాంతంగా మాట్లాడితే చాలు అనుకుంటాను. ఏదో అవసరమైనప్పుడు డబ్బు సాయం చేయమంటే మా నాన్నకు కూడా చేస్తాడు. కానీ ప్రతి రోజూ డబ్బు కావాలంటే ఎలా. మా ఆయన ఏ పని చేయకుండా ఇంట్లో తిని ఊర్లో తిరుగుతుంటాడు. పెళ్లికాకముందు బాంబేలో జాబ్ అన్నాడు. ఇప్పుడేమో ఇంటి దగ్గరే ఉంటాడు.

అందమైనా పెళ్లాన్ని ఉన్నా

అందమైనా పెళ్లాన్ని ఉన్నా

అసలు అతనితో ఎందుకు అందులో పాల్గొంటున్నానా అని నాకే విసుగు వస్తుంది. మాపెళ్లి అయి కూడా చాలా సంవత్సరాలు కాలేదు. తాజాగానే మా పెళ్లి అయ్యింది. నన్ను అతను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో అందమైనా పెళ్లాన్ని ఉన్నా కూడా ఇతర మహిళలతో మా ఆయన సంబంధాలు పెట్టుకున్నాడు. వారితో మాత్రం రోజూ బాగా ఎంజాయ్ చేస్తాడు. నన్ను మాత్రం పట్టించుకోడు.

కొత్తవాళ్లు చూస్తే మంచి మొగుడు అనుకుంటారు

కొత్తవాళ్లు చూస్తే మంచి మొగుడు అనుకుంటారు

నేను ఎంఏ, బీఈడీ చేశాను. పెళ్లికాకముందు నేను స్కూల్ లో టీచర్ గా చేసేదాన్ని. పెళ్లి అయ్యాక నా జీవితం చాలా మారుతుంది అనుకున్నాను. కానీ ఇంత దారుణంగా తయారవుతుందని అనుకోలేదు. మా ఆయన చూడడడానికి చాలా అందంగా ఉంటాడు. కొత్తవాళ్లు ఎవరైనా చూస్తే ఈ అమ్మాయికి ఇంత మంచి మొగుడు దొరికాడని అనుకుంటారు. కానీ అతనితో రోజూ నేను నరకం అనుభవిస్తున్నాను.

రోజూ టార్చర్ చేస్తాడు

రోజూ టార్చర్ చేస్తాడు

భార్యాభర్తలన్నాక ఒక ముద్దూ ముచ్చట ఉండాలి. నాతో ప్రేమగా మాట్లాడాలి. నేను అలిగితే నన్ను బతిమిలాడాలి. నేనే బాధపడితే నన్ను బతిమలాడాలి ఇలాంటవన్నీ ప్రతి భార్య భర్త నుంచి కోరుకుంటుంది. కానీ నా భర్త మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా ఉన్నాడు. నేను బాధపడితే అస్సలు పట్టించుకోడు. నన్ను రోజూ టార్చర్ చేస్తాడు.

ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు

ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు

నాకు ఎప్పుడూ అతనికి విడాకులు ఇద్దామా అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా చేస్తే సమాజం మొత్తం నేను చాలా పెద్ద తప్పు చేసిన దానిలాగా చూస్తారు. మా అమ్మనాన్న చాలా బాధపడతారు. అలా అని అతనితో కాపురం చేయలేను. నన్ను ఏరకంగానూ అతను సంతోష పెట్టడం లేదు. నాకు ఏమిచేయాలో అర్థం కావడం లేదు. నా బాధను ఇలా అందరితో పంచుకోవాలనుకున్నాను. దేవుడు నిర్ణయించినట్లుగానే మన జీవితం ముందుకు పోతుందని నేను ఎవరినీ ఏమి నిందించడం లేదు.

English summary

i realized that he had just used me for money

i realized that he had just used me for money