For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాశ్మీర్ లో మా కలయికను మరిచిపోలేను, ఆ రాత్రి స్వర్గం అంచుల దాకా వెళ్లొచ్చాం #mystory189

ప్రకృతి అందాలకు ఆలవాలం కాశ్మీర్. పచ్చని చెట్లు, మనస్సుకు ఆనందాన్ని నింపే ప్రకృతి రమణీయతకు ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే.

|

నాకు చిన్నప్పటి నుంచి జర్నీలు చేయడం అంటే బాగా ఇష్టం. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలు చూడడానికి మా అమ్మనాన్నలతో కలిసి వెళ్లేదాన్ని. ఇక పెళ్లి అయ్యాక మా ఆయనతో కలిసి ఏదైనా మంచి ప్లేస్ కు ట్రిప్ ప్లాన్ చేయాలని అనుకునేదాన్ని.
అందుకు కశ్మీర్‌ వెళ్లాలని డిసైడ్ అయ్యాను.

నాది విజయవాడ. మా ఆయనది వైజాగ్. ఇక మేమిద్దరం విజయవాడ నుంచే జమ్మూ వెళ్లాలనుకున్నాం. న్యూఢిల్లీ మీదుగా జమ్మూ చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే మేం ట్రైన్‌లో వెళ్లాలని డిసైడ్ అయ్యాం. తర్వాత మా ప్రయాణం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ఢిల్లీ, పంజాబ్‌ మీదుగా సాగింది.

ధవళవర్ణంలో మెరుస్తుంటాయి

ధవళవర్ణంలో మెరుస్తుంటాయి

దట్టమైన మంచు కొండలు, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు, బౌద్ధ ఆరామాలు, ఎత్తైన రోడ్డు మార్గాలు, కొన ఒంపుల రైలు ప్రయాణాలు ఇవి కాశ్మీర్ అందాలు. పర్వతాల మధ్య నుండి కాశ్మీర్‌ లోయ అందాల వీక్షణం సందర్శకులను మరో ప్రపంచానికి తీసుకెళుతుంది. పచ్చిక బయళ్లు.. ఎత్తైన కొండలు.. ఆహ్లాదకర వాతావరణంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులను ఆకట్టుకుంటుంది జమ్ముకశ్మీర్‌. ఎటువైపు చూసిన మంచు అందాలు కళ్లకు కనువిందు చేస్తాయి. రహదారులు.. చెట్లు.. పర్వతాలన్నీ భారీగా మంచుతో నిండిపోయి ధవళవర్ణంలో మెరుస్తుంటాయి.

రైలులో వెళ్తుంటే ఆ ఆనందం చెప్పలేం

రైలులో వెళ్తుంటే ఆ ఆనందం చెప్పలేం

ప్రకృతి అందాలకు ఆలవాలం కాశ్మీర్. పచ్చని చెట్లు, మనస్సుకు ఆనందాన్ని నింపే ప్రకృతి రమణీయతకు ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే. అందుకే కాశ్మీర్ అందాల గురించి ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది. ఓ వైపు యాపిల్‌ తోటలు.. మరోవైపు మంచుతో నిండిపోయిన పర్వతాల మధ్య రైలులో వెళ్తుంటే ఆ ఆనందం చెప్పలేం.

హోటల్ లో రూమ్ బుక్

హోటల్ లో రూమ్ బుక్

ఇక మేము జమ్మూకు వెళ్లి అక్కడ స్టే చేసేందుకు ముందుగానే ఒక పెద్ద హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నాం. మొదట మేము

జమ్మూనగరానికి వెళ్లాం. మేము కొన్ని ప్లేస్ లు చూసేందుకు 'ప్రిపెయిడ్‌ బూత్‌ ద్వారా ట్యాక్సీ బుక్ చేసుకున్నాం. అలా వారం రోజులకు ఒకటే వెహికల్‌ మాట్లాడుకున్నాం.

భలే గమ్మత్తుగా అనిపించింది

భలే గమ్మత్తుగా అనిపించింది

మొదట మేము రఘునాథ దేవాలయాన్ని చూశాం. ఆలయం బయట వెదురుతో చేసిన రకరకాల వస్తువులు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించాయి. బోట్‌ షికారుకు అనుగుణంగా సరస్సు ఉంటుంది. పక్కనే 20 రూపాయల ఫీజుతో చేపల మ్యూజియం, అక్వేరియం ఉంటుంది. వివిధ రకాల చేపలు ఒకేచోట చూసేసరికి భలే గమ్మత్తుగా అనిపించింది. అడుగడుగునా సెక్యూరిటీ, ఏ వస్తువునూ వెంట తీసుకెళ్లనీయరు.

మనసును కట్టిపడేస్తుంది

మనసును కట్టిపడేస్తుంది

ప్రధాన రైలు మార్గంలోనున్న స్టేషన్‌ కాత్రా. ఉత్తర భారతీయులందరూ ఉత్సాహం చూపే ప్రాంతం ఇది. మత విశ్వాసాన్ని పక్కన పెడితే ''త్రికూట'' పర్వతాల మధ్య 13 కి.మీ ట్రెక్కింగ్‌.. ఎక్కడా ప్లాస్టిక్‌ కన్పించని అత్యంత పరిశుభ్ర వాతావరణం...హెలికాప్టర్‌, డోలీ, నడక....ఎవరి సౌకర్యం వారిది... ప్రకృతి ఒడిలో పరవశమై, అలసట తెలియని నడక ప్రయాణం వైష్టోదేవి ఆలయాన్ని చేరుకోవచ్చు. ప్రాచీన ఆలయ నిర్మాణం ఆద్యంతం మనసును కట్టిపడే స్తుందంటే నమ్మండి.

జమ్మూ నుంచి శ్రీనగర్‌

జమ్మూ నుంచి శ్రీనగర్‌

కాశ్మీర్‌లోయ చాలా బాగుంటుంది. దాన్ని చూస్తూ ఎవరైనా సరే మైమరిచిపోవాల్సిందే. జమ్మూ నుంచి మేము శ్రీనగర్‌కి బయల్దేరాం. ఆ ప్రయాణం. మరో ప్రకృతి ప్రపంచానికి స్వాగత హారం. అసలు, సిసలైన కాశ్మీరు దర్శనం ఈ ఘాట్‌ రోడ్‌లోనే ప్రత్యక్షమవుతుంది. ఎత్తయిన దేవ దారు వృక్షాలు, లోతైన లోయలు, నిర్మలమైన నీటి ప్రవాహాలు... కాలుష్యమన్నదే ఎరుగని కాసారాలు... రాళ్లు బండరాళ్లు సరాగాల జంటల్లా...వింత వింత ఆకృతుల్లో ఎక్కడెక్కడో విసిరేసినట్లు కనిపించే ఇళ్ళు..! ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి.

చిన్న డాబాలు

చిన్న డాబాలు

అంతేకాదు ఇక్కడి ప్రజలు అసలు సిసలైన కష్టజీవులు. ప్రతి ఆహారపదార్థం జమ్మూ నుంచీ లారీలలో రవాణా జరగాల్సిందే.. అందుకే ఘాట్‌రోడ్డంతా లారీలు, శాంతి భద్రతలు కాపాడే రక్షకభటుల వాహానాలు...దారిలో అక్కడక్కడా చిన్న డాబాలు కనిపిస్తుంటాయి. రాజ్‌మా, మేకనెయ్యి, బాస్మతి బియ్యంతో చిన్న చిన్న ప్లేట్లలో భోజనం నిత్యం అందుబాటులో ఉంటుంది.

శ్రీనగర్‌లో ప్రవేశించాం

శ్రీనగర్‌లో ప్రవేశించాం

దారంతా గోధుమ పొలాలు.. తారుడబ్బాలపై, గోధుమకంకులను కొడుతూ స్త్రీలు, గ్రేడింగ్‌ ఆధారంగా రోడ్డు పక్కన కుప్పలు కుప్పలుగా పోసి అమ్మే యాపిల్స్‌ మమ్మల్ని భలే ఆకర్షించాయి. దారిలో పాట్నీటాప్‌... దగ్గర అమరనాథ్‌ యాత్రకు దారి, శ్రీనగర్‌కి దారి చీలుతుంది. మొత్తానికి అలా శ్రీనగర్‌లో ప్రవేశించాం. అప్పటికే రాత్రి అయ్యింది. అక్కడ చల్లనిగాలి సాదర ఆహ్వానం పలికింది. అక్కడే హోటలోని రూమ్‌లో నేను, మా ఆయన మొదట కునుకు తీశాం.

ఒక్క ముద్దు కూడా పెట్టుకోకుంటే

ఒక్క ముద్దు కూడా పెట్టుకోకుంటే

రాత్రి పది గంటల తర్వాత ఇద్దరం లేచాం. మా ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నాడు. ఇంత అందమైన వాతావరణంలో నా అందమైన భార్యను ఒక్క ముద్దు కూడా పెట్టుకోకుంటే చాలా తప్పు కదా అన్నాడు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ నేను బిగి కౌగిళ్లలో ఒదిగిపోయాను.

స్వర్గం అంచుల దాకా

స్వర్గం అంచుల దాకా

ప్రయాణంలో పడి మేము ఆ పని మరిచిపోయాం. ఇద్దరం కాసేపు స్వర్గం అంచుల దాకా వెళ్లి వచ్చాం. పెళ్లి అయ్యాక నాకు, మా ఆయనకు మధ్య ఎన్నో కలుయికలు జరిగినా ఆ కలయికను మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను. ఆ రాత్రి మేమిద్దరం స్వర్గం అంచుల దాకా వెళ్లొచ్చాం.

గుర్రంపై గుల్మార్గ్‌ లోయ మొత్తం షికార్‌

గుర్రంపై గుల్మార్గ్‌ లోయ మొత్తం షికార్‌

ఇక మరుసటి రోజు గుల్మార్గ్‌ వెళ్ళేందుకు బయలుదేరాం. దారిపొడవునా ఎన్నో ఇళ్లు, కానీ మనుషుల్లేరు. వలసపోయారంట. శిథిలావస్థలో ఉన్న అందమైన కట్టడాలను తిలకించాం. అత్యంత పురాతనమైన చర్చి, ట్రీ హుమస్‌, ట్రీ హోటల్‌, గుర్రంపై గుల్మార్గ్‌ లోయ మొత్తం షికార్‌, జవహర్‌లాల్‌ మేంటనీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌, స్క్రీయింగ్‌ ఇనిస్టిట్యూట్‌, ప్రపంచంలో అత్యంత పెద్ద గోల్ఫ్‌ కోర్టుతోపాటు ఇక్కడి లోయంతా నివాసాలతో నిండిపోయినట్లు దర్శనమిచ్చింది.

ప్రకృతి అందాలను వదిలిపెట్టి

ప్రకృతి అందాలను వదిలిపెట్టి

అక్కడి ప్రకృతి అందాలను వదిలిపెట్టి రావాలనిపించక పోయినా అతి కష్టంగా వచ్చామనే చెప్పాలి. శ్రీనగర్‌ చేరుకుని, దాల్‌లౌక్‌లో బోట్‌ హేస్‌లో ఒకరోజున్నాం. ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం. ఆ సాయంత్రం మొఘల్‌ గార్డెన్స్‌లో ''తులిప్‌ తోటల సౌందర్యం'' చూశాం.

యాపిల్స్‌ తప్ప మరేం కన్పించలేదు

యాపిల్స్‌ తప్ప మరేం కన్పించలేదు

శ్రీనగర్ లో కనీసం పదిరోజులు ఉండేట్లు ముందుగానే ప్లాన్‌ చేసుకున్నాం. మేము అక్కడ నుంచే కార్గిల్‌, లేహా లఢక్‌ ప్రాంతాలు దర్శించాం. హై ఎలెర్టెట్‌ ప్రాంతమవడం వలన వెహికల్‌ లో చాలా తక్కువ వేగంతో వెళ్లాలి. అక్కడ అంతటా టమాట, బంగాళదుంప, యాపిల్స్‌ తప్ప మరేం కన్పించలేదు.

మనదేశంలోనే ఒక స్వర్గం

మనదేశంలోనే ఒక స్వర్గం

అందమైన ఆ లోయలో జీవితం అడుగడుగునా మాకు ఆహ్లాదాన్ని పంచినా, తెరవెనుక స్థానిక సమస్యలు అనేకం. అలాంటి సుఖదు:ఖాల సమ్మేళనాన్ని కళ్ళారా చూడాలంటే మీరు కాశ్మీర్‌ వెళ్ళాల్సిందే మరి. అయితే కాశ్మీర దర్శనం కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ జీవితంలో ఒక్కసారైనా జంటగా కాశ్మీర్ కు వెళ్లి అక్కడి అందాలను చూడాలి. మనదేశంలోనే ఒక స్వర్గం ఉందని నాకు కాశ్మీర్ చూశాక తెలిసింది.

English summary

my unforgettable trip to kashmir

my unforgettable trip to kashmir
Story first published:Monday, June 11, 2018, 16:20 [IST]
Desktop Bottom Promotion