Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
నా భర్త సైకాలజిస్ట్, నాకు నచ్చని భంగిమల్లో తాను సుఖం పొందుతాడు, టార్చర్ పెడతాడు #mystory213
రాత్రి ఆ పని చేసేటప్పడు కూడా నాపై ఆధిపత్యం చెలాయిస్తాడు. తాను ఎలా చెబితే అలా అందులో పాల్గొనాలని డిమాండ్ చేస్తాడు. నాకు నచ్చని భంగిమల్లో తాను సుఖం పొందుతాడు. నాకు ఏడుపు వస్తూ ఉంటుంది. కానీ పట్టించుకోడు
నా పేరు అర్పిత. నాకు పెళ్లి అయి మూడేళ్లు అవుతుంది. మా ఆయన మొదట్లో నన్ను బాగా చూసుకునేవాడు. కొన్నాళ్లకు నా భర్త అసలు రూపం బయటపడింది. మా ఆయనకు కోపం ఎక్కువ. చూస్తే అమాయకుడిలా ఉంటాడు. ఏమీ తెలియనట్లుగా, ఏమీ ఎరగనట్లుగా కనపడతాడు.
నేను ఎంటెక్ పూర్తి చేశాను. మా ఆయన సైకాలజీలో పీజీ చేశారు. మా అత్త, మామ ఉన్నప్పుడు ఏమీ తెలియనట్లు ఉంటాడు. బెడ్రూమ్ లోకి రాగానే చిన్న విషయానికి కూడా పెద్దగా చేసి నన్ను తిడుతుంటారు. రాత్రి ఆ విషయంలో కూడా ఏదైనా నేను చిన్న పొరపాటు చేస్తే చాలు విపరీతంగా కోప్పడుతారు.

అస్కార్ లెవెల్లో నటిస్తాడు
మా అత్త, మామ వాళ్లేమో తమ కొడుకు అమాయకుడని అనుకుంటారు. నేను ఆయన గురించి ఏదైనా చెబితే వాళ్లు అస్సలు నమ్మరు. వాడు అలాంటి వాడు కాదమ్మా. చాలా నెమ్మదస్తుడు అంటారు. వాళ్ల ముందు మా ఆయన అస్కార్ లెవెల్లో నటిస్తాడు. ఇక మా అమ్మనాన్న కూడా మా ఆయన్నే నమ్ముతారు.

చులకనగా చూస్తాడు
ఇక బయటకు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లినప్పుడు మా ఆయన చేష్టలు నాకు అస్సలు నచ్చవు. నాపై కావాలని సెటైర్ వేస్తాడు. అందరి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడుతాడు. చులకనగా చూస్తాడు. ఇక మా ఆయన అప్పుడప్పుడు తాగి ఇంటికొస్తాడు. ఆ విషయం నేను తప్ప ఇంట్లో ఎవ్వరూ కనుక్కోలేరు.

పెద్ద మేధావి అన్నట్లుగా ప్రవర్తిస్తాడు
అతను తాగిన రోజు బెడ్రూమ్ లోకి రాగానే నన్ను ఏదో ఒక విషయంలో తిడుతాడు. నేను అంటే ఇష్టం ఉన్నట్లు నటిస్తాడు కానీ నేను ఎందుకు పనికిరానని ఇంట్లో కూర్చొని వంటలు చేసుకుంటూ ఉండాల్సిందేనన్నట్లుగా నన్ను ట్రీట్ చేస్తాడు. తానే పెద్ద మేధావి అన్నట్లుగా ప్రవర్తిస్తాడు.

నాకు నచ్చని భంగిమల్లో తాను సుఖం పొందుతాడు
నాకు నీ ప్రవర్తన నచ్చట్లేదు అని ఎన్నో సార్లు మా ఆయనకు చెప్పినా కూడా అస్సలు పట్టించుకోడు. ఇక రాత్రి ఆ పని చేసేటప్పడు కూడా నాపై ఆధిపత్యం చెలాయిస్తాడు. తాను ఎలా చెబితే అలా అందులో పాల్గొనాలని డిమాండ్ చేస్తాడు. నాకు నచ్చని భంగిమల్లో తాను సుఖం పొందుతాడు. నాకు ఏడుపు వస్తూ ఉంటుంది. కానీ పట్టించుకోడు. తాను భావప్రాప్తి పొందాక నన్ను అస్సలు పట్టించుకోడు. అసలు నేను దాని వల్ల సుఖం పొందానా అని కూడా చూడడు.

నా సమస్యలు అన్నీ చెప్పుకున్నా
ఒక రోజు నేను మా ఆయనకు నా సమస్యలు అన్నీ చెప్పుకున్నా. తాను అగాగే ఉంటానని, తనను మార్చాలని చూడకు అని నాకు వార్నింగ్ ఇచ్చాడు. నీకు నాపై కోపం రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలని అని అడిగితే నేను కోప్పడి తిట్టినా కూడా నువ్వు అలాగే పడి ఉండాలి. అప్పుడే నా ఈగో సాటిస్ ఫై అవుతుంది అంటాడు.

ఎవరికైనా చూపించొచ్చు కదా
నా సమస్య ఫ్రెండ్స్ కు చెబితే మీ ఆయనను ఎవరికైనా చూపించొచ్చు కదా అంటారు. మా ఆయనే ఒక సైకాలజిస్ట్. ఆయన దగ్గరకే జనాలు వివిధ సమస్యలతో వస్తుంటారు. ఈయనగారు వాటిని పరిష్కరిస్తుంటారు. అలాంటి సైకాలజిస్ట్ ను ఇంకెవ్వరి దగ్గరికి తీసుకెళ్లాలో అర్థంకాక నిత్యం నరకం చూస్తూ బతుకుతున్నాను.

సైకాలజిస్ట్ లలో కూడా సైకోలు ఉంటారు
జనాలంతా సైకాలజిస్టులు చాలా మంచివారని, వాళ్లు ప్రతి విషయంలో మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారని అనుుకుంటారు. సైకాలజిస్ట్ లలో కూడా సైకోలు ఉంటారు జాగ్రత్త. అందరూ అలాగే ఉంటారని నేను చెప్పను. కొందరు మాత్రం మేధావులుగా ఫీలవుతూ ఇతరుల్ని హింసిస్తుంటారు.



Click it and Unblock the Notifications
