For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తాళి కట్టేటప్పుడు ఒక్కరూపాయి తక్కువైనా కట్టలేదు, శోభనం రోజు కక్కుర్తిపడుతూ నా మీదపడ్డాడు #mystory346

తను నన్ను కేవలం సెక్స్ బొమ్మ మాదిరిగా చూశాడు. నేను రూమ్ లోకి అడుగుపెట్టగానే వెంటనే రొమాన్స్ స్టార్ట్ చేశాడు. తర్వాత తన సెల్ లో ఏవో వీడియోలు పెట్టి వాటిని చూడమన్నాడు. మనం కూడా ఇక నుంచి అలాగే చేసుకుందాం

|

పెళ్లి, తొలిరాత్రి అంటే నేను మురారీ మూవీలో అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి.. అనే పాటలో మాదిరిగా ఉంటుందని ఊహించుకునేదాన్ని. కానీ నా పెళ్లి నేను అనుకున్నట్లుగా జరగలేదు.

ఏదో కెమెరా మెన్స్ చెప్పినట్లుగా పోజులివ్వడానికే సరిపోయింది. పెళ్లికి వచ్చిన వాళ్లు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినట్లు లేదు.. కేవలం ఫొటోలో కనిపిస్తే చాలు అన్నట్లుగా వచ్చారు.

డబ్బులకే ఎక్కువ విలువ

డబ్బులకే ఎక్కువ విలువ

ఇక పెళ్లిలో ఏవేవో గొడవలు.. మనుషులంతా విలువలకు కాకుండా డబ్బులకే ఎక్కువ విలువ ఇస్తారని నాకు అనిపించింది. అరె పెళ్లి చేసుకుని జీవితాంతం నాతో గడపాల్సిన భర్త, వాళ్ల కుటుంబ సభ్యులు కూడా నా ఫ్యామిలీని ఆ రోజు చాలా ఇబ్బందులకు గురి చేశారు.

పెళ్లి జరగనివ్వమన్నారు

పెళ్లి జరగనివ్వమన్నారు

మా నాన్న కట్నంలో కొంత బ్యాలెన్స్ డబ్బును తర్వాత ఇస్తామని చెప్పడంతో నా భర్త కుటుంబ సభ్యులంతా పెళ్లి జరగనివ్వమని చెప్పారు. చాలా సేపు తాళికట్టకుండా అడ్డుకున్నారు. నా భర్త కూడా గంగిరెద్దులాగా వాళ్లు ఎలా చెబితే అలా తల ఊపాడు.

ఫస్ట్ నైట్ రోజు..

ఫస్ట్ నైట్ రోజు..

ఎలాగోలా నాన్న ఇబ్బందులుపడి డబ్బు అడ్జెస్ట్ చేశాడు. దీంతో చివరకు నా పెళ్లి పూర్తయ్యింది. ఇక ఫస్ట్ నైట్ రోజు నా భర్త ప్రవర్తించిన తీరు చూసి నాకు జీవితంపైనే అసహ్యం వేసింది.

సెక్స్ బొమ్మ మాదిరిగా చూశాడు

సెక్స్ బొమ్మ మాదిరిగా చూశాడు

తను నన్ను కేవలం సెక్స్ బొమ్మ మాదిరిగా చూశాడు. నేను రూమ్ లోకి అడుగుపెట్టగానే వెంటనే రొమాన్స్ స్టార్ట్ చేశాడు. తర్వాత తన సెల్ లో ఏవో వీడియోలు పెట్టి వాటిని చూడమన్నాడు. మనం కూడా ఇక నుంచి అలాగే చేసుకుందాం అన్నాడు.

ఆయన ప్రవర్తన చూసి...

ఆయన ప్రవర్తన చూసి...

నాకు ఆయన ప్రవర్తన చూసేసరికి భయం వేసింది. ఏమిటి ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడనిపించింది. ఎంగేజ్ మెంట్ పూర్తయిన తర్వాత నేను తను అస్సలు ఫోన్ లో కూడా సరిగ్గా మాట్లాడుకోలేదు.

యంత్రంలాగా తను ఎలా చెబితే అలా..

యంత్రంలాగా తను ఎలా చెబితే అలా..

ఆయన అభిరుచులు కూడా సరిగ్గా తెలియవు. కేవలం మా అమ్మనాన్న ఒకే చేయడంతో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. పెళ్లయిన వెంటనే ఒక యంత్రంలాగా తను ఎలా చెబితే అలా నడుచుకోవాలనుకోవడం నా ప్రకారం తప్పు.

అమాంతం నా మీదపడిపోయాడు

అమాంతం నా మీదపడిపోయాడు

శోభనం రోజు నేను జీవితాంతం తనతో ఎలా ఉండాలనుకుంటున్నానో.. తను నాతో ఎలా ఉండాలని కోరుకుంటున్నానో చెబుదామనుకున్నాను. మనస్సు విప్పి తనతో మాట్లాడాలనుకున్నాను. కానీ తను మాత్రం నేను గదిలోకి అడుగుపెట్టగానే అమాంతం నా మీదపడిపోయాడు.

ఏవో బూతు వీడియోలు చూపించాడు

ఏవో బూతు వీడియోలు చూపించాడు

నువ్వు నా భార్యవు.. నేను ఏమీ చేసినా కూడా అడగకూడదనే ఉద్దేశంతో నాతో ప్రవర్తించాడు. కనీసం నాతో మాట్లాడే ప్రయత్నం కూడా చెయ్యలేదు. నా అభిప్రాయాలు.. నా అంతరంగం కూడా తెలుసుకోలేదు. డైరెక్ట్ గా ఏవో బూతు వీడియోలు చూపించాడు.

సిగ్గు వేయలేదా

సిగ్గు వేయలేదా

నీతో కూడా ఇలాగే చేద్దామనుకుంటున్నాను ఈ రోజు నుంచి అన్నాడు. అలా అడగడానికి ఆయన సిగ్గు వేయలేదా అనిపించింది. సరే ఆయకు ఎలా ప్రవర్తించాలో తెలియదు... నేను కూడా అలాగే ప్రవర్తిస్తే ఎలా అని మనస్సులో అనుకున్నాను.

నన్ను బలవంతం చేయొద్దు

నన్ను బలవంతం చేయొద్దు

అందుకే ఆయనకు నా మనస్సులోని మాటలన్నీ చెప్పాను. నా ఇష్టాలు చెప్పాను. నాతో జీవితాంతం అలాగే ఉండాలని కోరాను. చాలా విషయాల్లో నేను నీతో సర్దుకుపోతాను కానీ నన్ను బలవంతం మాత్రం చేయొద్దు అని వేడుకున్నాను.

సంతృప్తిపరుస్తాను

సంతృప్తిపరుస్తాను

నిన్ను నేను ప్రతి విషయంలో సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తాను అని అన్నాను. అలా అని నా మనస్సుకు నచ్చని పని చెయ్యమంటే నేను అస్సలు చెయ్యని అని చెప్పాను. మొదట నా మాటలు మా ఆయన కాస్త షాక్ అయ్యాడు. తర్వాత నా దారిలోకి వచ్చాడు.

నా ఒంటిపై చెయ్యి వెయ్

నా ఒంటిపై చెయ్యి వెయ్

నా మాటలకు నువ్వు గౌరవం ఇస్తేనే నా ఒంటిపై చెయ్యి వెయ్ లేదంటే లేదు అని తెగేసి చెప్పాను. ఆయన జంకుతూనే నా ఒంటిపై చెయ్యి వేశాడు. నా భర్తలాగే చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల మనస్సు తెలుసుకోకుండా ప్రవర్తిస్తుంటారు.

మనస్సును సరిగ్గా అర్థం చేసుకోకుండా..

మనస్సును సరిగ్గా అర్థం చేసుకోకుండా..

అలాంటి వారంతా కూడా కాస్త ఆలోచించండి. అమ్మాయిల మనస్సు తెలుసుకోండి. ఎన్నో ఆశలతో తన జీవితంలోకి నీకు ఆహ్వానం పలికే అమ్మాయిల మనస్సును సరిగ్గా అర్థం చేసుకోకుండా కాలితో తొక్కేయకండి.

English summary

i want to save my marriage but my husband doesnt

i want to save my marriage but my husband doesnt
Desktop Bottom Promotion