నాకు కాబోయే భర్త ఫోన్ చేసి రాత్రంతా ఆ విషయాలే మాట్లాడుతాడు! ఏం చెయ్యమంటారు?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా పేరు మేఘ. నా బాయ్ ఫ్రెండ్ పేరు రంగ. మేమిద్దరం చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నాం. రంగ నా స్నేహితురాలికి బెస్ట్ ఫ్రెండ్. నా ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయ్యాడు. మొదట ఇద్దరం ఫ్రెండ్స్ మాదిరిగా ఉండేవాళ్లం. కొన్నాళ్లకు అతను ప్రపోజ్ చేశాడు.

పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం

పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం

నాకు కూడా రంగ అంటే ఇష్టం ఉండడంతో నేను ఒకే చెప్పేశాను.

మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. రంగ వాలింట్లో పెద్దలు మా పెళ్లికి దాదాపుగా ఒప్పుకున్నారు. మాఇంట్లో కూడా ఒప్పించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం.

సెక్స్ లో ఎన్నిసార్లు పాల్గొందాం

సెక్స్ లో ఎన్నిసార్లు పాల్గొందాం

మన పెళ్లి అయ్యాక శోభనం రాత్రి సెక్స్ లో ఎన్నిసార్లు పాల్గొందాం? నాకు అయితే సెక్స్ గురించి ఏమీ తెలియదు.. నీకు ఏమైనా తెలుసా? అంటూ రంగ ఏవేవో విషయాలు ఫోన్లో మాట్లాడుతుంటాడు.

రంగ చాలా మంచి వ్యక్తే

రంగ చాలా మంచి వ్యక్తే

ఆ మాటలు వింటే నాకు చాలా కోపం వస్తుంది. నాకు రంగ నుంచి కోరుకున్న ప్రేమ వేరు. అతను నాపై చూపిస్తున్న ప్రేమ వేరు. రంగా చాలా మంచి వ్యక్తే. మంచి జాబ్ చేస్తున్నారు. మంచి సాలరీ కూడా ఉంది. కానీ ఇదొక్క చెడ్డ అలవాటు ఉంది. నా ఫ్రెండ్ కు ఈ విషయాలన్నీ చెప్పాను.

సెక్స్ గురించే ఎక్కువగా

సెక్స్ గురించే ఎక్కువగా

చాలా మంది మగవారు సెక్స్ గురించే ఎక్కువగా మాట్లాడతారు అని నా ఫ్రెండ్ చెప్పింది. అవన్నీ లైట్ తీస్కో అంది. తెల్లవార్లూ నా బాయ్ ఫ్రెండ్ ఫోన్లు చేసి నిద్రపోనివ్వడం లేదు. ఎప్పుడూ సెక్స్ గురించే మాట్లాడుతుంటాడు.

మగవారి స్వభావం అలాగే ఉంటుందా?

మగవారి స్వభావం అలాగే ఉంటుందా?

నా బాయ్ ఫ్రెండ్ మాట్లాడే విధానం కరెక్టేనా? నేను అతన్ని అపార్థం చేసుకుంటున్నానా? మగవారి స్వభావం అలాగే ఉంటుందా? కాబోయే భార్యతో సెక్స్ గురించి తప్ప ఇక దేని గురించి మాట్లాడరా? అనేవి నా సందేహాలు. దయజేసి నాకు సమాధానాలు చెప్పండి.

సెక్స్ ఒక్కటే లైఫ్ కాదు

సెక్స్ ఒక్కటే లైఫ్ కాదు

సమాధానం : గర్ల్ ఫ్రెండ్ దగ్గర అందులో కాబోయే భార్య దగ్గర ఇలాంటి విషయాలు మాట్లాడి ఆనందపడిపోయే మగవారు ఉంటారు. కానీ అందరు మగవారు అలాగే ఉండరు. మీరన్నట్లుగా సెక్స్ ఒక్కటే లైఫ్ కాదు.

సెక్స్ పైనే ఆసక్తి ఉంది

సెక్స్ పైనే ఆసక్తి ఉంది

పెళ్లి తర్వాత మీ లైఫ్ ఎలా మలచుకోవాలనే విషయాలపై కూడా మీ బాయ్ ఫ్రెండ్ మీతో చర్చించవచ్చు. అయితే అతనికి అంతకంటే ఎక్కువగా సెక్స్ పైనే ఆసక్తి ఉంది. మీరు ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందకండి.

సెక్సు కచ్చితంగా ఉంటుంది

సెక్సు కచ్చితంగా ఉంటుంది

ఈ విషయం గురించి అతనికి నచ్చజెప్పండి. మీ దాంపత్య జీవితంలో సెక్సు కచ్చితంగా ఉంటుంది. కానీ 24 గంటలు మనం దాని గురించే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనం పెళ్లి చేసుకుంటే ఇంకా చాలా బాధ్యతలు మనకు వస్తాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం అని అతనికి నచ్చజెప్పండి.

పెళ్లి కుదరకపోతే

పెళ్లి కుదరకపోతే

ఈ విషయాన్ని అతనికి సావధానంగా చెప్పి ఒప్పించండి. పెళ్లి చేసుకున్న తర్వాత వీటి గురించి మాట్లాడుకుందాం అని చెప్పండి. పెళ్లికి ముందు ఇలాంటి విషయాలు గురించి చర్చించి.. చివరకు పెళ్లి కుదరకపోతే చాలా చండాలంగా ఉంటుందని చెప్పండి. మీరిద్దరి మనస్సులు కలిస్తే మీ పేరెంట్స్‌ను ఒప్పించి పెళ్లి చేసుకోండి.

English summary

my boyfriend always talks sexually to me

my boyfriend always talks sexually to me