మా ఆయన నా కళ్ల ముందు గర్ల్ ఫ్రెండ్ తో సెక్స్ లో పాల్గొన్నాడు.. చూడలేకపోయాను - My Story # 107

Written By:
Subscribe to Boldsky

పెళ్లయ్యాక ప్రతి అమ్మాయి జీవితం మారిపోతుంది. నా జీవితం కూడా అంతే. పెళ్లి అయిన తర్వాత మా ఆయనపై నాపై చాలా ఆంక్షలు విధించాడు. వాటన్నింటినీ నేను భరిస్తూనే వస్తున్నాను. పెళ్లయ్యాక నన్ను జాబ్ వద్దన్నాడు. ఆయన మాటకు గౌరవం ఇచ్చి వదిలేశాను. నేను కాలేజీ చదువుతున్నప్పటి నుంచి ఉపయోగించే ఫోన్ నెంబరు కూడా మార్చమన్నారు. అది కూడా మార్చేశాను.

రోజుకొక రూల్

రోజుకొక రూల్

ఇలా రోజుకొక రూల్ పెట్టేవాడు. అతనిపై ఉన్న గౌరవంతో నేను అతని ప్రతి మాట వినేదాన్ని. స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు కానీ అందులో ఫేస్బుక్ చూడకూడదంటాడు. ఫోన్ అస్సలు నెట్ వేయించడు.

లెగిన్స్ వద్దూ

లెగిన్స్ వద్దూ

నేను వేసుకునే బట్టలు మా ఆయనకు నచ్చేవి కావు. లెగిన్స్ అంటే అసహ్యం అన్నాడు.. సరే అని చుడీదార్ కి మారాను. చీరలు కట్టుకోమన్నాడు. చీరలే కట్టుకుంటున్నాను.

జాకెట్ మార్చమన్నాడు

జాకెట్ మార్చమన్నాడు

నేను తొడుక్కునే జాకెట్ కు కూడా చాలా పేర్లు పెట్టాడు. ఎద మొత్తం కనపడేలా.. వీపు మొత్తం కనపడేలా అలాంటి బ్లౌజ్ వేసుకుంటావేంటి అన్నాడు. ఇప్పుడు నేను వేసుకునే రవికే స్టైల్ కూడా మార్చాను. ఓల్డ్ మోడల్ జాకెట్లు వేసుకుంటున్నాను. మెడ వరకు మొత్తం కప్పేలా ఉండే రవికెలె తొడుక్కుంటున్నాను.

సెక్స్ కావాలంటాడు.. పిల్లలు వద్దంటాడు

సెక్స్ కావాలంటాడు.. పిల్లలు వద్దంటాడు

పెదాలకి లిప్ స్టిక్ వేసుకుంటే కూడా నచ్చదు. బ్యూటీ పార్లర్ కు వెళ్తే సహించడు. బ్యాటీ పార్లర్ గడప తొక్కడమే మానేశాను. నైట్ పూట సెక్స్ కావాలంటాడు కానీ అప్పుడే పిల్లలు వద్దూ.. కొన్ని రోజులు బాగా ఎంజాయ్ చేద్దాం అంటాడు. అలా అని అతను కండోమ్ వాడడు. కండోమ్ వాడితే సెక్స్ లో అంత సుఖం దక్కదు అంటాడు. నేనే పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటాడు.

ఆదివారం కూడా ఆఫీసు

ఆదివారం కూడా ఆఫీసు

రోజూ అతనికి ఇష్టమైన వంటలే వండాలి. ఇక ఆదివారం రాత్రి అర్ధరాత్రి వరకు స్నేహితులతో గడిపి ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్లారండి అని అడిగితే ఆదివారం కూడా ఆఫీసు పని మీద వెళ్లాను అని చెబుతాడు. సండే నైట్ ఫుల్ గా తాగి వస్తాడు.

అమ్మాయి నుంచి మెసేజ్ లు

అమ్మాయి నుంచి మెసేజ్ లు

ఆయన రాత్రి ఒంటిగంటకి ఇంటికి వచ్చాక తన మొబైల్ కి అమ్మాయి నంబర్ నుంచి మెసేజ్ లు వస్తాయి. ఉదయం లేచాక ఎవరు ఆ అమ్మాయి అని అడిగితే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని భయం లేకుండా చెబుతాడు.

ఎక్స్ గర్ల్ ఫ్రెండ్

ఎక్స్ గర్ల్ ఫ్రెండ్

పెళ్లి అయినా కూడా ఇంకా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏంటి అని నిలిదీస్తే.. తనని వదిలెయ్యడం నా వల్ల కాదు అంటాడు. నీకు నేనున్నాను కదా చాలాదా అంటే నువ్వూ తను ఒకటా అన్నాడు.

ఇల్లీగల్

ఇల్లీగల్

అవును నేను లీగల్.. తను ఇల్లీగల్ అన్నాను.. చెంపపై కొట్టాడు. ఆ అమ్మాయిని అస్సలు వదిలే ప్రసక్తే లేదన్నాడు. నువ్వు చెప్పినట్లుగానే వింటున్నాను కదా ఎందుకిలా చేస్తున్నావ్ అంటే ఆ అమ్మాయిని నేను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను అన్నాడు.

ఇద్దరూ సెక్స్ లో ఉండడం చూశాను

ఇద్దరూ సెక్స్ లో ఉండడం చూశాను

ఒక రోజు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని ఏకంగా ఇంటికే తీసుకొచ్చాడు. నేను మార్కెట్ కు వెళ్లి వచ్చేలోపే ఇంట్లో ఇద్దరూ సంసారం మొదలుపెట్టారు. నా కళ్లతోనే వారిద్దరూ సెక్స్ లో ఉండడం చూశాను. నేను షాక్ తిన్నా. వారిద్దరినీ చూసి అలా ఏమి మాట్లాడకుండా ఉండిపోయాను. ఇద్దరూ రూమ్ లోనుంచి బయటికొచ్చాక మా ఆయన్ని నిలదీశాను. నువ్వు ఇలాగే చేస్తే నాక్కూడా ట్రూ లవ్ ఉంది. వాడితో నేను కులుకుతాను అన్నాను.

ఓర్చుకున్నాను

ఓర్చుకున్నాను

నన్ను నానా రకాలుగా టార్చర్ చేశాడు. అయినా ఓర్చుకున్నాను. తనలో ఎటువంటి మార్పూ లేదు. ఇక లాభం లేదనుకున్నాను.

తిరిగి ఫేస్బుక్ ఓపెన్ చేశాను.. లిప్ స్టిక్ రాయడం మొదలెట్టాను.!

మోడ్రన్ జాకెట్లు వేసుకున్నాను. లెగిన్స్ ధరించాను. పార్లర్ కు వెళ్లడం మొదలుపెట్టాను.

అబ్బాయిలతో స్నేహం

అబ్బాయిలతో స్నేహం

నాకు నచ్చిన వంటలే చేసేదాన్ని. రోజూ ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడం, ప్రేమ కవితలు రాయడం చేసేదాన్ని. తిరిగి జాబ్ కి వెళ్ళడం మొదలుపెట్టాను. జాబ్ నుంచి లేట్ గా ఇంటికి రావడం వచ్చేదాన్ని. అబ్బాయిలతో స్నేహం చెయ్యడం మొదలుపెట్టాను.

వీకెండ్ పార్టీలు

వీకెండ్ పార్టీలు

అప్పుడప్పుడు వీకెండ్ పార్టీలకు వెళ్లేదాన్ని. మా ఆయన చూడకుండా ఫోన్లలో మాట్లాడేదాన్ని. మొబైల్ కి, లాప్టాప్ కి పాస్వార్డ్స్ పెట్టుకున్నా. మొదట కొన్ని రోజులు తిట్టాడు. కానీ తర్వాత నాపైనే ఫోకస్ పెట్టాడు. ఎప్పుడూ నన్ను గమనిస్తూ ఉంటాడు.

ఎక్కడ లేపుకెళ్తారోనని

ఎక్కడ లేపుకెళ్తారోనని

చాలాసార్లు అడుక్కున్నాడు. ఎవరొచ్చి నన్ను ఎక్కడ లేపుకెళ్తారోనని భయపడడం మొదలుపెట్టాడు. బయటి వాడికి నేను అస్సలు దక్కకూడదని నన్ను కాపాడుకోవడానికి సెలవు రోజుల్లో కూడా బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు.

ఆప్యాయంగా చూసుకుంటున్నాడు

ఆప్యాయంగా చూసుకుంటున్నాడు

నన్ను ఇప్పుడు ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పై ఉన్న మోజు తగ్గింది. ఇంట్లో ఉన్న ఈ అందాల రాణిని ఇప్పుడు యువరాణిలాగా కాపాడుకుంటున్నాడు. ప్రతి మగాడు తన భార్య ఎవరికీ దక్కకూడదనుకుంటాడు.

ఇతరుల భార్యలను అనుభవించాలనుకుంటాడు

ఇతరుల భార్యలను అనుభవించాలనుకుంటాడు

కానీ తాను మాత్రం ఇతరులు భార్యలను అనుభవించాలనుకుంటాడు. అందుకే పెళ్లాలు కూడా ఇలా చేస్తే ప్రతి మగాడు దారిలోకి వస్తాడు. నిజానికి నా ఏ ఎక్స్ లవర్ లేడు. మా ఆయనను దారిలోకి తెచ్చుకునేందుకే అదంతా చేశాను. ఇప్పుడు నా లైఫ్ హ్యాపీగా ఉంది.

English summary

i was shocked and numb i cried piteously at that time and still do when i am alone

i was shocked and numb i cried piteously at that time and still do when i am alone
Story first published: Thursday, March 8, 2018, 16:39 [IST]