Latest Updates
-
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
కన్యా రాశిలోకి చంద్రుడు: ఈ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే, పనుల్లో వేగం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ధనలాభం ఖాయం! - సోమవారం, 27 ఏప్రిల్ 2026 -
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? -
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్‌లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! -
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ!
చెయ్యి పట్టుకొని దగ్గరకు లాక్కున్నా, పక్కకి తీసుకెళ్లి ముద్దు పెట్టా, నేనుకున్న పని పూర్తి చేశా
ఏంటి అంది. నువ్వుంటే నాకిష్టం అన్నాను. తర్వాత పక్కకు తీసుకెళ్లి ముద్దు పెట్టా. ఏమీ అనలేదు. అయినా ఇప్పుడీ ప్రేమా గీమా అవసరమా అంది. తెలుగు ప్రేమ కథలు, రొమాంటిక్ స్టోరీలు
మేమందరం మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాం. అక్కడ నాకు ఒక అందమైన అమ్మాయి కనపడింది. చూడగానే మతిపోయింది. పెళ్లి తర్వాత తను మళ్లీ కనపడుతుందని నేను అనుకోలేదు. కానీ ఆమెను మళ్లీ చూశాను. ఆ రోజు పెళ్లిలో చూసినప్పట్నుంచీ నేను ఆమె గురించే ఆలోచించేవాణ్ని.
ఆమె మళ్లీ కనిపించదన్న ఆలోచనే నా మదిలో ఉండేది. కొన్నాళ్లకు తను కనిపించింది. నేను వెళ్తున్న బస్సు ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళుతోన్న ఒక కాలేజీ బస్సులో ఆమె కనిపించింది. ఆమె నన్నే చూస్తూ ఉండిపోయింది. రెండు బస్సులు ఒక్కసారి ఆగిపోతే తనను ఒక్కసారి పలకరించి వద్దామనుకున్నాను. కానీ కుదురలేదు.

చూపు తిప్పుకోలేకపోయాను
ఆ రోజు ఆమె నుంచి చూపు తిప్పుకోలేకపోయాను. కొన్ని క్షణాల్లో బస్సులు రెండు ఆయా రూట్లలో ముందుకెళ్లిపోయాయి. ఇద్దం మళ్లీ దూరమైపోయాం. ఆమె ఎక్కడుంటుందో ఎలాగైనా కనిపెట్టి తీరాలి అనుకున్నాను.

ఇంజనీరింగ్ స్టూడెంట్
కాలేజీ బస్సుపై పేరు ఉండండంతో తను ఇంజనీరింగ్ స్టూడెంట్ అని తెలిసింది. ఆ విషయం తప్ప నాకు ఇంకేం తెలీదు. ఈ విషయాన్ని నా ఫ్రెండ్స్ కు కూడా చెప్పాను.
వాళ్లు కనిపెట్టారు.

అన్నీ రౌండ్లు వేసేవాణ్ని
తర్వాత ఆమె వెంటపడడాన్ని నేను డైలీ రొటీన్‌గా మార్చేసుకున్నాను. ఆమె బస్ ఎక్కే ప్లేస్, ఇల్లు.. అన్నీ రౌండ్లు వేసేవాణ్ని. నేను అలా వెంటపడ్డాన్ని ఆమె ఎంజాయ్ చేస్తోంది అని అనిపించింది.

పేరు ఏంటీ
ఒకరోజు ఆమె బస్సుల్లో కాలేజీకి వెళ్లేందుకు బస్టాప్ కు వచ్చింది. నేను వెళ్లి ఆమెకు దగ్గరగా వెళ్లి నిలబడ్డాను. ఆరు రోజుల తర్వాత నేను ఆమెకు దగ్గరగా వెళ్లి కలిశాను. పేరు ఏంటీ అని అడిగాను. చెప్పను అంది.

చెప్పొచ్చు కదా
చెప్పొచ్చు కదా అన్నాను. అయినా చెప్పను అంది. సరే నువ్వంటే నాకిష్టం లేదు. నీమీద ఆశ పడటం లేదు. నువ్వు అందగత్తెవు అనుకోవడం లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమో అని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు అన్నాను. అంతలోనే బస్సు వచ్చింది.
అక్కణ్నుంచి వచ్చేశాను.

ఒకే అర్జున్ గారు
ఒక రోజు ఆమె కాలేజీకి వెళ్లాను. ఇక్కడ కూడా వచ్చిపడ్డాడు అనుకుంటూ ఆమె నాకు దగ్గరగా వచ్చింది. అసలు నీ పేరేంటీ? నువ్వు ఎందుకు నా వెంటపడుతున్నావ్ అంది. నా పేరు అర్జున్. ఒకే అర్జున్ గారు... మీకు ఏమీ పని లేనట్లుంది.. అందుకే నా వెంట పడుతున్నావ్.. కానీ నాకు మాత్రం చాలా పనులున్నాయంది.

పని లేని వాళ్లే
నీలా పని లేని వాళ్లే బుద్ధిలేకుండా అన్నీ వదిలేసి ఇలా అమ్మాయిల వెంటపడుతుంటారు.. అని వెళ్లిపోతూంటే, ఏయ్! అన్నాను. తను చిన్నగా నవ్వుతూ ఆ పిలుపుకి వెనక్కి తిరిగింది.

ఫోన్ నంబర్ కనుక్కున్నా
హేయ్.. నువ్వు నన్ను చూసి నవ్వావు అంటూ గట్టిగా అరిచాను. తర్వాత ఆమె ఫోన్ నంబర్ కనుక్కున్నా. ఫోన్ చేశాను. తను ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో! అనేలోపే... ఏయ్.. నంబర్ ఎలా తెలిసిందీ అంది. నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను అన్నాను.

మా కజిన్ పెళ్లి ఉంది
చెప్పేంటి విషయం అంది. రేపు మా కజిన్ పెళ్లి ఉంది అన్నాను. అయితే? ఏంటి అంది. నువ్వు ఆ పెళ్లికి రావాలి అన్నాను. నేనా? ఎందుకు? అంది.
నేన్నిన్ను పబ్ కు రమ్మనలేదు. పార్క్‌కు రమ్మనలేదు. పెళ్లికే రమ్మందీ అన్నాను. నేనెందుకు రావాలి అంది. నువ్వు రాకపోతే రేపు నేనే మీ ఇంటికి వస్తాను అన్నాను.

ఇంటికి బయల్దేరింది
అడ్రెస్ చెప్పేసి ఫోన్ కట్ చేశాను. మరుసటి రోజు తను ఫంక్షన్‌కు వచ్చింది. రాగానే తను నన్ను పలకరించింది. నా చుట్టూ ఉన్న వాళ్లంతా ఎవర్రా ఆ అమ్మాయి? అన్నారు. తనే నేను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి అన్నాను. ఫంక్షన్ అయిపోయింది. తను తిరిగి ఇంటికి బయల్దేరింది. నేను తనని క్యాబ్ వరకు డ్రాప్ చేయడానికి వెళ్లాను.

పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా
అసలు నువ్వెందుకలా అన్నావ్ అని కోప్పడింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావని చెప్పలేదే.. నేను చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పాను కదా అన్నాను. సరే అయినా ఏమిటిది పెళ్లీ గిల్లీ అనీ నన్ను ఇబ్బంది పెడుతున్నావ్ అంది. తను చెయ్యి పట్టుకొని ఆమెను దగ్గరకు లాక్కున్నా.. ఏయ్ నీకొకటి చెప్పనా అన్నాను.

రిజిస్ట్రర్ మ్యారేజ్
ఏంటి అంది. నువ్వుంటే నాకిష్టం అన్నాను. తర్వాత పక్కకు తీసుకెళ్లి ముద్దు పెట్టా. ఏమీ అనలేదు. అయినా ఇప్పుడీ ప్రేమా గీమా అవసరమా అంది. ఇంకా మా అక్కకు పెళ్లి కాలేదు అంది. నాకవన్నీ అవనసరం మనం పెళ్లి చేసుకుందాం అన్నాను. మా ఇద్దరి ఇళ్లలోనూ పెళ్లికి ఒప్పుకోలేదు. చివరకు నేను అనుకున్న పని పూర్తి చేశాను. మేమిద్దరం రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నాం. మా లైఫ్ ఫుల్ హ్యాపీగా ఉంది. కానీ మేమిద్దరం కుటుంబాలకు దూరం అయినా విషయంలోనే నాకు ఎప్పుడూ బాధ కలుగుతూ ఉంటుంది.



Click it and Unblock the Notifications