నా భర్తతో బాలి ద్వీపానికి హనీమూన్ కు వెళ్లా, భలే మజా వచ్చింది, ఎన్ని రౌండ్లు అందులో పాల్గొన్నామో !

Written By:
Subscribe to Boldsky

మాకు గతేడాది పెళ్లయ్యింది. మా ఆయన పెళ్లి అయిన తర్వాతే మనం ఎటైనా హనీమూన్ కు వెళ్దాం అన్నాడు. మా ఎంగేజ్ మెంట్ అయిపోయాక నేను మా ఆయనతో చాలా రకాల ప్లాన్స్ వేశాను. ఇండియాలోని హనీమూన్ స్పాట్స్ అన్నింటి గురించి మాట్లాడుకున్నాం.

మార్చి అయిపోయాక వెళ్దాం

మార్చి అయిపోయాక వెళ్దాం

కానీ మా పెళ్లి అయ్యాక మా ఆయనకు ఆఫీసులో సెలవులు దొరకకపోవడంతో మేమిద్దరం హనీమూన్ కు వెళ్లలేకపోయాం. పెళ్లయ్యాక నేను మా ఆయనతో రోజూ హనీమూన్ గురించే మాట్లాడేదాన్ని. మార్చి అయిపోయాక కచ్చితంగా వెళ్దాం అన్నాడు. నీకు నచ్చిన ఒక మంచి ఏరియాను సెలెక్ట్ చేయమన్నాను.

ఇండోనేషియాలోని బాలి ద్వీపం

ఇండోనేషియాలోని బాలి ద్వీపం

నేను మంచి ట్రిప్ ప్లాన్ చేయాలనకున్నాను. నేను, నా భర్త జీవితాంతం ఆ ట్రిప్ గుర్తు పెట్టుకోవాలనుకున్నాం. మన ఇండియా ట్రిప్ కాకపోయినా ఇండియాకు తగ్గట్లుగా ఉండాలనుకున్నాను. నాకు అప్పుడు ఇండోనేషియాలోని బాలి ద్వీపం గుర్తొచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా చాలా జంటలు

ప్రపంచవ్యాప్తంగా చాలా జంటలు

బాలి ద్వీపంలో హిందూ సంప్రదాయం ఎక్కువ. మన ఇండియాలో మాదిరిగానే వరిచేలు ఎక్కువగా ఉంటాయి. ఎన్నో పురాతన కట్టడాలుంటాయి. ఆలయాలు కూడా చాలా ఉంటాయి. ఇక మనం కోరిందల్లా అక్కడ తినొచ్చు. ఫైనల్ మేము బాలికి వెళ్లాం. మాలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జంటలుగా బాలికి వచ్చారు.

భలే ఎంజాయ్

భలే ఎంజాయ్

బాలి ద్వీపానికి ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక హనిమూన్‌ కోసం బాలి వెళ్లే జంటలు భలే ఎంజాయ్ చేస్తారు.

బాలిలో కొన్ని వేల ఆలయాలు ఉన్నాయి. మేము అందులో కొన్నే చూశాం. ఇక అక్కడ దొరికే ఫుడ్స్ తింటే జీవితంలో మరిచిపోలేం. మాంసాన్ని బాగా వేయించి కొబ్బరి, మసాలాలు కలిపి అందిస్తారు. పలు రకాల మాంసాహారాలు మేము తిన్నాం.

నన్ను నేను మైమరిచిపోయా

నన్ను నేను మైమరిచిపోయా

మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే బాలి ద్వీపం అంతా వరిమడులే ఉంటాయి. అబ్బా.. వాటిని చూడగానే నన్ను నేను మైమరిచిపోయా. మా ఆయనకు కాస్త ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. కెమెరాలో ఆ అందాల్ని.. నా వయ్యారాల్ని బంధించాడు.

వస్త్రాలు లేకుండానే తిరిగేవారంట

వస్త్రాలు లేకుండానే తిరిగేవారంట

బాలిలోని ఉబుద్‌ లో చాలా ఎత్తులో ఉండే ఊయల్లో ఊగుతూ అక్కడున్న అందాలన్నీ చూశాం. నిజంగా బాలి పర్యాటకుల స్వర్గం. బాలిలో ఒకప్పుడు మహిళలు పై వస్త్రాలు లేకుండానే తిరిగేవారంట. కాని ఇప్పుడు అక్కడ మహిళలు జాకెట్లు వేసుకుంటున్నారు. ఇండొనేసియాలో ఎక్కువగా ముస్లింలే ఉంటారు. కానీ బాలిలో అంతా హిందువులే ఉంటారు.

హోటల్ కిటికిలో నుంచి

హోటల్ కిటికిలో నుంచి

బాలిలో అంతా పచ్చని చెట్లు, రంగురంగుల పూలే కనువిందు చేస్తాయి. ఇక సముద్రతీరాలైతే భలే ఉంటాయి. కింతామణి అగ్నిపర్వతం బాలి ద్వీపానికే హైలెట్. అలా బాలి ద్వీపాన్ని ఒక రౌండ్ వేసిన మేము అలిసి పోయి అక్కడ ఒక హోటల్ లో రూమ్ లో దిగాం. హోటల్ కిటికిలో నుంచి సముద్రపు అందాల్ని చూస్తూ గడిపాం.

ఎంజాయ్ కూడా చేయొచ్చు

ఎంజాయ్ కూడా చేయొచ్చు

బాలి చాలా పవిత్ర స్థలమే. అలాగే హనిమూన్ కు వెళ్లిన జంటలు ఎంజాయ్ చేయడానికి కూడా అక్కడ అనుకూలమైన ప్రదేశాలున్నాయి. బాలిలో మేము సముద్ర తీరాన ఉన్న రూమ్ లో ఒక రోజంతా ప్రపంచాన్ని మరిచిపోయి గడిపాం.

రాత్రి వరకూ రొమాన్స్

రాత్రి వరకూ రొమాన్స్

ఉదయం నుంచి రాత్రి వరకూ రొమాన్స్ లో మునిగిపోయాం. ఆ వాతావరణంలో ఎలాంటి వారు అయినా సరే హద్దులు మీరి ఎంజాయ్ చేస్తారు. మేము అలాగే చేశాం. అసలు ఎన్ని రౌండ్స్ అందులో పాల్గొన్నామో మాకే తెలియదు.

భలే ఆనందం

భలే ఆనందం

మొత్తానికి మా ఆయన లేటుగా హనీమూన్ కు తీసుకెళ్లినా బాలిలో గడిపిన ప్రతి క్షణం నాకు గుర్తొస్తే భలే ఆనందంగా ఉంటుంది. ఆ ద్వీపంలో మన సంప్రదాయం చూసి బాగా సంతోషించాను.

ఒక్కసారి అయినా వెళ్లి ఆనందించాలి

ఒక్కసారి అయినా వెళ్లి ఆనందించాలి

మన పల్లెటూర్లను, కోస్తా ఆంధ్రా అందాలను, సముద్ర తీరంలో అనుభవించే సంతోషాలను, తెలంగాణ పద్దతులను, రాయలసీమ రాజసాన్ని అన్నింటినీ కలిపితే ఇండోనేషియాలోని బాలి ద్వీపం అవుతుంది. మన తెలుగువారు జీవితంలో ఒక్కసారి అయినా అక్కడికి వెళ్లి ఆనందించాలి.

కొత్తగా పెళ్లయిన వారే కాదు

కొత్తగా పెళ్లయిన వారే కాదు

అక్కడ సరదాగా మేము గడిపిన ప్రతి క్షణం నాకు జీవితాంతం గుర్తుంటుంది. మరి ఈ ఏప్రిల్ లో బాలి ద్వీపానికి హనీమూన్ కు వెళ్లొచ్చా? అని అడిగితే కచ్చితంగా వెళ్లండని నా సలహా. కొత్తగా పెళ్లయిన వారే కాదు.. ఎవరైనా.. ఎప్పుడైనా బాలికి వెళ్తే ఆ మజానే వేరబ్బా.

English summary

my honeymoon experience in bali

my honeymoon experience in bali
Story first published: Tuesday, April 10, 2018, 13:00 [IST]