Just In
- 5 hrs ago
పురుషుల్లో ప్రారంభంలోనే స్ఖలనం? నయం చేయడానికి చిట్కాలు!
- 7 hrs ago
అత్యాచారానికి పాల్పడిన వారిపై అత్యంత క్రూరమైన శిక్షలు వేసే దేశాలివే..
- 8 hrs ago
మీరు ఎంత టెన్షన్ లో ఉన్నా..వీటిలో ఒక్కటి తినండి చాలు..మీ టెన్షన్ మాయం..!!
- 9 hrs ago
వివాహానికి ముందు ఈ చిట్కాలు పాటించండి... ఒత్తిడికి గుడ్ బై చెప్పండి...
Don't Miss
- News
Disha case encounter: అందుకే ఎన్కౌంటర్ చేయగలిగారు: ఆయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు
- Sports
తొలి టీ20 టీమిండియాదే: కోహ్లీ 94 నాటౌట్, మూడు టీ20ల సిరిస్లో 1-0 ఆధిక్యం
- Finance
కుబేరులనూ వదలని ఆర్థిక మాంద్యం: బిజినెస్ జెట్స్ కు గుడ్ బై!
- Movies
అలాంటి కామెంట్లు పెట్టారో అంతే సంగతి.. వారికి థ్యాంక్స్ చెప్పిన అనసూయ, చిన్మయి
- Technology
5జీ కోసం జియో,ఫ్లిప్కార్ట్,అమెజాన్లతో జట్టుకట్టిన క్వాల్కామ్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
వేరే వాళ్లతో పిల్లల్ని కని తండ్రివి నువ్వేనని చెబుతా, నువ్వు మగాడివేనా, పుట్టించలేవా? #mystory313
ఎవ్వరి మనస్సును నొప్పించకూడదనే మనసత్వం నాది. అందుకే నన్ను అవతలి వ్యక్తులు ఒక మాట అన్నా కూడా నేను ఏమీ అనను. చాలా సందర్భాల్లో నా ఫ్రెండ్సే నన్ను బండబూతులు తిట్టారు. కానీ నేను వెంటనే వాళ్లతో గొడవపెట్టుకోలేదు.
తర్వాత మళ్లీ వాళ్లే తప్పును తెలుసుకుని ఫోన్ చేసి క్షమాపనలు చెప్పేవారు. నావల్ల ఒకరికి ఇబ్బంది తలెత్తకూడదనేది నా అభిప్రాయం. నేను బయట ఎలా ఉంటానో ఇంట్లో కూడా అలాగే ఉంటాను.

ఇబ్బందిపెట్టకూడదని
నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. తనను ఎప్పుడు కూడా ఇబ్బందిపెట్టకూడదని అనుకుంటూ ఉంటాను. కానీ నా భార్య మాత్రం నన్ను అస్సలు అర్థం చేసుకోదు. నన్ను ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటుంది.

బూతులు తిట్టినా
పెళ్లయిన కొత్తలో నా గురించి తెలియక కొన్నాళ్లు తను సైలెంట్ గా ఉంది. తర్వాత తనకు నా క్యారెక్టర్ తెలిసింది. నేను ఎవరేమీ అన్నా కూడా పట్టించుకోనని బూతులు తిట్టినా పెద్దగా కేర్ చేయనని ఆమెకు తెలిసింది.

ఆడుకోవడం మొదలుపెట్టింది
దాన్ని ఆసరాగా తీసుకుని నా భార్య కూడా నన్ను ఆడుకోవడం మొదలుపెట్టింది. నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది. అయినా తన తప్పు తనే తెలుసుకుంటుందని నేను కూడా ఏమీ అనేవాణ్ని కాదు.

నోటికొచ్చినట్లు తిట్టింది
మాకు పెళ్లయి మూడేళ్లు అవుతుంది. ఇంత వరకు పిల్లలు లేరు. ఇక పిల్లల విషయంలో నా భార్య నన్ను దారుణంగా టార్చర్ చేసేది. నీ వల్లే మనకు పిల్లలు పుట్టడం లేదంటూ నన్ను నోటికొచ్చినట్లు తిట్టింది.

వేరే వాళ్లతో పిల్లల్ని కంటాను
అసలు నువ్వు మగాడివేనా, నిన్ను నమ్ముకుంటే నాకు ఈ జన్మలో పిల్లలు పుట్టేటట్లులేరు. ఎవరినో ఒకర్ని చూసుకుని వాళ్లతో కాపురం చేసి పిల్లల్ని కని వారికి తండ్రివి నువ్వేనని చెప్పాల్సి వస్తుందేమో అంది.

ఆక్రోశం అంతా బయటకు
ఆ మాటకు నాకు కోపం వచ్చింది. ఎన్నో రోజులుగా నా నరనరాల్లో గూడుకట్టుకున్న ఆక్రోశం అంతా బయటకు వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ నా భార్యపై కోప్పడ్డాను.

ఏం జరిగిందో నీకు తెలుసా
" కొన్ని రోజుల క్రితం మనమిద్దరం పిల్లలు పుట్టడం లేదని డాక్టర్ వద్దకు వెళ్లాం. అప్పుడు డాక్టర్ కొన్నాళ్లకు మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని మనకు చెప్పాడు. కానీ అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో నీకు తెలుసా?"

నీలోనే లోపం
" నీ భార్యకు సరిగ్గా అండాలు విడుదల కాకపోవడం వల్ల మీకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉందని డాక్టర్ చెప్పాడు. మీకు భవిష్యత్తులో పిల్లలు పుడతారో లేదోనని సందేహం వ్యక్తం చేశాడు. అయినా నేనేమీ బాధపడలేదు.

నా భార్యనే చంటిపాప
"నా భార్యనే నాకు ఒక చంటిపాప.. తననే జీవితాంతం చూసుకుంటూ బతుకుతానని డాక్టర్ కు చెప్పాను. ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఈ కాలంలో కూడా నీలాంటి వారున్నారంటే నమ్మలేకపోతున్నాను అన్నాడు." అని స్టోరీ మొత్తం చెప్పే సరికి నా భార్య కన్నీళ్లు పెట్టుకుంది.

నోటికొచ్చినట్లు మాట్లాడతారు
చాలా మంది భార్యలు భర్తల్ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. భర్తలు భార్యలకు తెలియకుండా అన్ని బాధలను వారి గుండెల్లో పెట్టుకుని భరిస్తుంటారు. నాలాగా.