పెళ్లి చేసుకున్నవారితోనే సెక్స్ ఎంజాయ్ చేయండి.. అక్రమ సంబంధాలను ఆశ్రయిస్తే నరకమే - #mystory122

Written By:
Subscribe to Boldsky

నేను ఒక లాయర్ ని. నా దగ్గరకు రోజూ వందలాది కేసులు వస్తూ ఉంటాయి. నా దగ్గరకు వచ్చే కేసులు చూస్తూ నాకే ఒక్కోసారి భయం అవుతూ ఉంటుంది. ఇప్పుడు సమాజం బాగా మారి పోయింది. చాలా మంది అక్రమ సంబంధాల వలలో చిక్కుకుని విలవిలలాడిపోతున్నారు.

చిన్నచిన్న విషయాలకే

చిన్నచిన్న విషయాలకే

చాలా మంది భార్యాభర్తలు చిన్నచిన్న విషయాల వల్ల వేరే వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. పక్క వ్యక్తులు కాస్త సాన్నిహిత్యం చూపినా వారితో పరిచయాన్ని స్నేహంగా మార్చుకుని తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.

తహతహలాడిపోతున్నారు

తహతహలాడిపోతున్నారు

అలాంటి జీవితం కోసమే చాలా మంది తహతహలాడిపోతున్నారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనుషులు కూడా మారిపోతున్నారు. ఇప్పుడు మారుమూల గ్రామాల్లో సైతం స్టార్మ్ ఫోన్లలో సోషల్ మీడియా విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు.

పోర్న్ కు బానిసలవుతున్నారు

పోర్న్ కు బానిసలవుతున్నారు

దీంతో వారి జీవితాలు కూడా పక్కవారి లైఫ్స్ మాదిరిగానే ఉండాలని భావిస్తున్నారు. అలాగే కొందరు పోర్న్ కు బానిసలవుతున్నారు. తన భార్యతో లేదా భర్తతో పోర్న్ లో చూపించిన భంగిమల్లో సెక్స్ చేయాలని కోరుకుంటున్నారు.

అలాంటి సుఖాన్ని అనుభవించాలని

అలాంటి సుఖాన్ని అనుభవించాలని

అలాంటి విషయాల్లో కూడా భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తి మరొకరితో అలాంటి సుఖాన్ని అనుభవించాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. ఈ ఆనందాన్ని వివాహేతర సంబంధాల ద్వారా పొందాలనుకుని వాటిపై మొగ్గు చూపుతున్నారు.

చాటుమాటుగా సంబంధాలు

చాటుమాటుగా సంబంధాలు

భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త చాటుమాటుగా ఇలాంటి సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఈ గుట్టు రట్టు అయినప్పుడు భార్యలు బరితెగించి భర్తలనే హతమార్చిన సంఘటనలను మనం చాలానే చూశాం.

కొంచెం కూడా కనికరంలేకుండా

కొంచెం కూడా కనికరంలేకుండా

ఏడడుగులు నడిచి జీవితాంతం తోడుగా ఉంటామని బాస చేసిన వారిపై కొంచెం కూడా కనికరం చూపడం లేదు. ఇలాంటి సంబంధాల వల్ల కుటుంబాలు మొత్తం నాశనం అవుతున్నాయి.

నమ్మకం లేకపోవడం

నమ్మకం లేకపోవడం

దీనికి ఎన్నో కారణాలున్నాయి. భార్యాభర్తల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం. భార్య లేదా భర్త దగ్గర దొరకని ప్రేమను మరొకరి నుంచి ఆశించడం చేస్తున్నారు.

భర్తలు కూడా ఏం తక్కువ లేరు

భర్తలు కూడా ఏం తక్కువ లేరు

కొందరు భర్తలు వ్యాపారం, సంపాదన మోజులో పడి భార్యను పట్టించుకోవడానికి అస్సలు సమయాన్ని కేటాయించడం లేదు. దీంతో భార్యలు మరొక వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ఈ విషయంలో భర్తలు కూడా ఏం తక్కువ లేరు. వారు కూడా మరో మహిళతో సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు.

అక్రమ సంబంధాలు

అక్రమ సంబంధాలు

ఇక వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా కూడా కొత్తకొత్త వ్యక్తులను పరిచయం చేసుకుని వారితో చివరకు అక్రమ సంబంధాలు పెట్టుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు.

అడ్డదారి తొక్కుతోంది

అడ్డదారి తొక్కుతోంది

ఇక భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న భార్య అతన్ని తనదారిలోకి తెచ్చుకోకుండా తాను కూడా అడ్డదారి తొక్కుతోంది. ఆమె కూడా మరో వ్యక్తితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని తప్పు మార్గంలో పయనిస్తుంది.

కాపురాలు సక్రమంగా ఉండవు

కాపురాలు సక్రమంగా ఉండవు

ఇంకొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కానీ వారి కాపురాలు మాత్రం సక్రమంగా ఉండడం లేదు. చిన్నచిన్న వివాదాలకే ప్రేమించిన వారిని వదిలి మరొకరిపై మోజు పడుతున్నారు.

సమయాన్ని కేటాయించుకోవాలి

సమయాన్ని కేటాయించుకోవాలి

ప్రతి భార్యాభర్త తాము ఎంత బిజీగా ఉన్న సరే తమ కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి

ఎటైనా విహార యాత్రలకు వెళ్తుండాలి. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు అహాన్ని వదిలి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి.

చాలా పెద్ద తప్పు

చాలా పెద్ద తప్పు

సెక్స్ కు సంబంధించి అన్ని విషయాలు భార్యతోనే పంచుకోవాలి. సెక్స్ లో సుఖం మొత్తం భార్యతోనే పొందాలి. పరాయి వారితో పొందాలనుకోవడం చాలా పెద్ద తప్పు.

గౌరవించుకుంటూ ఉండాలి

గౌరవించుకుంటూ ఉండాలి

ఇక భర్త లేదా భార్య పడే కష్టాన్ని అప్పడప్పుడు పొగుడుతూ ఉండాలి. ఇద్దరూ ఒకరినొకరు ఎప్పుడూ గౌరవించుకుంటూ ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య చాలా మంది భార్యాభర్తలు అక్రమ సంబంధాల ఉచ్చుతో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఎవడో గొట్టంగాడి మాటలను విని

ఎవడో గొట్టంగాడి మాటలను విని

ఈ విషయంలో కేవలం భార్యది మాత్రమే తప్పు ఉందని చెప్పలేము. కేవలం భర్తది మాత్రమే తప్పు ఉందని చెప్పలేం. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్తేనే జీవితం. అలాకాదని ఎవడో గొట్టంగాడి మాటలను విని జీవితాంతం తోడుండే భర్తను చంపుకుంటే జీవితాంతం జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది. ఇప్పటికైనా మారండి.

English summary

is it counted as cheating because i just want to have more sex with different partners

is it counted as cheating because i just want to have more sex with different partners
Story first published: Thursday, March 22, 2018, 11:30 [IST]