For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా భార్య రాత్రి నా పక్కన పడుకోదు, పెళ్లికి ముందే ఇంకొకరితో సంబంధం, రోజూ నరకం - #mystory185

భార్య నన్ను రోజూ ఏదో ఒక విషయంలో టార్చర్ చేస్తూ ఉంటుంది. వాస్తవానికి భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని ఉంటాడని భార్య అనుమానిస్తుంటుంది.భార్య వేధింపులు, భర్త వేధింపులు, భర్తను హత్య చేసిన భార్య

|

నాది పెద్దలు కుదిర్చిన వివాహం. సాధారణంగా పెళ్లయిన తర్వాత భర్తల చేతిలో భార్యలు ఇబ్బందులుపడి వారి కష్టాలను పక్కవారితో చెప్పుకుంటూ ఉంటారు. కానీ నా భార్య వల్ల నేను రోజూ ఇబ్బందులుపడుతున్నారు. భర్తల చేతుల్లో బాధలు పడుతున్న భార్యల ఉదంతాలు మనం నిత్యం చూస్తూనే ఉంటా. అయితే భార్య చేతుల్లో యాతన పడుతున్న భర్తలు ఉన్నారని నాకు ఈ మధ్యే తెలిసింది.

టార్చర్ చేస్తూ ఉంటుంది

టార్చర్ చేస్తూ ఉంటుంది

నా భార్య నన్ను రోజూ ఏదో ఒక విషయంలో టార్చర్ చేస్తూ ఉంటుంది. వాస్తవానికి భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని ఉంటాడని భార్య అనుమానిస్తుంటుంది. కానీ నా విషయంలో మాత్రం నేను తనని అనుమానించాల్సి వస్తుంది. నా భార్యకు ఆమె చదువుకునే రోజుల నుంచి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడట.

బంధం తెగిపోయిందని

బంధం తెగిపోయిందని

మా పెళ్లి తర్వాత వారి బంధం తెగిపోయిందని నా భార్య నాకు చెప్పింది. నేను కూడా ఆ విషయాన్ని మర్చిపోయాను. కానీ ఈ మధ్య నేను ఎప్పుడూ ఫోన్ చేసినా కూడా ఎంగేజ్ వస్తుండడంతో నాకు డౌట్ వచ్చింది. దీంతో మా ఇద్దరి మధ్య రోజూ గొడవలు అవుతూ ఉన్నాయి.

కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి

కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి

అయితే నా భార్యతో గొడవపడుతుంటే నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌కు చెందిన స్వాతి, సుధాకర్ రెడ్డిల కథ నాకు గుర్తొచ్చింది. స్వాతి నడుము నొప్పితో బాధపడుతుండగా చికిత్స కోసం వెళ్లి రాజేశ్ అనే ఫిజియోథెరపిస్ట్ తో పరిచయం ఏర్పరుచుకోవడం... అదికాస్తా వివాహేతర సంబంధానికి దారి తీయడం.. తర్వాత భర్తను చంపడం మనకు తెలిసిన కథే.

ఇదంతా వాస్తవంగా జరిగిందే.. మనం అందరం పేపర్లలో, టీవీలలో ఈ వార్తను చూశాం కూడా. నాకు కూడా ఇప్పుడు ఆ విషయమే గుర్తొస్తుంది. నా భార్య కూడా అలా నన్ను చంపేస్తుందేమోనని భయం వేస్తుంది.

దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో

దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో

ఇక తన భర్త మద్యం తాగి చనిపోయాడని, మామ కూడా చావుబతుకుల్లో ఉన్నాడని ఇటీవలే దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో నాగమణి అనే మహిళ కేసు పెట్టిన విషయం కూడా నాకు గుర్తొచ్చింది. వాస్తవానికి ఆమె భర్త సేవించిన మద్యం నమూనాలను పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబోరేటరీకి పంపగా.. అందులో విషం ఉన్నట్టు బయటపడింది.

భర్త అడ్డుగా వస్తున్నాడని

భర్త అడ్డుగా వస్తున్నాడని

ఈ పని భార్యే చేసిందని పోలీసులు ఆ తర్వాత నిర్ధరించారు. తన ప్రియుడితో ఉన్న సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని ఆమె ఇలా చేసినట్లు బయటపడింది. ఇప్పుడామె కటకటాలు లెక్కపెడుతోంది. నా భార్య ఇంతకు ముందు నేను తాగే మందులో నీళ్లు కలుపుతూ సాయం చేసేది. కానీ ఈ వార్త విన్నాక నేను నేను ఇంట్లో మందు తాగుతున్నప్పుడు నా భార్యను అటువైపు అస్సలు రానివ్వను.

సరస్వతి కథ

సరస్వతి కథ

ఇక సరస్వతి అనే ఆమె గౌరీశంకర్‌ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన కొన్ని రోజులకే గౌరీశంకర్‌ చావుకు కుట్ర పన్నింది. ఈ వార్త కూడా నేను ఈ మధ్యే చదివాను. ఆమెకు పెళ్లికి ముందే ఫేస్‌బుక్‌లో శివ అనే అబ్బాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడం... తమ ప్రేమకు గౌరీశంకర్‌ అడ్డుగా ఉన్నాడని విశాఖకు చెందిన సుపారీ గ్యాంగు ద్వారా చంపించడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అది గుర్తొచ్చినప్పుడు కూడా నా భార్యను బైక్ పై ఎక్కించుకుని ఎక్కడికైనా వెళ్లాలంటే భయం వేస్తుంది.

వృత్తిపరంగా ఉన్నతస్థానాల్లో ఉన్నవాళ్లం

వృత్తిపరంగా ఉన్నతస్థానాల్లో ఉన్నవాళ్లం

ఇక మా స్టోరీకి వద్దాం. మేమిద్దరం వృత్తిపరంగా ఉన్నతస్థానాల్లో ఉన్నవాళ్లమే. నేను పనిభారంతో ఎప్పుడూ అలసిపోయి ఇంటికొచ్చేవాణ్ని. ఓసారి కాఫీ చేసివ్వమని నా భార్యని అడిగాను. తాను విసుక్కుందని నేను ఒక మాట అన్నాను ఇక ఆ రోజు నుంచి నాకు నరకం అంటే ఏంటో చూపిస్తూ వస్తోంది నా భార్య. కొన్నాళ్ల తర్వాత తన పుట్టింటికి నన్ను తీసుకెళ్లి.. అక్కడ తల్లిదండ్రుల బలంతో నన్ను వేదనకు గురి చేసింది.

ఏదో ఒక వంకతో హింసిస్తుంది

ఏదో ఒక వంకతో హింసిస్తుంది

ఇక ఆమెతో రాజీ కోసమని నేను ఎన్ని చేసినా కూడా ఏదో ఒక వంకతో హింసిస్తుంది. రాత్రి పూట నా పక్కను అస్సలు పడుకోదు. ఇక నేను ఆ బాధ తట్టుకోలేకపోతుంటే.. ఈ మధ్య మరో అబ్బాయితో నా భార్య తిరుగుతుందని నాకు వేరే వాళ్లు చెప్పారు. నేను కూడా చూశాను. మా ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకోవడంతో నేను పోలీసుల్ని ఆశ్రయించాను.

పరువు పోతుందనుకుని

పరువు పోతుందనుకుని

అయితే నాలాగే చాలా మంది భార్యలతో ఇబ్బందిపడుతున్నారని నాకు తెలిసింది. ఇలాంటి కేసుల్లో చాలామంది భర్తలు పరువు పోతుందనుకుని బయటికి రానీయడం లేదట. పోలీస్‌స్టేషన్లలో నమోదవుతున్న కుటుంబ హింస కేసుల్లో దాదాపుగా 10 శాతం వరకు భర్తలు పెట్టినవే ఉంటున్నాయని నాకు తెలిసింది.

కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి

కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి

అసలు భర్త భార్య విషయంలో ఎందుకు బయపడుతున్నాడంటే.. అనుమానాలు, అక్రమ సంబంధాలు, మనస్పర్థలే ప్రధాన కారణం. భర్తల్ని హింసకు గురి చేస్తున్న భార్యల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయని నాకు కొందరు నిపుణులు చెప్పారు. అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయడం. ..ఇదివరకే మరో వ్యక్తితో ప్రేమానుబంధం ఉండటమే ఇందుకు కారణం అట.

పగ ప్రతీకారాలకు

పగ ప్రతీకారాలకు

ఇక కొందరు భార్యలు టీవీల్లోని ధారావాహికలు, ఇతర మాధ్యమాల ప్రభావం. కోపతాపాలు, పగ ప్రతీకారాల పాత్రలకు ప్రభావితం అవుతున్నారట. ఇక ఇద్దరిలోనూ సహనం లేకపోవడం, సర్దుబాటు ధోరణి కానరాకపోవటం వల్ల సమస్య తీవ్రమవుతోందట.

చిన్నచిన్న తగాదాలే

చిన్నచిన్న తగాదాలే

సంసారంలో అనుమానం.. దృఢమైన బాంధవ్యం లేకపోవటం.. చిన్నచిన్న తగాదాలే భర్తలు ఇబ్బందులుపడడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయని కొందరు నిపుణులు నాకు చెప్పారు. ఇక మహిళల పరంగా పూర్తి రక్షణకు చట్టాలున్నా.. భర్తల తరఫున కేసుల నమోదుకు పోలీసులు కూడా కాస్త ఆలోచించాల్సి వస్తోంది. సాధ్యమైనంతవరకు ఆలుమగల మధ్య రాజీ కుదర్చడానికే వారు ప్రయత్నిస్తున్నారు.

మేమే రాజీ అయ్యాం

మేమే రాజీ అయ్యాం

అయితే నాకు నా భార్యకు జరిగిన గొడవ విషయంలో మాత్రం మేమే రాజీ అయ్యాం. ప్రస్తుతం నా భార్య నన్ను బాగానే చూసుకుంటుంది. అయినా ఏ భార్య కూడా భర్తను అలా దారుణంగా చంపి జీవితాన్ని నాశనం చేసుకోకూడదని నేను కోరుకుంటున్నా. కొందరు భర్తలు తమ భార్యలని సక్రమ మార్గంలో పెట్టుకునే క్రమంలో ప్రాణాలు కోల్పొవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఏ భర్తకు రాకుండా కఠిన మైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నా.

English summary

my wife has been mentally torturing me since my marriage

my wife has been mentally torturing me since my marriage
Story first published:Wednesday, June 6, 2018, 16:55 [IST]
Desktop Bottom Promotion