Latest Updates
-
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు!
ఆయన్ని పెళ్లి చేసుకున్నాక లైఫ్ జిల్ జిల్ జిగేల్ అనుకున్నా, రాత్రి ఇంటికొచ్చాక అలా.. #mystory355
బెడ్ పై నుంచి కాలు కూడా కింద పెట్టనిచ్చేవాడుకాదు. నేను లేవక ముందు టీ పెట్టి నాకు తీసుకొచ్చేవాడు. టిఫిన్ కూడా తనే కుక్ చేసేవాడు. నేను అన్నం తిననని మారం చేస్తే గోరు ముద్దులు తినిపించేవాడు.
తను నన్ను ప్రేమించేటప్పుడు ఎంత గాఢంగా లవ్ చేశాడో. నువ్వు లేకుంటే నేను లేను అనే రీతిలో నా వెంట పడేవాడు. నీ కోసం ప్రాణాలైనా వదిలేస్తాను అన్నట్లుగా చేసేవాడు. లవ్ చేసేటప్పుడు నేను లేకుంటే చచ్చిపోతానని అన్నట్లు బిల్డప్ ఇచ్చాడు. పెళ్లి అయ్యాక అప్పుడు చూపించిన ప్రేమలో ఒన్ పర్సెంట్ కూడా చూపించడం లేదు.
తను మా నాన్నకు ఎన్ని సార్లు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడో. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తావా? లేదంటే లేపుకెళ్లాలా అని. మొత్తానికి మా నాన్న నా పెళ్లికి బలవంతంగా అంగీకరించేటట్లు చేసి చివరకు తను నన్నే పెళ్లి చేసుకున్నాడు.

జిల్ జిల్ జిగేల్
నాకోసం అంత ఫైటింగ్ చేసిన ఆయనే భర్తగా వస్తే ఇక రోజూ నా లైఫ్ జిల్ జిల్ జిగేల్ అనుకున్నాను. కానీ పెళ్లయిన తర్వాత ఒక వారం రోజులు నన్ను మహారాణిలా చూసుకున్నాడు.

కాలు కింద పెట్టనిచ్చేవాడుకాదు
బెడ్ పై నుంచి కాలు కూడా కింద పెట్టనిచ్చేవాడుకాదు.
నేను లేవక ముందు టీ పెట్టి నాకు తీసుకొచ్చేవాడు. టిఫిన్ కూడా తనే కుక్ చేసేవాడు. నేను అన్నం తిననని మారం చేస్తే గోరు ముద్దులు తినిపించేవాడు.

గొడవపడుతూ ఉంటాడు
కానీ ఆ ప్రేమ ఎక్కువ రోజులు నాపై చూపలేదు. జీవితాంతం తను అలా ప్రేమిస్తాడని అనుకున్నాను. చిన్నచిన్న విషయాలకే తను నాతో గొడవపడుతూ ఉంటాడు. నాపై అంత ప్రేమ చూపినవాడు ఎందుకిలా ప్రవర్తిస్తుంటాడో నాకు అర్థం కాదు.

ప్రపంచం మొత్తం అంతమైనా
ఏవేవో సినిమా డైలాగ్స్ చెప్పేవాడు. ఈ ప్రపంచం మొత్తం అంతమైనా సరే నీపై నాకు ఉండే ప్రేమ మాత్రం పోదు అనేవాడు. తన మాటలు వింటుంటే ఇలాంటి ఆయన నా భర్తగా రావడం నా అదృష్టం అనుకునేదాన్ని.

ఆ కోపన్నంతా...
కానీ మా ఆయనలో ఇప్పుడు ఆ ప్రేమ కనిపించడం లేదు. ప్రతి చిన్నవిషయానికి నన్ను ఆయన తిడుతూ ఉంటాడు. ఆఫీస్ లో ఎవరైనా ఆయనపై సీరియస్ అయితే ఆ కోపన్నంతా ఇంటికొచ్చాక నాపై చూపిస్తాడు.

నేలకేసి కొడతాడు
అప్పుడప్పుడు కాస్త కూరలో ఉప్పు ఎక్కువైతే పల్లెం నేలకేసి కొడతాడు. బాత్రూమ్ లోకి వెళ్లేటప్పుడు టవల్ తీసుకుని వెళ్లడు. తను బాత్రూమ్ లో నుంచి గట్టిగా అరుస్తాడు... ఒకవేళ నాకు వినకపడకపోతే బాత్రూమ్ లో నుంచి అలాగే బయటకు వచ్చి తిడతాడు.

కళ్లు ఎర్రజేస్తాడు
తను ఆఫీస్ కు వెళ్లేలోపు అన్నీ రెడీ చేసి పెట్టాలి. ఏ ఒక్కటి తక్కువైనా సరే కళ్లు ఎర్రజేస్తాడు. ఆయన ఫైల్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తాడు. ఆఫీస్ కు వెళ్లేటప్పుడు అవన్నీ నేను సర్దిపెట్టాలి. అందులో ఏదైనా ఒక్కటి మిస్ అయితే తిడతాడు. ఒకవేళ వాటిని నేను అస్సలు ముట్టుకోకుంటే కొడతాడు. అన్ని సర్ది బ్యాగులో పెట్టు అని కసురుకుంటాడు.

నసపెడతాడు
రోజంతా ఇంటి పని చేసి సాయంత్రం సీరియల్ చూద్దామని కూర్చొనేలోపే వస్తాడు. నన్ను అలా చూడగానే రోజుంతా ఇంట్లో దర్జాగా కూర్చొని టీవీ చూడడం కాదు అంటూ నసపెడతాడు. అంతవరకు నేను చేసిన పని గురించి పట్టించుకోడు.

నువ్వు నా దేవతవి
ఆయన నన్ను ప్రేమించేటప్పుడు నువ్వు నా దేవతవి అనేలా నన్ను ట్రీట్ చేసేవాడు. కానీ ఇప్పుడు మాత్రం నేను తనకు రాక్షసిలా కనపడుతున్నాను. రోజూ మాటలతోనే దొప్పిపొడుస్తుంటాడు.

ఇబ్బందులకు గురి చేయొద్దు
నా భర్తను చూసినప్పుడల్లా.. నేను ఎంతో నమ్మి నిన్నే జీవితంగా భావిస్తే ఇలా చేస్తున్నావేంటీ అని అనిపిస్తూ ఉంటుంది. ప్రేమించే సమయంలో ఒకరకంగా.. పెళ్లయ్యాక మరో రకంగా చూడడం సరికాదు. నా భర్తే కాదు.. ప్రతి అబ్బాయి కూడా మిమ్మల్ని నమ్మి వచ్చిన అమ్మాయిని ఇబ్బందులకు గురి చేయొద్దని నా సూచన.

ప్రపంచాన్నే జయించినంతగా
ప్రేమగా మీరు దగ్గరకు తీసుకుంటే ప్రపంచాన్నే జయించినంత హ్యాపీగా ఫీలవుతారు అమ్మాయిలు. మాటలతో మీరు హింసిస్తే ఆ నరకాన్ని తట్టుకోలేరు. లోలోపలే కుమిలిపోతారు.

న్నెర్రజేస్తే..
పెళ్లయ్యాక ప్రతి అమ్మాయి ప్రపంచం భర్తనే. కానీ అతనే ఆమెపై కన్నెర్రజేస్తే ఆ కష్టాల్ని తను ఎవరికి చెప్పుకుంటుంది. నువ్వు తిట్టినా.. కొట్టినా ఇంకేమీ చేసినా ఎదురుచెప్పుకుండా భరించేది నీ భార్య ఒక్కటే అని గుర్తించుకో. అలాంటి ఆమెను అనవసరంగా వేధించకు.



Click it and Unblock the Notifications