For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మా ఆయన రోజూ ఆ భంగిమల్లో సంతృప్తిపరచాలనేవాడు, ఆ వీడియోలు చూపించేవాడు #mystory223

నన్ను కేవలం రాత్రి పూట దాని కోసమే వాడుకునేవాడు. నాపై ప్రేమనే ఉండేది కాదు. ఈ విషయం అజయ్ కి ఉండే ఫ్రెండ్స్ లో కొందరు అమ్మాయిలకు చెబితే వాళ్లు నమ్మలేదు. అజయ్ చాలా మంచోడు. అలా ఎందుకు చేస్తాడనేవారు.

|

మేమిద్దరం కాలేజీ రోజుల్లో నుంచి ప్రేమించుకున్నాం. అతను కాలేజీలో టాఫర్. క్రికెట్ కూడా బాగా ఆడుతాడు. నేను అతన్ని ఎప్పుడూ చూడలేదు. మాట్లాడలేదు. కానీ మా ఫ్రెండ్స్ మొత్తం కూడా అతని గురించే మాట్లాడుకునేవారు. అబ్బా.. అజయ్ ఎంత బాగుంటాడే.. ఎంత బాగా క్రికెట్ ఆడతాడే.. అజయ్ తో ఎవరూ పోటీపడలేరు.. అంటూ అతని గురించి గొప్పగా చెప్పుకునేవారు.

కొంతమంది అమ్మాయిలతో అజయ్ కు మంచి పరిచయం కూడా ఉండేది. వాళ్లంతా కూడా అజయ్ చదివిన స్కూల్ లోనే చదవడం వల్ల వారందరికీ అతనితో బాగా చనువు ఉండేది. ఒకసారి వాళ్లతో పాటు నేను కూడా ఒక ఫంక్షన్ కు వెళ్లాను. అక్కడికి అజయ్ కూడా వచ్చాడు.

ఏ అమ్మాయైనా తనకు పడిపోతుందని

ఏ అమ్మాయైనా తనకు పడిపోతుందని

ఆ రోజు నన్ను చూసి ఫ్లాట్ అయిపోయాడు. తన ఫ్రెండ్స్ ను అడిగి నా వివరాలు తెలుసుకున్నాడు. ఎలా అయిన సరే నన్ను లైన్లో పెట్టాలనుకున్నాడు. అందరికీ అజయ్ గ్రేట్ కావొచ్చు కానీ నాకు అతను అంతగా నచ్చలేదు. అతని ప్రవర్తన చాలా భిన్నంగా ఉండేది. కాలేజీ మొత్తానికి తనే ఒక హీరోనని అనుకునేవాడు. తను కావాలనుకుంటే ఏ అమ్మాయైనా తనకు పడిపోతుందని భావించేవాడు.

ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలి

ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలి

నేను కాలేజీలో చాలా సైలెంట్ గా ఉండేదాన్ని. ఒక రోజు తన ఫ్రెండ్స్ తో నా గురించి చర్చించాడు. మీరందరూ ఏం చేస్తారో తెలియదు... ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలి అని వాళ్లను అడిగాడు. వాళ్లంతా కలిసి నాకు అసలు విషయం చెప్పారు. నేను ఒప్పుకోలేదు. చాలా రోజులు నా చుట్టూ తిరిగాడు. అజయ్ ఫ్రెండ్స్ అంతా నన్ను తిట్టుకోవడం మొదలుపెట్టారు. కొందరు అమ్మాయిలు నన్ను బెదిరించారు కూడా.

బలవంతంగా ఒప్పుకున్నా

బలవంతంగా ఒప్పుకున్నా

అజయ్ లాంటి వాడు నీకు ప్రపోజ్ చేయడమే గ్రేట్. అతని ప్రపోజల్ ను నువ్వు అంగీకరించకపోతే అది నీ బ్యాడ్ లక్ అంటూ సూటి పోటి మాటలు మాట్లాడారు. దీంతో బలవంతంగా అజయ్ ప్రేమను ఒప్పుకున్నా. కాలేజీలోని అమ్మాయిలంతా ఇష్టపడే అతను.. నన్ను ప్రేమించడం నేను కాస్త ప్రౌడ్ గా ఫీలయ్యేదాన్ని.

చాలా రోజులు ప్రేమాయాణం

చాలా రోజులు ప్రేమాయాణం

తర్వాత ఇద్దరం చాలా రోజులు మా ప్రేమాయాణం సాగించాం. ఇద్దరం ఒకే చోట ఎంటెక్ చేశాం. అజయ్ కి ఈగో ఎక్కువ. మా ఇద్దరి మధ్య ఏ గొడవ వచ్చినా నేను సారీ చెప్పాలి. తను అస్సలు చెప్పేవాడు కాదు. అతన్ని భరించడం కాస్త కష్టంగానే ఉండేది. బయట జనాలకంతా అతను చాలా మంచివాడు. కానీ అతని నిజ స్వరూపం నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు.

ప్రేమ పెళ్లి చేసుకున్నాం

ప్రేమ పెళ్లి చేసుకున్నాం

మొత్తానికి మేమిద్దరం ప్రేమ పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లికి మా ఇంట్లో వాళ్లు అస్సలు అంగీకరించలేదు. మా నాన్నను అజయ్ నానా బూతులు తిట్టాడు. అలా ఎందుకన్నాని నేను నిలదీస్తే.. నీ కోసమే అని అన్నాడు. అజయ్ ప్రవర్తన చూస్తే భయం వేసేది. ఆ రోజు మా ఫస్ట్ నైట్.

వీడియోలు చూస్తూ ఉన్నాడు

వీడియోలు చూస్తూ ఉన్నాడు

అజయ్ నేను రూమ్ లోకి వెళ్లలోపే తన ఫోన్ లో ఏవో వీడియోలు చూస్తూ ఉన్నాడు. నేను వెళ్లగానే ఇయర్ ఫోన్స్ నాకిచ్చాడు. వాటిని బలవంతంగా నా చెవిలో పెట్టి ఆ వీడియో చూపించాడు. నేను ఎప్పుడూ కూడా అలాంటి వీడియోలు చూడలేదు. అసలు నాకు అలాంటి వీడియోలుంటాయని కూడా తెలియదు.

అలా అరుచు అని పట్టుబట్టాడు

అలా అరుచు అని పట్టుబట్టాడు

నేను అలాంటివి చూడను అని చెప్పాను. కానీ అజయ్ ఒప్పుకోలేదు. బలవంతంగా చూపించాడు. నాకు భయం వేసింది. తర్వాత మనిద్దరం కూడా అలాగే చేసుకుందాం అన్నాడు. నేను అంగీకరించలేదు. ఆయన వినలేదు. అందులో ఎలా అయితే సౌండ్స్ చేస్తారో అలా అరుచు అని పట్టుబట్టాడు. నాకు అస్సలు ఫీలింగ్స్ రావడం లేదు. వణికిపోతున్నాను. అయినా క్రూరంగా వివిధ భంగిమల్లో తన కోరిక తీర్చుకున్నాడు.

రాత్రి పూట దాని కోసమే వాడుకునేవాడు

రాత్రి పూట దాని కోసమే వాడుకునేవాడు

రోజూ పలు భంగిమల్లో అందులో పాల్గొనాలనేవాడు. నా శరీరం కొన్ని భంగిమలకు అస్సలు సహకరించేది కాదు. కానీ ఆయన పట్టబట్టీ మరీ కోరిక తీర్చుకునే వాడు. ఇలా కొన్ని రోజుల గడిచాక నాకు అజయ్ పై విరక్తి పుట్టింది. నన్ను కేవలం రాత్రి పూట దాని కోసమే వాడుకునేవాడు. నాపై ప్రేమనే ఉండేది కాదు. ఈ విషయం అజయ్ కి ఉండే ఫ్రెండ్స్ లో కొందరు అమ్మాయిలకు చెబితే వాళ్లు నమ్మలేదు. అజయ్ చాలా మంచోడు. అలా ఎందుకు చేస్తాడనేవారు.

సిమ్ తీసి పడేశాను

సిమ్ తీసి పడేశాను

తర్వాత మా అమ్మనాన్నలకు అసలు విషయం చెప్పాను. ఏడ్చాను. వాళ్లు నా బాధ అర్థం చేసుకున్నారు. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా వచ్చేయమన్నారు. నాకు సంబంధించిన సర్టిఫికెట్స్, బట్టలు బ్యాగ్ లో సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయాను. బస్సు ఎక్కాక నేను వెళ్తున్నట్లు మెసేజ్ పంపాను. తర్వాత సిమ్ తీసి పడేశాను. బస్సులో వెళ్తుంటే ఏవేవో గుర్తొచ్చాయి.

ఇద్దరం కలిసి ఎన్నో రోజులుగా ప్రేమించుకున్నాం. నాతో క్షణం మాట్లాడకుంటే ఏదో కోల్పొయినట్లు భావించే అజయ్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడనుకున్నా. కాలేజీ రోజులు తలుచుకుని ఏడ్చాను.

నాతో రోజూ బలవంతంగానే అందులో పాల్గొన్నాడు

నాతో రోజూ బలవంతంగానే అందులో పాల్గొన్నాడు

పెళ్లాయ్యాక అజయ్ నాతో రోజూ బలవంతంగానే అందులో పాల్గొన్నాడు. నేను అంగీకరించకపోతే కొట్టేవాడు. తిట్టేవాడు. ఎందుకిలా మారాడో అర్థం కాలేదు. నేను ఏదైనా ఎదురుచెబితే నువ్వు నన్ను ప్రేమించడం లేదు అందుకే నేను అడినట్లు నాకు సహకరించడం లేదు అనేవాడు. పెళ్లయిన రెండు నెలల్లోనే కొన్ని వందల సార్లు అతనికి విడాకులు ఇవ్వాలని నాకు అనిపించింది.

నన్ను సంతృప్తిపరచాలనేవాడు

నన్ను సంతృప్తిపరచాలనేవాడు

నేను అతన్ని సంతృప్తిపరచాలని పట్టుబట్టేవాడు. లేదంటే బయట మరో అమ్మాయిని చూసుకుంటా అనేవాడు. నీకు నన్ను సుఖ పెట్టడం కూడా రావడం లేదు.... అని ఆ వీడియోలు చూపించేవాడు. అందులో ఎలా చేసుకుంటున్నారో చూడు.. అలాగే నువ్వు కూడా నన్ను సంతృప్తిపరచాలనేవాడు. చాలా రోజులు భరించి ఓపిక పోయి పుట్టింటికి వచ్చేశా.

బాగా చూసుకుంటానని మాటిచ్చి

బాగా చూసుకుంటానని మాటిచ్చి

కానీ సమాజం నన్ను తప్పుగా అర్థం చేసుకుంది. కొందరు నాపై జాలి చూపితే కొందరు నన్ను నానా మాటలు మాట్లాడారు. అజయ్ మా ఇంటికి వచ్చి నన్ను బాగా చూసుకుంటానని మాటిచ్చి తీసుకెళ్లిపోయాడు. మళ్లీ అజయ్ దగ్గరకు వెళ్లాను. అతనిలో ఏ మార్పు రాలేదు. ఇంకా ఎక్కువ టార్చర్ చేయడం మొదలుపెట్టాడు.

విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నా

విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నా

విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నా. తర్వాత నా జీవితంలోకి వచ్చే వ్యక్తి మాత్రం ఇలాంటి వాడు కాకూడదని కోరుకుంటున్నాను. సర్దుకుపోయి జీవితాంతం ఇలా సంసారం చేసుకునేకంటే నేను స్వతంత్ర్యంగా బతకాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను.

English summary

my husband tortures me physically night after night the torture grew

my husband tortures me physically night after night the torture grew
Desktop Bottom Promotion