For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తన ఒంటిపై అణువనువును స్పర్శిస్తూ అభ్యంగన స్నానం చేసిన రోజును మరిచిపోలేను #mystory207

తనకు ఆయిల్ పూస్తూనే నా పెదాలతో తన పెదాలను లాక్ చేసేశాను. అయిదు నిమిషాల తర్వాత తను చాలు అన్నట్లుగా ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. ఏంటీ అన్నాను. ఆ సున్నిపిండితో కాస్త ఒళ్లంతా మర్దన చేయమంది. చేసేశాను.

|

తను నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి క్షణం నాకు ఆనందకరమే. తను నా పక్కనుంటే గంటలు కూడా క్షణాల మాదిరిగా మారుతాయి. తనతో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. అందులో ఒకటి మాత్రం నా జీవితంలో ఎప్పటికీ మరిచపోలేను. ఆ రోజు నాకు ఎప్పటికీ గుర్తు ఉంటుంది.

మనం రోజూ స్నానం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని స్నానాలు మాత్రం మనకు జీవితాంతం గుర్తుంటాయి. నాకు నా భార్యతో కలిసి చేసిన స్నానం చేసిన రోజు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు మేమిద్దరం అభ్యంగన స్నానం చేశాం. నా భార్య అభ్యంగన స్నానం గురించి చెప్పినప్పుడు నాకు అస్సలు అర్థం కాలేదు.

ఆడవారే చేస్తారనుకుంటారు

ఆడవారే చేస్తారనుకుంటారు

తర్వాత తను నాకు ఆ స్నానం గురించి వివరించింది. దాన్ని ఎక్కువ ఆడవారే చేస్తారనుకుంటారు. కానీ మగవారు కూడా చేయొచ్చు. మన బాడీలోని వ్యర్థాలన్నీ మన చర్మంపై ఉన్న చిన్నచిన్న రంధ్రాల నుంచి బయటకు పోతాయి. అవి బయటకు పోకుంటే రక్తం మలినం అయ్యి రోగాల బారిన పడుతాం. అలా కాకూడదనుకుంటే నెలకు ఒక్కసారైనా అభ్యంగన స్నానం చేయాలి.

అదే అభ్యంగన స్నానం

అదే అభ్యంగన స్నానం

ఒంటికి ఆయిల్ పట్టించుకుని చేసేది అభ్యంగన స్నానం.

నువ్వుల ఆయిల్ లేదంటే కోకోనట్ ఆయిల్, లేదంటే ఆముదం, ఇక మీకు వీలైతే వెన్నతో అయినా సరే అభ్యంగన స్నానం చేయొచ్చు. వీటిలో ఏదో ఒకదాన్ని ఒంటిపై పూసుకోవాలి. తర్వాత శనగ పిండిగానీ లేదా మినుముల పిండిగానీ పెసర్ల పిండిగానీ లేదంటే బియ్యంపిండిని కాస్త తడిపి ఒంటి నిండా పట్టించుకోవాలి. ఇక తలను కుంకుడు కాయలతో రుద్దుకుని స్నానం చేయాలి.

స్నానం చేస్తాను కాస్త హెల్ప్ చెయ్యరా

స్నానం చేస్తాను కాస్త హెల్ప్ చెయ్యరా

ఆ రోజు నా భార్య నన్ను ఒక కోరిక కోరింది. ఏమండీ.. నేను మీకు ఇన్ని చేసి పెడుతున్నా కదా. మరి ఈ రోజు నేను అభ్యంగన స్నానం చేస్తాను కాస్త హెల్ప్ చెయ్యరా అంది. ఒకేనే అలాగే అన్నాను. ఫస్ట్ ఆయిల్ ను తల నుంచి కాలి పాదాల వేలి దాకా మర్దన చేసుకుంటూ పూశాను.

తనివి తీరా చూస్తూ తనకు సేవ చేసే భాగ్యం

తనివి తీరా చూస్తూ తనకు సేవ చేసే భాగ్యం

తనకు ఆయిల్ పూస్తూనే నా పెదాలతో తన పెదాలను లాక్ చేసేశాను. అయిదు నిమిషాల తర్వాత తను చాలు అన్నట్లుగా ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. ఏంటీ అన్నాను. ఆ సున్నిపిండితో కాస్త ఒళ్లంతా మర్దన చేయమంది. చేసేశాను. తన అందాలన్నీ తనివి తీరా చూస్తూ తనకు సేవ చేసే భాగ్యం దొరికింది అని ఆనందిస్తూ తన కోరిక తీర్చాను. కాసేపు ఇద్దరం అలా ఫ్యాన్ కింద కూర్చొన్నాం.

ఇద్దరం కలిసి స్నానం చేశాం

ఇద్దరం కలిసి స్నానం చేశాం

నేను ఒక్కదాన్నే అభ్యంగన స్నానం చేస్తే ఏం బాగుంటుంది.. ఇద్దరం చేద్దాం పద అంది. అంతే క్షణాల్లో నేను కూడా స్నానానికి సిద్ధం అయ్యాను. తను నాకు ఆయిల్, సున్నిపిండి పట్టించింది. తర్వాత కుంకుడు కాయల రసాన్ని తలంటుకుని ఇద్దరం కలిసి స్నానం చేశాం. షవర్ కింద తన అందాలన్నీ చూసి నన్ను నేను మైమరిచిపోయాను.

మళ్లీ చల్లటి నీటితో స్నానం చేశాం

మళ్లీ చల్లటి నీటితో స్నానం చేశాం

ఈ స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలట. మా ఆవిడకు ఆ విషయాలు తెలుసు కాబట్టి తను అన్ని జాగ్రత్తలు తీసుకుంది. స్నానానికి ఉపయోగించే నీళ్లు బాగా వేడిగా ఉండకూడదు. మరీ చల్లగా ఉండకూడదు. అలాంటి నీటితో ముందుగా మేము స్నానం చేశాం. తర్వాత మళ్లీ చల్లటి నీటితో స్నానం చేశాం.

నా ఒళ్లంతా తుడిచేసింది

నా ఒళ్లంతా తుడిచేసింది

తర్వాత టవల్ తో తను నా ఒళ్లంతా తుడిచేసింది. ఇద్దరం పలుచని డ్రెస్ లు వేసుకున్నాం. ఇక గంటపాటు భోజనం చేయలేదు. ఎందుకంటే ఆ స్నానం చేశాక ఏమి గంట వరకు ఏమీ తినకూడదట. అందుకే మజ్జిగ, జ్యూస్ లు తాగాం.

అంతులేని రొమాన్స్

అంతులేని రొమాన్స్

ఇలా ఒంటి నిండా ఆయిల్ పూసుకుని, మర్దన చేసుకుని తర్వాత చేసే అభ్యంగన స్నానంలో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాదు అంతులేని రొమాన్స్ కూడా ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది. ప్రస్తుతం జనాలు ఇలాంటి స్నానాలు అస్సలు చేస్తూ ఉండరు. షవర్ కింద రెండు నిమిషాలు నిలబడి స్నానం అయిపోదనుకుంటారు.

ఆధ్యాత్మిక కోణంలో అభ్యంగన స్నానం

ఆధ్యాత్మిక కోణంలో అభ్యంగన స్నానం

కానీ అభ్యంగన స్నానం మంచిదని డాక్టర్లు కూడా చెబుతున్నారు. అంతేకాదు ఆధ్యాత్మిక కోణంలో అభ్యంగన స్నానం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. సోమవారం అభ్యంగన స్నానం చేస్తే మనకు అన్ని లాభాలు చేకూరుతాయి. అయితే మంగళవారం అభ్యంగన స్నానం చేయకూడదట. బుధవారం చేయొచ్చు. బుధ, గురువారాల్లో అభ్యంగన స్నానం చేస్తే మంచి మేధస్సు కలుగుతుంది.

ఆదాయం పెరుగుతుంది

ఆదాయం పెరుగుతుంది

శుక్రవారం, శనివారం చేస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదివారం అస్సలు చేయకూడదట. చేస్తే అందం మొత్తం పోతుందట. మొత్తానికి ఏ విధంగా చూసినా అభ్యంగన స్నానం అదుర్స్. మామూలుగా అయితే నేను కూడా అలాంటి స్నానాలకు చాలా దూరం.

అణువనువును స్పర్శించే అవకాశం

అణువనువును స్పర్శించే అవకాశం

కానీ నేను మా ఆవిడ పక్కన ఉండి అందాలన్నీ చూపించే సరికి టెంప్ట్ అయిపోయి చేసేశాను. అభ్యంగన స్నానం వల్ల ఆరోగ్యమే కాదు నాలాంటి వారికి చాలా జ్ఞాపకాలు కూడా మిగులుతాయి. తన శరీరంలోని అణువనువును నేను స్పర్శించే అవకాశం అభ్యంగన స్నానం వల్లే కలిగింది.

English summary

It was a happy day for me I was enjoying with my wife

It was a happy day for me I was enjoying with my wife
Story first published:Tuesday, August 14, 2018, 16:02 [IST]
Desktop Bottom Promotion