For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యారేజ్ అడ్వైస్ : మహిళలు తమకంటే చిన్నవారిని భర్తగా ఎందుకు కోరుకుంటున్నారు?

మ్యారేజ్ అడ్వైస్ : మహిళలు తమకంటే చిన్నవారిని భర్తగా ఎందుకు కోరుకుంటున్నారు?

|

వివాహమనేది ప్రతి వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్యమైన ఘట్టం. వివాహ జీవితం సంతోషంగా ముందుకు సాగాలంటే భార్యాభర్తలిద్దరి మధ్యా అన్యోన్యత ముఖ్యం. చాలా సందర్భాలలో, వధువు వయసు సాధారణంగా వరుడి వయసుకంటే తక్కువగా ఉంటుంది. కొన్ని అరుదైన సందర్భాలలో వధువు వరుడికంటే ఎక్కువ వయసు కలిగి ఉంటుంది. ఈ విషయం గురించి మాట్లాడుకోవాలంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ను పరిగణలోకి తీసుకోవాలి.

వివాహాలు వైఫల్యం అవడానికి అలాగే వివాహ బంధం విజయవంతంగా ముందుకు సాగడానికి కొన్ని ఫ్యాక్టర్స్ కారణమవుతాయి. ఇప్పుడు, అసలు విషయంలోకి వస్తే, కొంతమంది మహిళలు తమకంటే తక్కువ వయసున్న పురుషులని వివాహమాడటానికి ఎందుకు ఆసక్తికనబరుస్తున్నారో ఇప్పుడు మనం చర్చించుకుందాం.

Marriage Advice; Why Older Women Are Marrying Younger Men

అదే సమయంలో తమకంటే ఎక్కువ వయసున్న మహిళలను పెళ్లాడాలని పురుషులు ఎందుకు భావిస్తున్నారో కూడా చర్చించుకుందాం. వీటన్నిటికీ మూలం ఏంటంటే జీవితం గురించి ఆలోచించినప్పుడు మ్యారేజ్ తమకున్న అభిప్రాయాలు వివాహబంధంలోకి అడుగెడుతున్నప్పుడు ఆ విధమైన ప్రిఫరెన్స్ లు గా మారతాయి.

వివాహం గురించి ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంటుంది. ఒక్కొక్కరి అభిప్రాయం వేరుగా ఉండవచ్చు.

కాబట్టి, మహిళలు వయసులో తమ కంటే చిన్నవారైన పురుషులని పెళ్లాడాలని కోరుకోవడానికి గల కారణాలను ఇప్పడు తెలుసుకుందాం.

1. తమ వయసులో ఉన్న మగవారు అప్పటికే సెటిల్ అయిపోయి ఉండవచ్చు:

1. తమ వయసులో ఉన్న మగవారు అప్పటికే సెటిల్ అయిపోయి ఉండవచ్చు:

మహిళలు తమ కంటే వయసులో చిన్నవారిని పెళ్లాడడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం అవుతుంది. వివాహమాడటానికి తమ వయసు వారిలో ఛాయిస్ లేకపోవడంతో తమ కంటే తక్కువ వయసున్న వారిపై మొగ్గు చూపుతున్నారు కొందరు మహిళలు. ఈ కారణం వలన తమకంటే తక్కువ వయసున్న పురుషులను పెళ్లాడటానికి మహిళలు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.

2. బాధ్యత వహించడం కోసం:

2. బాధ్యత వహించడం కోసం:

వివాహబంధం తమ అదుపులో ఉండటానికి మహిళలు ప్రాధాన్యతనిచ్చినప్పుడు తమకంటే చిన్నవారిని పెళ్లాడాలని వారు భావిస్తారు. వివాహబంధంపై కంట్రోల్ ని తీసుకోవడానికి వారు ఇష్టపడతారు. ప్రతి రోజుని ఆస్వాదించాలని కోరుకుంటారు. తమకంటే చిన్నవారిని పెళ్లి చేసుకోవడం వలన జీవితంపై మహిళలు తమ భర్త కంటే ఎక్కువగా అవగాహన కలిగి ఉంటారు. ప్రతి వివాహబంధంలో తలెత్తే సమస్యలను చాకచక్యంగా పరిష్కరించగలుగుతారు. తమ వివాహబంధం పదిలంగా ముందుకు సాగేందుకు వయసులో పెద్దదైన తమ భార్య తీసుకునే నిర్ణయాలను సాదరంగా స్వాగతించేందుకు పురుషులు ఏ మాత్రం వెనకడుగు వేయరు. అందువలన, వీరిద్దరి మధ్య అవగాహన మరింత పెరుగుతుంది. వివాహబంధం పదిలంగా ముందుకు సాగుతుంది.

3. తమ వయసుకంటే తక్కువ వయసున్న వారిలా భావిస్తారు:

3. తమ వయసుకంటే తక్కువ వయసున్న వారిలా భావిస్తారు:

తమకంటే చిన్నవారైనా పురుషుడిని వివాహమాడిన స్త్రీ తన వయసుకంటే తక్కువ వయసున్నట్టుగా భావనకు లోనవుతుంది. తనలోని యవ్వనం మళ్ళీ యాక్టివ్ గా మారినట్టు భావిస్తుంది. యవ్వనంలో పురుషులు యాక్టివ్ గా అలాగే స్పోర్టివ్ గా ఉంటారు. అదే విధమైన అనుభూతికి స్త్రీలు లోనవుతారు. తమకంటే చిన్నవారిని మహిళలు వివాహమాడటం వలన వారిలో దాగున్న చిలిపితనం బయటికి వస్తుంది. ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఇద్దరి మధ్య రొమాన్స్ కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రేమ మరింత పెరుగుతుంది. ఇద్దరూ సన్నిహితంగా ఉంటారు.

4. శృంగారంపై ఆసక్తి:

4. శృంగారంపై ఆసక్తి:

వయసుపైబడిన కొద్దీ వివాహమాడడానికి గల ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. అందువలన, వీరు తమకంటే వయసులో తక్కువున్న పురుషునితో వివాహబంధంలోకి కాన్ఫిడెంట్ గా అడుగుపెడతారు. అప్పటికే, జీవితంపట్ల అలాగే వివాహబంధం పట్ల అవగాహనతో ఉన్న స్త్రీ తన భర్తతో శృంగార జీవితాన్ని వందశాతం ఆస్వాదిస్తోంది. శృంగారంపైనా సాధారణంగా ఉండే అపోహలు ఒక వయసుకి వచ్చే సరికి తీరిపోతాయి. కాబట్టి, స్త్రీ తమకంటే చిన్నవాడైన తన భర్తతో సంతృప్తిగా దాంపత్య జీవితాన్ని సాగిస్తుంది. ఇద్దరు శారీరకంగా అలాగే మానసికంగా దగ్గరవుతారు. ఒకరిపై ఒకరికి ప్రేమతో పాటు ఆప్యాయత పెరుగుతుంది. వీరిద్దరూ కలకాలం సంతోషంగా జీవనం సాగించేందుకు ముందుకు వెళతారు.

5. యవ్వనంలో ఉన్న పురుషులు ఆశావాద దృక్పథంతో ఉంటారు:

5. యవ్వనంలో ఉన్న పురుషులు ఆశావాద దృక్పథంతో ఉంటారు:

తమకంటే వయసులో తక్కువున్న పురుషులను మహిళలు వివాహమాడటానికి ఇది ఒక ముఖ్య కారణం. యవ్వనంలో ఉన్న పురుషుడు ఆశావాద దృక్పథంతో ఉంటాడు. అందువలన, వారితో వివాహబంధంలోకి అడుగుపెట్టినప్పుడు సాధారణంగా వివాహ జీవితంలో ఎదురయ్యే కాంప్లికేషన్స్ అనేవి ఎదురవవు. వారు తమ భార్యను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. అందువలన, మహిళలు తమ కంటే వయసులో చిన్నవారైనా పురుషులను వివాహమాడాలని భావిస్తున్నారు.

వివాహ బంధం పదికాలాల పాటు చల్లగా ఉండాలనే ఎవరైనా ఆశిస్తారు. ఇదే విధమైన భావన కలిగిన స్త్రీ తమకంటే తక్కువ వయసున్న పురుషుడిని వివాహమాడటానికి మొగ్గు చూపుతోంది.

English summary

Marriage Advice; Why Older Women Are Marrying Younger Men

In the world of marriage, people have had bizarre experiments. Starting from being with a woman or a man of our own age to marrying a man or woman who is twenty years elder or younger. We have found happiness and sadness in each and every type of marriage. Everyone has a different perspective on marriage. We never know what we exactly want unless we explore.
Desktop Bottom Promotion