Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మా ఆవిడను ఆ సమయంలో టచ్ చేస్తే తంతుంది, ముద్దు పెడితే చెంప చెళ్లుమన్పించింది, శృంగారం మాట ఎత్తితే
ఒకసారి తాను పెయిన్ తో ఇబ్బందిపడుతుంటే నిమ్మకాయ నీళ్లు ఇచ్చాను తాగింది. తర్వాత తల నిమిరాను. ఏమీ అనలేదు. తర్వాత ముద్దుపెట్టుకోబోయాను. అంతే చెంపపై చెళ్లుమన్పించింది. నీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా ఎందుక
ప్రశ్న : నేనంటే నా భార్యకు చాలా ఇష్టం. నాకు తాను ఎప్పుడు కూడా ఎదురు చెప్పదు. నాపై విపరీతమైన ప్రేమ కురిపిస్తూ ఉంటుంది. అలాంటి అమ్మాయి నా భార్యగా రావడం నిజంగా నా అదృష్టం. నా మాటను అస్సలు జవదాటని నా భార్య ఒక సమయంలో మాత్రం ఎలా అంటే ప్రవర్తిస్తుంది.

నెలసరి వచ్చిన సమయంలో
తనకు నెలసరి వచ్చిన సమయంలో నేను తనని ముట్టుకుంటే కోప్పడుతుంది. ఆ సమయంలో తాను పెయిన్ తో బాధపడుతూ ఉంటుంది. కాస్త దగ్గరకు తీసుకుని నా ఒళ్లో పడుకోబెట్టుకుని తనను ఓదార్చుదామని నేను అనుకుంటాను. అయితే తనను టచ్ చేస్తే చాలు అంతెత్తు ఎగిరిపడుతుంది.

చెంపపై చెళ్లుమన్పించింది
ఒకసారి తాను పెయిన్ తో ఇబ్బందిపడుతుంటే నిమ్మకాయ నీళ్లు ఇచ్చాను తాగింది. తర్వాత తల నిమిరాను. ఏమీ అనలేదు. తర్వాత ముద్దుపెట్టుకోబోయాను. అంతే చెంపపై చెళ్లుమన్పించింది. నీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా ఎందుకలా ప్రవర్తిస్తావంటూ మండిపడింది.

సెక్స్ లో పాల్గొందామా అన్నాను
తర్వాత పెయిన్ తగ్గాక సెక్స్ లో పాల్గొందామా అన్నాను. నాతో నువ్వు అస్సలు మాట్లాడొద్దు అంటూ చాలా సీరియస్ అయ్యింది. మా ఆవిడను ఆ సమయంలో టచ్ చేస్తే ఎందుకు తంతుందో అర్థం కావడం లేదు. ఏం చెయ్యమంటారు, ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుందో చెప్పండి. దయజేసి నాకు ఈ విషయంలో కాస్త సలహా ఇవ్వండి.

చిరాగ్గా ఉంటారు
సమాధానం : నెలసరి సమయంలో కొందరు అమ్మాయిలు చాలా చిరాగ్గా ఉంటారు. మీ భార్య కూడా ఆ కోవకు చెందిన ఆమెలా ఉన్నారు. అందుకే ఆ సమయంలో మీరు ఆమె ఒంటిపై ప్రేమతో చెయ్యి వేసినా కూడా ఆమెకు మండుతుంది.

పెయిన్ తో అల్లాడిపోతున్నప్పుడు
కొందరు అమ్మాయిలు నెలసరి సమయంలో భర్త తమను దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటారు. కొందరు మాత్రం చాలా చిరాగ్గా ఉంటారు. అందువల్ల మొదట వారి అభిప్రాయం తెలుసుకుని వారిని దగ్గరకు తీసుకుంటే మంచిది. ఆమె పెయిన్ తో అల్లాడిపోతున్నప్పుడు మీరు ముద్దుపెట్టుకోవడం వల్లే మిమ్మల్ని కొట్టి ఉంటుంది. అంతేకానీ మీ మీద ప్రేమలేక కాదు.

సెక్స్ మాట ఎత్తితే
మళ్లీ తాను మామూలు స్థితికి వచ్చాక మీరు ఆమెతో మాట్లాడండి. ఆ సమయంలో ఆమెకు మీరు ఎలా ప్రవర్తిస్తే నచ్చుతుందో తెలుసుకుని అలాగే ప్రవర్తించండి. ఇక చాలా మంది ఆడవారికి ఆ సమయంలో సెక్స్ మాట ఎత్తితే కూడా బాగా చిరాకు వస్తుంది. ఆ సమయంలో ఏం చేస్తే తనకు నచ్చుతుందో తెలుసుకుని అవి మాత్రమే చేయండి.



Click it and Unblock the Notifications